EPAPER

Sankranti 2024 : ఊరూ.. వాడ సంక్రాంతి శోభ.. కళకళలాడుతున్న పల్లెటూళ్లు

Sankranti 2024 : ఊరూ.. వాడ సంక్రాంతి శోభ.. కళకళలాడుతున్న పల్లెటూళ్లు

Sankranti 2024 : ఊరూవాడలా సంక్రాంతి శోభ నెలకొంది. ఎక్కడ చూసినా చక్కని ముగ్గులు, అందమైన అమ్మాయిలు, పండుగకు వండే పిండివంటలు. ఉదయమే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను వేశాకే అందం వస్తుందంటే అతిశయోక్తి కాదు. ఊరువాడా కలసి చేసే సంక్రాంతి సందడి చూడాలంటే రెండు కళ్లూ సరిపోవు.


సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా.. సరదాలు తెచ్చిందే తుమ్మెదా అంటూ సాగే పాటలోనే సంక్రాంతి వైభవం గురించి మనసులో భావాన్ని కవి ఆవిష్కరించారు. అంతటి సరదాల పండుగ సంక్రాంతి తెలుగురాష్ట్రాల్లో సందడిగా సాగుతోంది. గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. అనేక ప్రాంతాల్లో ఉద్యోగ రిత్యాస్థిర పడి న యువత స్వగ్రామాలు చేరుకున్నారు. ఫలితంగా రెండు రోజులు ముందుగానే సంక్రాంతి వేడుకలు కనువిందు చేస్తున్నాయి. గ్రామాల్లో ఆటస్థలాలు పలురకాల పోటీలతో నిండిపోయాయి. కొత్తగా పెళ్లైన యువతులు భర్తలతో కలిసి కన్నవారింటికి చేరుకున్నారు. పండుగకు ప్రత్యేకంగా నిలిచే వంటకాలను వండి.. బంధువులకు వడ్డిస్తున్నారు. అరిసెలు, పొంగడాలు, కజ్జి కాయలు తదితర పిండి వంటకాలు అన్ని ఇళ్లలో తయారు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు.

ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారంతా.. సంక్రాంతి పండక్కి మాత్రం స్వగ్రామాలకు వస్తారు.చాలా ప్రాంతాల్లో క్రీడాపోటీలను నిర్వహిస్తారు. వేకువజామున లేచి ఇంటి ముందు కల్లాపి చల్లి రంగవల్లికలు వేసి, గొబ్బెమ్మలు పెట్టి పూజలు నిర్వహిస్తారు. సంస్కృతి, సంప్రదాయబద్దంగా వస్తున్న పద్దతులను అనుసరిస్తూనే.. బంధువులతో పాటు ఇరుగుపొరుగు వారికి వండిన వంటలు ఇచ్చి.. గౌరవించుకుంటారు.


సంక్రాంతి రోజు..అమ్మాయిలు లంగా వోణీలు వేసుకుని ఊర్లో సందడి చేస్తారు. ఇతర సమయాల్లో మోడ్రన్ డ్రస్సులతో ఉన్నా.. పండుగ మూడ్రోజులు మాత్రం సాంప్రదాయబద్దంగా తయారై.. బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెబుతారు. సంక్రాంతి అంటే గుర్తు వచ్చేది ముగ్గుల పోటీ. మహిళల్లో ఉత్సాహం నింపేందుకు.. చాలా ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తారు. అందులో గెలుచుకున్న వారికి ఖరీదైన బహుమతులు కూడా ఇస్తారు. మొత్తానికి సంక్రాంతి అంటే సంతోషం.. ఉల్లాసం.. ఉత్సాహం.

సంక్రాంతి పండుగలో మరో ప్రత్యేకత.. సోదమ్మ చెప్పే కబుర్లు. అమ్మ పలుకు జగదాంబ అంటూ పల్లెల్లో జాతకాన్ని అమ్మోరే చెప్పినట్లుగా చెప్పే సోదమ్మలు సంక్రాంతికి మాత్రమే కనిపిస్తున్నారు.. మర్చిపోతున్న ఆ యాస, భాషతో ఎదురుగా ఉన్న వాళ్ళను తమ మాటలతో మెప్పించే సోదమ్మల సంచారం కనుమరుగు అయిపోతుంది. కానీ ఇప్పటికీ పల్లెటూళ్లలో సోదమ్మలతో జాతకాలు చెప్పించుకుంటారు.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×