EPAPER

Punganur Girl Incident : గుండెలు పిండేసే విషాదం.. అదృశ్యమై.. ట్యాంక్‌లో శవమై.. చిన్నారిని చంపిందేవరు?

Punganur Girl Incident : గుండెలు పిండేసే విషాదం.. అదృశ్యమై.. ట్యాంక్‌లో శవమై.. చిన్నారిని చంపిందేవరు?

దీంతో ఇవాళ పుంగనూరుకు హోంమంత్రి అనిత,ఇతర అధికారులు సైతం రానున్నారు. బాలిక మృతి వెనుక కారణాలను తెలుసుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని చెప్పారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఉబేదుల్లా కాంపౌండుకి చెందిన బాలిక అస్ఫియా గత ఆదివారం మిస్ అయింది. తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది అస్ఫియా. కాసేపటికి అస్ఫియా తల్లి బయటకొచ్చి చూడగా చిన్నారి కనిపించలేదు. అప్పటి నుంచి కనిపించని బాలిక కనిపించకుండా పోయింది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మూడు రోజుల పాటు బాలిక కోసం గాలించినా పోలీసులకు పాప జాడ అయితే కనిపించలేదు. ఎట్టకేలకు 2వతేదిన పుంగనూరు సమ్మర్ స్టోరేజ్‌ దగ్గర చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ మృతదేహాం కనపడకుండా పోయిన చిన్నారి అస్ఫియాదేనని గుర్తించారు.


Also Read: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

చిన్నారి మృతికి అసలు కారణాలు ఏంటి? ఏ పాపం తెలియని చిన్నారి అస్ఫియాను ఎవరైనా చంపేశారా? చంపితే ఎవరు చంపి ఉంటారు? ఆ బాలికను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనేది.. బిగ్ క్వశ్చన్స్‌గా మారిపోయాయి. తండ్రి మీద కోపాన్ని.. పాప మీద ఎవరైనా చూపించారా అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి.

అయితే పోలీసులు విచారణలో ఇప్పటివరకు ఎలాంటి అధారాలు లభించలేదు. చిన్నారి తండ్రి ఫైనాన్స్ వ్యాపారి కావడంతో కొందరినీ విచారించారు పోలీసులు. కానీ ఫలితం మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ల్యాబ్ రిపోర్ట్ నిమిత్తం చిన్నారి అవయవాలను తిరుపతికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాత.. పూర్తి స్థాయి అంశాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు కేసులో సరైన పురోగతి సాధించలేదని సీఎం సీరియస్ అయ్యారు. వీలైనంత త్వరగా బాలిక మృతి కేసును చేధించాలిన ఆదేశించారు.

ఈ నేపథ్యంలో తాజాగా పుంగనూరు బాలిక మృతి ఘటనపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లే బాలిక చనిపోయిందని మండిపడ్డారు. ఆడపిల్లలను స్కూల్‌కి పంపాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం సొంతజిల్లాల్లోనే ఇంత జరుగుతుంటే.. సీఎంకి పట్టదా అని ప్రశ్నించారు. సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ఎలా అంటూ ఫైర్ అయ్యారు రోజా.

Related News

Tirumala: తిరుమలకు వెయ్యి గోవులు ఇస్తా..ప్రభుత్వం సిద్ధమైనా?

YS Jagan Master Plan: ఆరు నెలల కాకుండానే యుద్ధం చేస్తారా..? జగన్ ఏంటిది?

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

×