EPAPER

Reporter Damodar: శ్రీకాకుళంలో విషాదం.. రిపోర్టర్ ఆత్మహత్య.. ఎమ్మెల్యే కారణమా ?

Reporter Damodar: శ్రీకాకుళంలో విషాదం.. రిపోర్టర్ ఆత్మహత్య.. ఎమ్మెల్యే కారణమా ?
ap news live

Reporter Damodar Death News(AP news live):

శ్రీకాకుళంలో తీవ్ర విషాదం నెలకొంది. లావేరు మండలంకు చెందిన ఓ ప్రముఖ దినపత్రిక రిపోర్టర్‌ దామోదర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన చావుకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో పాటు లంకలపల్లి గోపి కారణమని సూసైడ్‌ నోట్‌ రాశారు. ఎమ్మెల్యే వేధింపులతో తను తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నానని.. తన చావుకు కారణమైన ఎమ్మెల్యేతో పాటు ఎవరినీ విడిచిపెట్టొద్దని సూసైడ్‌నోట్‌లో విజ్ఞప్తి చేశాడు దామోదర్‌.


అయితే దామోదర్‌ ఆత్మహత్యపై స్పందించిన ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌.. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. దామోదర్‌ రిపోర్టరే కాదు.. క్రియాశీల కార్యకర్త కూడా అని తెలిపారు. గత 3 రోజుల క్రితం దామోదర్‌ తప్పిపోయినట్లు తెలిసిందని.. ఈ విషయంపై అతని ఆచూకీ కోసం పోలీసులను కూడా ఆదేశించినన్నారు. దామోదర్‌ ఆత్మహత్యతో తనకు సంబంధం ఉందనేదాని తనపై ఏదో కుట్రకోణం దాగుందని అనుమానం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఇటీవలి కాలంలో మాట్లాడిన తన ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ ఆధారంగా దర్యాప్తు చేసి నిజాలు నిగ్గుతేల్చాలని పోలీసులను కోరినట్లు ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ తెలిపారు. దామోదర్ కేవలం రిపోర్టర్ మాత్రమే కాదని.. క్రియాశీల కార్యకర్త కూడా అన్నారు. మూడురోజులుగా అతను కనిపించడంలేదని తనకు తెలియడంతో.. సీఐకి, స్థానిక ఎస్సైకి అతని ఆచూకీ తెలుసుకోవాలని చెప్పినట్లు ఎమ్మెల్యే కిరణ్ కుమార్ తెలిపారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×