వాడొక మానవ మృగం. నిండు నూరేళ్లు నవ్వుతూ బతకాల్సిన చిన్నారి చిట్టితల్లిని.. చాక్లెట్ ఇస్తానని నమ్మించి, తీసుకెళ్లి, మృగవాంఛ తీర్చుకుని, గొంతు నులిమి చంపేశాడు. చంపి పూడ్చి పెట్టాడు. పోలీసుల విచారణలోను మాయమాటలు చెప్పి, తప్పించుకునే ప్రయత్నం చేసినా, వాళ్లు తమదైన శైలిలో అడిగేసరికి నిజం బయటకు కక్కాడు. చూశారుగా.. తాజాగా తిరుపతిలో జరిగింది ఈ ఘటన.. అభం శుభం తెలియని చిన్నారిని కిరాతకుడు దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు.
అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి రోజా స్పందించారు. కూటమి ప్రభుత్వం నాయకులు టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదని రోజా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక 100 మందికి పైగా ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని ఆర్కే రోజా విమర్శించారు.
Also Read: తిరుపతిలో దారుణం.. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం!
ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్ వెళ్లి అన్‌స్టాపబుల్ షోలో పాల్గొని ఎంజాయ్ చేస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే ఉన్మాదులు, నేరస్థులు పేట్రేగిపోతున్నారన్నారని మండిపడ్డారు. మద్యం షాపుల పెంపుదల, గంజాయి వాడకం పెరగడం వల్లే మహిళలపై, చిన్నారులపై దాడులు పెరుగుతున్నాయన్నారు.