EPAPER

Sankranti Rush : సంక్రాంతి సందర్భంగా పెరిగిన రద్దీ.. ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

Sankranti Rush : సంక్రాంతి సందర్భంగా పెరిగిన రద్దీ.. ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

Sankranti Rush : సంక్రాంతి పండుగ సందర్భంగా నగరాలలో నివసించే ఏపీ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైవేలపై వాహనాల సంఖ్య పెరిగి భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో టోల్‌బూత్‌ల మధ్య ట్రాఫిక్‌ క్లియర్‌ చేయటం కోసం టోల్‌ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.


టోల్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి సందర్బంగా జాతీయ రహదారి హైవేలపై వాహనాల రద్దీ పెరిగింది. పంతంగి, కొర్లపహాడ్, మాడ్గులపల్లి వద్ద వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు టోల్ బూత్‌లను సిబ్బంది ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్‌ కొంత తగ్గింది.

సంక్రాంతి సందర్బంగా విజయవాడ బస్టాండ్‌ వద్ద ప్రయాణీకుల రద్దీ పెరిగింది. బస్టాండు ప్లాట్‌ఫాములు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు ప్రజలు చేరుకుంటున్నారు. జనాలతో రద్దీ పెరగటంతో ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.


హైదరాబాద్‌-విజయవాడ హైవేపై గల పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ సహా జిల్లాల నుంచి ఏపీకి జనం పోటెత్తి వెళ్తుండటంతో.. యాద్రాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉంది. టోల్‌ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ నెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సందర్భంగా సెలవులు ప్రకటించింది తెలంగాణ సర్కార్‌. పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి తమ సొంత ఊరి బాట పట్టారు జనం. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై గల పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ సూచనలిస్తున్నారు అధికారులు.

.

.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×