Vishaka ODI: టెస్ట్ సిరీస్ ను చేజిక్కించుకుంది. వన్డే సిరీస్ ను విక్టరీతో స్టార్ట్ చేసింది. సెకండ్ మ్యాచ్ లో విజయం సాధిస్తే చాలు.. ఈ సిరీస్ కూడా మన ఖాతాలోకే. అంతా బాగుందనుకున్న టైమ్ లో.. మ్యాచ్ కు వరణుడి ముప్పు అనే న్యూస్ కలవరపెడుతోంది. చాలా కాలం తర్వాత క్రికెట్ మ్యాచ్ ను లైవ్ లో చూద్దామనుకున్న సమయంలో.. ఈ వార్త బ్యాడ్ లక్ అనుకోవాల్సిందే. మరి శకునం ఎటువైపు ఉన్నది..? విశాఖలో మ్యాచ్ సాగుతుందా..? ఆగుతుందా..?
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ లో సెకండ్ మ్యాచ్.. ఆదివారం విశాఖలో జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. టిక్కెట్లు అన్నీ అమ్ముడుపోయాయి. ట్రాఫిక్ ఆంక్షలను కూడా జారీ చేశారు. ఇప్పటికే విశాఖకు చేరుకున్న ఆసిస్, టీమిండియా ప్లేయర్స్ ను నోవాటెల్ లో బస చేస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. విశాఖ మ్యాచ్ కు వరణుడు అడ్డంకిగా మారాడు. నిన్నటి నుంచి తెరపినివ్వని వర్షం.. నేడు కూడా కంటిన్యూ అవుతుందని.. వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో.. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇదే న్యూస్ క్రికెట్ ఫ్యాన్స్ గుండెల్లో గుబులు పెంచుతోంది. అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న టెన్షన్ వెంటాడుతోంది. విశాఖలో దాదాపు మూడేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరుగుతుండగా.. టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడై పోయాయి.
ప్రస్తుతం క్రికెట్ స్టేడియంను పూర్తి కవర్లతో కప్పి ఉంచారు. అయితే ఎంత భారీ వర్షం పడినా.. స్టేడియంలో ఉన్న ఆధునాతన డ్రైనేజీ వ్యవస్థ వల్ల మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని విశాఖ క్రికెట్ అసోసియేషన్ చెబుతుండగా.. రోజంతా వర్షం పడే అవకాశం ఉండడంతో మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే మ్యాచ్ స్టార్ట్ అయ్యే లోగా పరిస్థితిని బట్టి.. తక్కువ ఓవర్లతో మ్యాచ్ ఆడించే అవకాశాలూ లేకపోలేదని తెలుస్తోంది.
Jagan: ఉత్తరాంధ్ర ఓటర్లు జగన్‌కు ఏం మెసేజ్ ఇచ్చినట్టు?
TSPSC: పేపర్ లీకుకు కేటీఆర్ పీఏకు లింకు!… రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు