EPAPER

Purandeswari : కులం, కుటుంబం చుట్టే పురందేశ్వరి రాజకీయాలు : విజయ్‌సాయిరెడ్డి

Purandeswari: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ మధ్య తరుచూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంతో తాజగా మంగళవారం విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటిలో పురందేశ్వరి రాజకీయ చరిత్ర మెదలు నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకు విమర్శలు చేశారు.

Purandeswari : కులం, కుటుంబం చుట్టే పురందేశ్వరి రాజకీయాలు : విజయ్‌సాయిరెడ్డి

Purandeswari : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ మధ్య తరుచూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంతో తాజగా మంగళవారం విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటిలో పురందేశ్వరి రాజకీయ చరిత్ర మెదలు నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకు విమర్శలు చేశారు.


ఒక ట్వీట్‌లో విజయసాయిరెడ్డి ఇలా రాశారు. “కులం, కుటుంబం చుట్టే పురందేశ్వరి రాజకీయాలు , నదులన్నీ సముద్రంలో కలిసినట్లు ఆమె ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే, అంతిమ లక్ష్యం కుల ఉద్దారణే. స్వార్థం తప్ప.. సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం అనేవి ఏవీ పురందేశ్వరికి లేవు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం,” అంటూ ట్విటర్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“టీడీపీతో పొత్తులేకున్నా పురందేశ్వరి సొంత పార్టీని గాలికొదిలేసి దానిని తలకెత్తుకున్నారు. బంధుత్వం మాటున బావ చంద్రబాబు సహాయంతో ఎంపీగా గెలిచి బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నారు. అందుకే ఆయనపై ఈగ కూడా వాలకుండా విసనకర్ర ఊపుతున్నారు. పురందేశ్వరి పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయిందని, రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేక కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీజేపీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్‌గా అట్టర్ ఫ్లాప్ కావడంతో అక్కడా కూడా ఆమెను తీసేశారు,” అని విజయసాయిరెడ్డి ఆమెను ఎద్దేశా చేశారు.


శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా
విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో పురందేశ్వరిపై రెచ్చిపోయారు. “ఎన్టీఆర్ ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరి! ఆ వయస్సులో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపి…పాపం! 73 ఏళ్ల వయస్సులో ఆపెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారే. ఏం కూతురివమ్మా నీవు? శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా !” అంటూ ట్విటర్ వేదికగా ఆమెను తీవ్రంగా విమర్శించారు.

పురందేశ్వరి ఓ మేక వన్నె పులి : పోసాని
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఏపీ ముఖ్యమంత్రి అవుతారనే భయం పురందేశ్వరిలో స్పష్టంగా కనిపిస్తోందని పోసాని కృష్టమురళి అన్నారు. ఆమె ఓ మేక వన్నె పులి అని, ఆమె నిజస్వరూపం చూస్తే అంతా షాకవుతారని చెప్పారు. చంద్రబాబు కోసమే పురందేశ్వరి పనిచేస్తున్నారిన ఆరోపణలు చేశారు. ఆమెకు నిజాయితీ, విలువలు అనేవి లేవని.. ఏనాడూ బీజేపీ కోసం పాటు పడలేదని ఆమెని తీవ్రంగా విమర్శించారు. మనుషులపై కాల్పులు జరిపి, అసెంబ్లీలో తొడలు కొట్టి, విసిల్ వేసే మానసకి రోగి అయిన బాలక‌ృష్టకు పురందేశ్వరి ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందని పోసాని ఎద్దేవా చేశారు.

సీఎం జగన్‌పై కక్ష సాధింపు కోసమే పురందేశ్వరి సుప్రీం కోర్టుకు
పురందేశ్వరి పై మంత్రి రోజా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై కక్ష సాధింపులో భాగంగానే సుప్రీంకోర్టుకు పురందేశ్వరి లేఖలు రాశారని మంత్రి రోజా మండిపడ్డారు. జగన్ కేసుల గురించి లేఖలు రాయాల్సిన అవసరం ఆమెకు లేదని, ఆమె పని ఆమె చూసుకుంటే సరిపోతుంది అంటూ రోజా చురకలు అంటించారు.

అనంతపురం కరువు పరిస్థితులపై జగన్‌కు కనిపించట్లేదా? : పురందేశ్వరి
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు మరిచిపోయారని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతపురంలో ఉన్న కరువు పరిస్థితులు సీఎం జగన్‌కు కనపించడంలేదా?, రైతులకు సాగునీరు, తాగునీరు అందిస్తామని ఎన్నికల ముందు చేసిన హామీల మాట ఏమైందని ఆమె ప్రశ్నించారు.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×