EPAPER
Kirrak Couples Episode 1

YS Sharmila : పెళ్లి ఆహ్వానమా..? అన్న ఓటమి కోసమా..?

YS Sharmila : పెళ్లి ఆహ్వానమా..? అన్న ఓటమి కోసమా..?

YS Sharmila : టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన కొడుకు వివాహ ఆహ్వానం అందజేయడానికే చంద్రబాబుని కలిసానని షర్మిల అంటున్నారు.. అయతే దాదాపు 20 నిమిషాల పాటు సాగిన వారి భేటీలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు, షర్మిల భేటీ చర్చనీయాంశంగా మారింది. గతంలో తన తండ్రికి రాజకీయ ప్రత్యర్ధిగా ఉంటూ, తన అన్న కోసం ప్రచారం చేసిన సమయంలోనూ టార్గెట్ గా ఉన్న చంద్రబాబును ఇవాళ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలవటం వైసీపీ శ్రేణులకు మింగుడు పడుతున్నట్లు కనిపించడం లేదు.


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తాజాగా చంద్రబాబు నివాసంలో కలిశారు. గతంలో వైఎస్ హయాంలో ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్‌కి ప్రధాన ప్రత్యర్ధి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో జగన్ తరపున ప్రచారం చేసిన షర్మిల సైతం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. బైబై బాబు అంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్ వినిపించారు.

అలాంటి షర్మిల తాజాగాచంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాలలోను, ప్రజలలోను ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో షర్మిల భేటీ ఉత్కంఠ రేపుతోంది. షర్మిల స్వయంగా చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్‌లను రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన ఆమె తర్వాత మీడియా ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించాను అని తెలిపారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో వివాహానికి చంద్రబాబు వస్తానని చెప్పారని.. తమ భేటీలో దివంగత వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని షర్మిల పేర్కొన్నారు.


ఎన్నికలలో కాంగ్రెస్ ఏ బాధ్యత అప్పగించినా, తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని వైయస్ షర్మిల స్పష్టం చేస్తున్నారు. కావాలని ప్రతీది రాజకీయం చేస్తున్నారని పేర్కొన్న షర్మిల క్రిస్మస్ పండుగ సందర్భంగా చంద్రబాబుకు, లోకేష్ కు స్వీట్లు పంపామని కేటీఆర్ కు, కవితకు, హరీష్ రావుకు కూడా స్వీట్లు పంపామని చెప్పుకొచ్చారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఏదేమైనా షర్మిల వెళ్లి చంద్రబాబును కలవడంతో వైసీపీ శ్రేణులు ఉలిక్కిపుడుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ లీడర్‌గా ఏపీ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తుండటమే వారికి మింగుడుపడటం లేదు… షర్మిల కాంగ్రెస్ బాట పట్టకుండా చేయడానికి వైసీపీ అధిష్టానం రాయబారాలు నడిపిందని.. అవి ఫలించలేదన్న ప్రచారం ఉంది. ఆ క్రమంలో షర్మిల ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీ, సోనియాల సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. అప్పటికే ఆ క్రిస్టమస్ పండుగ సందర్భంగా నారా లోకేశ్‌కు గిఫ్ట్ పంపారు. దానిపై వైసీపీ నేతలు నానా రాద్దాంతం చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి కొడుకు పెళ్లికి ఆహ్వానించడంతో తెగ ఉడికిపోతున్నారంట.

అయితే చంద్రబాబుకు తనకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవని చెప్పిన షర్మిల.. ఎవరు ఏ పార్టీలో ఉన్నా ప్రజల సేవ చేయడం కోసమే ఉన్నామని చెప్తున్నారు. తామంతా ప్రజల కోసమే ఉన్నామని చెప్పడం ద్వారా ఆమె టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు ఇచ్చారని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా షర్మిల వెళ్లిచంద్రబాబుతో భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కీలక మార్పులకు సంకేతంగా చెప్పొచ్చని అంచనా వేస్తున్నారు.

ఎన్నికల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా తయారయ్యాయి.. ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతుంటే, కొత్త కొత్త ఎత్తుగడలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. డైరెక్టుగా అనకపోయినా షర్మిల, చంద్రబాబు వదిలిన బాణం అనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. షర్మిలకు ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉందని.. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉన్నట్లు కనిపిస్తోందని.. ఆమె కాంగ్రెస్‌లో చేరడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని.. ఏపీలో కాంగ్రెస్‌కి భవిష్యత్తు లేదు, ఆ పార్టీని మేము పట్టించుకోబోమని సజ్జల వ్యాఖ్యానించారు.

నిజంగా షర్మిల అడుగుల వెనక చంద్రబాబు ఉన్నారా అంటే క్లారిటీ కనిపించదు. కానీ.. జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే, ఇదే నిజమనిపిస్తోందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు అనూహ్యమైన ఎత్తుగడ వేశారనే చర్చ జరుగుతోంది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఏపీలో టీడీపీ ఓటు బ్యాంకు చెదిరిపోకుండా అలాగే ఉంది. మరోవైపు జనసేనకు కాపు వర్గం ఓటు బ్యాంకు అండగా నిలుస్తోంది… ఇలాంటి తరుణంలో వైసీపీని ఎన్నికల్లో ఓడించాలంటే, రెడ్డి వర్గంతో పాటు క్రిస్టియన్ ఓటు బ్యాంకును చీల్చాల్సి ఉంటుందని చంద్రబాబు భావించి. అందుకే షర్మిలను కాంగ్రెస్‌లో చేర్పించారని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.. ఆమె ఏపీ కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపడితే.. వైసీపీ వైపు మళ్లిన కాంగ్రెస్ ఓటుబ్యాంకులో కూడా చీలక వస్తుందని.. అలా వైసీపీ ఓటు బ్యాంకును చీల్చడమే అసలు వ్యూహమని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

షర్మిల వెనక టీడీపీ ఉంది కాబట్టే.. ఇటీవల ఆమె క్రిస్టమస్ గిఫ్టును నారా లోకేష్‌కి పంపారని.. తెలంగాణలో అందుకే కాంగ్రెస్‌కి మద్దతిస్తూ ఆమె ఎన్నికల్లో పోటీ చెయ్యలేదనీ.. తద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు పరోక్ష సాయం చేశారని. దాని వెనక కూడా చంద్రబాబు వ్యూహం ఉందనే ప్రచారం తెరపైకి వస్తోంది. అన్న జగన్‌పై వ్యతిరేకతతో ఉన్నషర్మిల … జగన్‌తో సన్నిహితంగా ఉండే కేసీఆర్‌ను ఓడించడానికి తనవంతు ప్రయత్నం చేశారంటున్నారు .. ఏదేమైనా షర్మిల ఎంట్రీతో జగనన్న వదిలిన బాణం రివర్స్ అయింది. ఇక ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకుంటాయో చూడాలి.

.

.

Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×