EPAPER

Razole Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. రాజోలుకు రాజు అతనేనా..?

Razole Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. రాజోలుకు రాజు అతనేనా..?
Andhra politics news

Razole Assembly Constituency(Andhra politics news):

కోనసీమలో కీలక నియోజకవర్గం రాజోలు. ఇది ఎస్సీ రిజర్వ్ డు. ఇక్కడ పొలిటికల్ సినారియో డిఫరెంట్ గా కనిపిస్తుంటుంది. గత ఎన్నికల్లో ఇక్కడ రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాకే. అయితే ఆ తర్వాతి కాలంలో నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ వైసీపీకి అనుబంధంగా మారిపోయారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ జనసేన, వైసీపీ, టీడీపీ ఈ మూడు పార్టీలు పోటా పోటీగా తలపడ్డాయి. ఈ మూడు పార్టీలు యావరేజ్ గా 30 శాతం ఓట్లు రాబట్టాయి. ప్రస్తుతం రాజోలు ఏపీ రాజకీయాల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారింది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ … తమ పార్టీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తారని ప్రకటించారు. టీడీపీ అభ్యర్థులకు కౌంటర్ గా ఈ సీటులో పోటీపై పవన్ క్లారిటీ ఇవ్వడం కీలకంగా మారింది. మరి రాజోలు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

రాపాక వరప్రసాద్ (JSP) (WON) VS బొంతు రాజేశ్వరరావు


YCP 33%
TDP 30%
JSP 33%
OTHERS 4%

2019 ఎన్నికల్లో రాజోలు సెగ్మెంట్ లో వైసీపీ 32.91 శాతం ఓట్లు సాధిస్తే… జనసేన నుంచి పోటీ చేసిన రాపాక వర ప్రసాద్ 33 శాతం ఓట్లు రాబట్టుకుని గెలిచారు. ఇక టీడీపీ 30 శాతం ఓట్లు సాధించింది. మరి ఈసారి ఎన్నికల్లో రాజోలు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

రాపాక వర ప్రసాద్ (YCP)

రాపాక వర ప్రసాద్ ప్లస్ పాయింట్స్

  • నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు
  • జనంలో మంచి ఇమేజ్ ఉండడం
  • గ్రౌండ్ లెవెల్ లో ప్రచారం పెంచిన రాపాక

రాపాక వర ప్రసాద్ మైనస్ పాయింట్స్

  • సఖినేటిపల్లి నర్సాపురం బిడ్జి నిర్మాణం ఆలస్యమవడం
  • గ్యాస్ పైప్ లైన్లు తరచూ లీకేజ్ అవడం
  • రాజోలులో తాగునీటి సమస్య తీవ్రమవడం
  • వైసీపీకి అనుబంధంగా మారినా అంతగా అభివృద్ధి చెందని రాజోలు
  • బలమైన క్యాడర్ సపోర్ట్ లేకపోవడం

గొల్లపల్లి సూర్యారావు (TDP)

గొల్లపల్లి సూర్యారావు ప్లస్ పాయింట్స్

  • ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు
  • గొల్లపల్లి హయాంలో జరిగిన అభివృద్ధి
  • టిక్కెట్ ఎవరికి వచ్చినా సపోర్ట్ చేసే పరిస్థితులు

బొంతు రాజేశ్వర్ రావు (JSP)

బొంతు రాజేశ్వర్ రావు ప్లస్ పాయింట్స్

  • గతంలో రెండుసార్లు ఓడిన సానుభూతి
  • టీడీపీ సపోర్ట్ తో గెలుపు ఈజీ అన్న అభిప్రాయం
  • బలమైన క్యాడర్ సపోర్ట్

దేవ వర ప్రసాద్ (JSP)

దేవ వర ప్రసాద్ ప్లస్ పాయింట్స్

  • బలమైన క్యాడర్ ఉండడం
  • నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడం
  • రిటైర్డ్ ఐఏఎస్ గా జనంలో గుర్తింపు
  • పవన్ కల్యాణ్ ఇమేజ్

ఇక వచ్చే ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

రాపాక వర ప్రసాద్ VS బొంతు రాజేశ్వరరావు

YCP 38%
JSP 57%
OTHERS 5%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. రాజోలులో వైసీపీ నుంచి రాపాక వరప్రసాద్, జనసేన నుంచి బొంతు రాజేశ్వరరావు బరిలో దిగితే జనసేన గెలిచేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ జనసేన అభ్యర్థి 57 శాతం ఓట్లు సాధించి గెలిచే ఛాన్సెస్ ఉందని తేలింది. అదే సమయంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ 38 శాతం ఓట్లు సాధిస్తారని వెల్లడైంది. అలాగే ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. 2014, 2019లో పోరాడి ఓడిన రాజేశ్వరరరావు పట్ల జనంలో సానుభూతి ఓటు పెరుగుతుందని తేలింది. అయితే ఇక్కడ టిక్కెట్ రేసులో రాపాక రమేశ్ బాబు, దేవ వర ప్రసాద్ కూడా ఉన్నారు. కానీ ఎవరికి టిక్కెట్ దక్కినా సహకారం అందిస్తామని అంటున్నారు.

రాపాక వరప్రసాద్ VS దేవ వరప్రసాద్

YCP 41%
JSP 54%
OTHERS 5%

ఇక రాజోలులో రాపాక వరప్రసాద్ పై జనసేన నుంచి దేవ వరప్రసాద్ పోటీ చేస్తే గెలుపు అవకాశాలు జనసేన పార్టీ వైపే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ జనసేన అభ్యర్థిగా దేవ వరప్రసాద్ పోటీ చేస్తే 54 శాతం ఓట్లు సాధించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదే సమయంలో రాపాక వరప్రసాద్ 41 శాతం ఓట్లు రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. ఈ రాజోలులో జనసేన పార్టీకి జనం మద్దతు చాలా బలంగా కనిపిస్తోంది. 2014 నుంచి స్ట్రాంగ్ క్యాడర్ పవన్ పార్టీకి ఏర్పడింది. అయితే 2019లో ఇదే పార్టీ నుంచి గెలిచిన రాపాక వైసీపీ వైపు వెళ్లడంతో కొంత మంది కార్యకర్తల్లో, కాపు ఓటర్లలో తీవ్ర అసహనం వ్యక్తమైంది. దీంతో జనసేనకు గ్రౌండ్ లో సపోర్ట్ తగ్గినట్లు కనిపించింది. అయితే మరోసారి క్యాడర్ రంగంలోకి దిగి పార్టీని పటిష్ఠం చేసే పనిలో ఉన్నారిప్పుడు.

.

.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×