EPAPER

Punganuru | పెద్దిరెడ్డికి పోటీగా జనసేన మాజీ నేత.. వైసీపీ నేతలు కూడా వెనుక నుంచి మద్దతు?

Punganuru | చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన జనసేన మాజీ నేత రామచంద్రయాదవ్ భారత శ్రామిక యువజన పార్టీ స్థాపించారు. అయితే ఆ పార్టీ కార్యకలపాలు ఎక్కడా కనిపించవు. అసలు పార్టీకి కార్యవర్గం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. వన్ మ్యాన్ షో లాగా పార్టీపరమైన హడావుడంతా యాదవ్ ఒక్కరే చేస్తుంటారు.

Punganuru | పెద్దిరెడ్డికి పోటీగా జనసేన మాజీ నేత.. వైసీపీ నేతలు కూడా వెనుక నుంచి మద్దతు?

Punganuru | చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన జనసేన మాజీ నేత రామచంద్రయాదవ్ భారత శ్రామిక యువజన పార్టీ స్థాపించారు. అయితే ఆ పార్టీ కార్యకలపాలు ఎక్కడా కనిపించవు. అసలు పార్టీకి కార్యవర్గం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. వన్ మ్యాన్ షో లాగా పార్టీపరమైన హడావుడంతా యాదవ్ ఒక్కరే చేస్తుంటారు. పుంగనూరుకే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడా నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. యాదవ్ ఏ పార్టీ ఓట్లకు గండి కొడతారు? .. అసలు ఆయన ప్రభావం ఎంత?.. ఆయన్ని వెనకుండి నడిపిస్తోంది ఎవరు?.


రామచంద్ర యాదవ్ 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా పుంగనూరులో పోటీ చేసి 16వేల ఓట్లు దక్కించుకున్నారు. అటు పవన్ ప్రభావంతో పాటు వ్యక్తిగతంగా యాదవ్ అర్ధబలం కూడా తోడవ్వడంతో అ స్థాయిలో ఓట్లు వచ్చాయంటారు. తర్వాత యాదవ్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత కార్యకలాపాలు ప్రారంభించారు. అదే సమయంలో జాతీయ స్థాయి నాయకులను ముఖ్యంగా బిజెపి నాయకుల టచ్ లోకి వెళ్ళారు. ఆ క్రమంలో నియోజకవర్గంలో ఎదో ఒక కార్యక్రమం చేపట్టాలని హాడావుడి మొదలుపెట్టడం.. దాన్ని పోలీసులు అడ్డుకోవడం రివాజుగా మారింది. ఇక తన ఇంటి మీదా దాడి జరగడంతో బీజేపీ పరిచయాలతో కేంద్ర బలగాలను సెక్యూరిటీగా తెచ్చుకున్నారు.

ఆరు నెలల క్రితం భారత శ్రామిక యువజన పార్టీని గుంటూరు జిల్లాలో నాగార్జున మైదానంలో ఆయన ప్రారంభించారు. తన పార్టీ రెండు తెలుగురాష్ట్రాల్లో ఉంటుందని ఘనంగా ప్రకటించారు. దాంతో పాటు సభ్యత్వ డ్రైవ్ అంటూ.. ఎక్కువ సభ్యత్వాలు చేసిన వారికి నగదు బహుమతులు కూడా ప్రకటించారు. అయితే ఎంతమంది సభ్యత్వం తీసుకున్నారో? కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇక పార్టీ కార్యవర్గం సంగతి సరేసరి .. ప్రతి రాయలసీమ జిల్లాలోను బీసీలను ఆకట్టుకోవడానికి అన్నట్లు. వాల్మీకి గర్జన, కురబ గర్జన, యాదవ గర్జన పేరుతో కార్యక్రమాలు జరుపుతున్నారు.


తాజాగా పుంగనూరులో రైతు గర్జన సభ నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంట .. దీంతో మీడియా ముందుకొచ్చి తెగ హడావుడి చేశారు. తర్వాత పుంగనూరు మండలం చెదల్ల కూడా మరో కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే .. పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. పోలీసులను యాదవ్ అనుచరులు ప్రతిఘటించారు. చివరకు ఓ పోలీసు అదికారి యాదవ్ అనుచరుడిని చెప్పుతో కొట్టే వరకు వెళ్లింది పరిస్థితి. ఈ విధంగా నియోజకవర్గంలోని పుంగనూరు, సోమల, సదుం, చౌడేపల్లి మండలాల్లో కనీసం నెలకొక సారి ఎదో ఒక హాడావుడి చేయడం పనిగా పెట్టుకున్నారాయన .

యాదవ్ అనుచరులు మాత్రం మంత్రి పెద్దిరెడ్డి కి పోటిగా తమ నాయకుడు బరిలో దిగుతారని, టీడీపీ, జనసేన మద్దుతు ఇస్తాయని చెప్పుకుంటున్నారంట. అయితే టీడీపీ క్యాడర్ మాత్రం దాన్ని కొట్టి పారేస్తోంది. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన యాదవ్ తమ పార్టీ ఓట్లు చీల్చడం వల్లే.. మంత్రి పెద్దిరెడ్డి విజయం సాధించారని.. దానికి తోడు ఆయన ఓడిపోతే నియోజకవర్గంలో కనిపించరని .. అప్పుడు తమకు సెక్యూరటీ ఎవ్వరు ఇస్తారని అంటున్నారు. ఇక జనసేన క్యాడర్ అయితే పవన్‌కళ్యాణ్‌ పేరు వాడుకుని బదనాం చేశాడని .. అలాంటి వ్యక్తికి ఎలా మద్దతిస్తామని ఫైర్ అవుతోంది .

అదలా ఉంటే జనసేన, టీడీపీలు జత కట్టడంతో వారి ఓట్లు చీల్చడానికి అధికారపక్షం యాదవ్‌ వెనుకుండి కథ నడిపిస్తోందన్న వాదని కూడా వినిపిస్తోంది. అయితే ఎవరేమనుకున్నా యాదవ్ మాత్రము తన ప్రత్యర్థి పెద్దిరెడ్డి మాత్రమేనని అంటున్నారు. ఆయన విమర్శలు కూడా పెద్దిరెడ్డికి మాత్రమే పరిమితమవుతుంటాయి. ఇతర పార్టీల నేతల్ని కాని, ఆఖరికి వైసీపీని కాని పల్లెత్తు మాట అనరు . మరోవైపు రాష్ట్రంలో తన పార్టీ యాక్టివిటీస్ గురించి ఏమీ చెప్పరు. చాలావరకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు అతని టీమ్ చెపుతుంటుంది.

ఆయన టీమ్‌లో 50 మంది సభ్యులు సోషియల్ మీడియా వ్యవహారాలు చూస్తుండటం విశేషం. కొందరు మీడియా వారు ఆయనకి సలహాలిస్తూ ఉపాధి పొందుతుంటారు. ఇక గృహా ప్రవేశం వంటి అకేషన్లతో పాటు పండుగలకు సినిమా వారిని పిలిపించి పుంగనూరు వాసులకు వినోదం పంచుతుంటారు సదరు సారు. మొత్తం మీదా స్థానికంగా అంతోఇంతో పలుకుబడి ఉన్న రామచంద్రయాదవ్ పార్టీ ఎందుకు పెట్టారో? ఆయన వెనకుండి నడిపిస్తోంది ఏ పార్టీనో? ఎవరికీ అంతుపట్టడం లేదంట.

Related News

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Big Stories

×