EPAPER

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

Road accident in Annamayya district: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప-చిత్తూరు జాతీయ రహదారిపై ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలోె నలుగురు స్పాట్‌లో దుర్మరణం చెందారు.


వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని కలకడ మండలంలోని గుట్టపల్లి వద్ద కడప, చిత్తూరు హైవేపై ఆటోను ప్రైవేట్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే ఇద్దరు గాయపడినట్లు తెలిపారు.

సీఎంఆర్ ట్రావెల్స్ బస్సు చిత్తూరు జిల్లా పీలేరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా.. సంబేపల్లి మండలంలోని దేవపట్ల నుంచి సొరకాయల పేటకు ఆటో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.


Also Read: పీకల్లోతు కష్టాల్లో బోరుగడ్డ!

అన్నమయ్య జిల్లా కలకడ‌ మండంలోని దేవపట్ల పంచాయతీ వంగమల్లవారిపల్లి వద్ద ఓ కుటుంబంలోని వ్యక్తి చనిపోవడంతో దహన సంస్కారాలు అనంతరం తిరిగి ఆటోలో వస్తున్న సమయంలో ఆటోను బస్సు ఢీకొట్టింది. మృతి చెందిన నలుగురిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గాయాలైన ముగ్గురిని మహల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కలకడ ఇందిరమ్మ కాలనీ సమీపంలో టీహెచ్‌బీ డాబా వద్ద సుమారు 10 గంటల సమయంలో జరిగిందని తెలిపారు.

మృతులు కలికిరి మండలం చంద్రవారి పల్లి పంచాయతీ దూదేకులపల్లికి చెందిన ఖాదరవల్లి (35), నిలిమందకు చెందిన నూరుల్లా (32), చెండావారిపల్లి పంచాయతీ దూదేకులపల్లికి చెందిన బుజ్జమ్మ(60) నెల్లిమందకు చెందిన పకీరమ్మ (65)లు
మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ గురునాథ్, ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కలకడ, సంబేపల్లి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Related News

Borugadda: పీకల్లోతు కష్టాల్లో బోరుగడ్డ!

AP Speaker Ayyanna Patrudu: నమస్కారం పెట్టాల్సిందే..

Sharmila on YS Jagan: మోడీ వారసుడిగా జగన్.. అవి ఎప్పుడో మర్చిపోయాడు.. వైయస్ షర్మిళ

Super Six in AP: సూపర్ సిక్స్ ఆలస్యం అందుకేనా.. నాలుగు నెలలవుతున్నా ఏదీ ముందడుగు?

Tirupati: ఫీజు విషయంలో ఘర్షణ.. కాలేజీ ఏఓపై కత్తితో విద్యార్థి దాడి

Diarrhea In Gurla: పవన్ కళ్యాణ్ అలా వెళ్లారు.. ఇలా ఒక ప్రాణం పోయింది.. ఈ మరణాలను ఆపాలని లేదా.. బొత్స సూటి ప్రశ్న

Big Stories

×