EPAPER

Raghurama Raju complaint: ఈసారి రాజు గారు వంతు.. జగన్‌తోపాటు కొందరు అధికారులు..!

Raghurama Raju complaint: ఈసారి రాజు గారు వంతు.. జగన్‌తోపాటు కొందరు అధికారులు..!

Raghurama Raju Complaint to CID: ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. గడిచిన ఐదేళ్లు యథేచ్చగా పలువురు అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. రాజకీయ అండతో రెచ్చిపోయారు. తమను ఎవరు ఏమీ చేయలేరని భావించారు. మా విషయంలో కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని అనుకున్నారు. సీన్ రివర్స్ అయ్యింది. సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టక ముందే జరుగుతున్న మార్పులను చూసి బిత్తరపోతున్నారు.


ఇప్పుడు టీడీపీ నేతలు కూడా యాక్టివ్ అవుతున్నారు. తాజాగా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు రంగంలోకి దిగిపోయారు. తాజాగా ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు రఘురామరాజు. తాను ఎంపీగా ఉన్న సమయంలో తనను అరెస్ట్ చేసి కస్టడీలో హింసించారని అందులో పేర్కొన్నారు. దీని వెనుక సీఎం జగన్, ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, విజయపాల్, గుంటూరు సూపరింటెండెంట్ పాత్ర ఉందన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను సమర్పించారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

సరిగ్గా మూడేళ్లు కిందట మే 14న హైదరాబాద్‌లో ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో కస్టడీలో ఉన్న తనను టార్చర్ పెట్టారని వివరించారు. జగన్‌ను విమర్శిస్తున్నందుకు చంపేస్తామని ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్ నేరుగా బెదిరించారని ఆరోపించారు. అంతేకాదు ఆ సమయంలో తనను చంపేందుకు కుట్ర చేశార్నది ఆయన ప్రధాన ఆరోపణ.


Also Read: నిన్న జవహర్‌రెడ్డి, నేడు ధర్మారెడ్డి, రేపు వాళ్లేనా?

ఇదే విషయాన్ని రఘురామకృష్ణరాజు న్యాయస్థానంలో విన్నవించారు. అంతేకాదు అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఆసుపత్రికి వచ్చి ఎలాంటి నివేదిక ఇవ్వకూడదని ఆసుపత్రి స్టాప్‌ను బెదిరించారని పేర్కొన్నారు. గుంటూరు సూపరింటెండెంట్ పోలీసు అధికారులతో కుమ్మక్కై ఎలాంటి గాయాలు లేవని నివేదిక ఇచ్చారు. పోలీసుల వ్యవహారశైలిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు రఘురామకృష్ణరాజు.

న్యాయస్థానం ఆదేశాలతో గుంటూరు నుంచి సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. తర్వాత బెయిల్ మంజూరు అయ్యింది. అయితే రఘురామకృష్ణరాజు కాలుపై గాయాలున్నట్లు ఆర్మీ ఆసుపత్రి రిపోర్టు ఇచ్చింది. ఈ వ్యవహారంపై ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రఘురామకృష్ణరాజు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయాక, మాజీ సీఎం జగన్‌పై కేసు పెట్టాలని నేరుగా ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి ఆయనే.

Tags

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×