EPAPER

Proddatur Assembly Constituency : ప్రొద్దుటూరు పందెం కోడి ఎవరు..? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?

Proddatur Assembly Constituency : ప్రొద్దుటూరు పందెం కోడి ఎవరు..? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?
AP News today telugu

Proddatur Assembly Constituency(AP news today telugu):

ప్రొద్దుటూరు.. సీఎం జగన్‌ సొంత జిల్లాలోని కీలక నియోజకవర్గం. డైమండ్ సిటీ ఆఫ్‌ ఏపీగా పేరుగాంచిన ఈ నియోజకవర్గంలో తయారయ్యే కళాంకరి.. మంగళగిరి ఫ్యాబ్రిక్స్‌కు పేరు గాంచింది. ఈ నియోజకవర్గంలో గడచిన రెండు సార్లు.. వైసీపీ పార్టీ విజయకేతనం ఎగరవేసినా ఇక్కడ టీడీపీ పార్టీ బలంగా ఉంది. నంద్యాల వరద రాజులు రెడ్డి శిష్యులుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మల్లెల లింగారెడ్డి, రాచమల్లు శివ ప్రసాద్‌ రెడ్డి ఇప్పుడు బరిలోకి దిగి ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వరద రాజులు రెడ్డి, లింగారెడ్డి టీడీపీ క్యాంప్‌లో ఉండగా.. శివప్రసాద్‌ రెడ్డి వైసీపీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ జరిగేలా కనిపిస్తోంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఎమ్మెల్యే రాచమల్లు చూస్తుండగా.. ఈసారి సొంత జిల్లాలో పసుపు జెండా ఎగరవేసి తీరుతామంటున్నారు సైకిల్ పార్టీ నేతలు. ప్రస్తుతం గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు. మరి నిజంగా నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరికి అనుకూల పవనాలు వీస్తున్నాయి? అనే అంశాలపై బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఎలక్షన్‌ సర్వే నిర్వహించింది. ఆ వివరాలను చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం.


2019 RESULTS

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ( గెలుపు) vs మల్లెల లింగారెడ్డి


YCP 59%
TDP 36%
OTHERS 5%

2019 ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 59 శాతం ఓట్లు సాధించి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘన విజయం సాధించారు. 2014 కంటే 8 శాతం ఓట్లు అధికంగా సాధించారు రాచమల్లు. ప్రజాసమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవ.. ఆయన పాజిటివ్ ఇమేజ్‌ 2019లో ఆయన గెలుపుకు కారణమయ్యాయి. ఇక టీడీపీ వరద రాజులు రెడ్డికి కాకుండా ఈ ఎన్నికల్లో మల్లెల లింగారెడ్డికి టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది. అయితే ఆయన కేవలం 36 శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగారు. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో వరద రాజులు రెడ్డి యాక్టివ్‌గా పాల్గొనలేదు. అంతేగాకుండా ఆయన మద్ధతుదారులు కూడా టీడీపీ అభ్యర్థికి సహకరించలేదు. అటు వైసీపీ వేవ్.. రాచమల్లు పాజిటివ్ ఇమేజ్‌తో పాటు అంతర్గత కుమ్ములాటల కారణంగా ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమిని మూటగట్టుకుంది. ఇక కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన గొర్రె శ్రీనివాసులు కేవలం 1 శాతం ఓట్లను సాధించగలిగారు. ఇవి గత ఎన్నికల లెక్కలు. మరి ఈసారి పరిస్థితులు ఉన్నాయనే దానిపై బిగ్ టీవీ నిర్వహించిన సర్వే రిపోర్ట్ చూద్దాం.

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (YCP)

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • నియోజకవర్గ ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్
  • మొదటి నుంచి స్థానికంగా ఉన్న గుర్తింపు
  • వరుసగా రెండుసార్లు గెలవడం
  • నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి
  • పూర్తిగా సహకరిస్తున్న క్యాడర్
  • నిత్యం ప్రజల మధ్య ఉండటం

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • ఆశించిన అభివృద్ధి జరగకపోవడం
  • ఎమ్మెల్యే బంధువుల ఆగడాలు పెరిగాయన్న ప్రచారం
  • ఇసుక మాఫియా ఆరోపణలు
  • అనుచరులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు
  • ఎమ్మెల్యే బావమరిది బంగారు మునిరెడ్డి అధికారం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు
  • నియోకవర్గంలో పూర్తి కాని రోడ్లు

జీవీ ప్రవీణ్‌ కుమార్ రెడ్డి (TDP)

జీవీ ప్రవీణ్‌ కుమార్ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం
  • కడప స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం
  • పోలీసుల అరెస్ట్‌తో పెరిగిన ప్రజల్లో పాపులారిటీ

జీవీ ప్రవీణ్‌ కుమార్ రెడ్డి మైనస్ పాయింట్స్

  • టికెట్ లభించినా గెలుపు అవకాశాలు తక్కువగా ఉండటం
  • టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం

నంద్యాల వరద రాజులు రెడ్డి (TDP)

నంద్యాల వరద రాజులు రెడ్డి ప్లస్ పాయింట్స్

  • ప్రొద్దుటూరులో ఐదుసార్లు గెలిచిన రికార్డ్
  • ప్రస్తుతం గ్రౌండ్ లెవల్‌లో యాక్టివ్‌గా ఉండటం
  • పార్టీలో సీనియర్ లీడర్‌గా పేరు

నంద్యాల వరద రాజులు రెడ్డి మైనస్ పాయింట్స్

  • వయసు రిత్యా చాలా పెద్దవాడవడం
  • టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం
  • మల్లెల లింగా రెడ్డి వర్గం సహకరించకపోవడం

మల్లెల లింగారెడ్డి (TDP)

మల్లెల లింగారెడ్డి ప్లస్ పాయింట్స్

  • గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి
  • గత కొన్ని నెలలుగా యాక్టివ్‌గా ఉండటం
  • సొంతంగా క్యాడర్‌ ఉండటం

మల్లెల లింగారెడ్డి మైనస్ పాయింట్స్

  • శివ ప్రసాద్ రెడ్డితో సన్నిహితంగా ఉంటారని ప్రచారం
  • గత ఎన్నికల్లో ఓడిన తర్వాత ఎక్కువగా యాక్టివ్‌గా లేకపోవడం

ఇక వచ్చే ఎన్నికల్లో బరిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (YCP) vs జీవీ ప్రవీణ్‌ కుమార్ రెడ్డి (TDP)

YCP 48 %
TDP 44 %
OTHERS 8 %

ఇప్పటికిప్పుడు ఎన్నికల జరిగి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, జీవీ ప్రవీణ్‌ కుమార్ బరిలోకి దిగితే వైసీపీకి 48 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉంది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌కు 44 శాతం, ఇతరులకు 8 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్టు బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. ఈ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ సాంప్రదాయ ఓట్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కూడా చాలా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రవీణ్‌ కుమార్‌ను ప్రజలు రాచమల్లుకు తగ్గ అభ్యర్థిగా పరిగణించడం లేదని తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో కంటే రాచమల్లుకు ఓట్‌ షేర్‌ మాత్రం తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే తన బావమరిది బంగారు మునిరెడ్డి ఆగడాలు ఎక్కువయ్యాయని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి జరగలేదన్నది కూడా ఆయన ఓట్ షేర్ తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది.

టీడీపీకి ఓట్‌ షేర్‌ తగ్గడానికి ప్రధాన కారణంగా పార్టీలో ఉన్న అంతర్గత విబేధాలని తెలుస్తోంది. ముఖ్యంగా మల్లెల లింగా రెడ్డి వర్గం ప్రవీన్‌ కుమార్‌కు ఏ మాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది.

ఇక రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, నంద్యాల వరదరాజులు పోటీ పడితే..

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (YCP) vs నంద్యాల వరద రాజులు రెడ్డి (TDP)

YCP 47 %
TDP 46 %
OTHERS 8 %

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, నంద్యాల వరదరాజులు బరిలోకి దిగితే పోరు హోరాహోరిగా ఉంటుందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. రాచమల్లుకు 47 శాతం ఓట్లు రాగా.. వరద రాజులుకు 46 శాతం ఓట్‌ షేర్ దక్కుతుందని తేలింది. ఇక ఇతరులకు 8 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డ్ ఉన్న వరదరాజులుకు కనుక టికెట్ దక్కితే రాచమల్లు గట్టి పోటీ తప్పదని అర్థమవుతోంది. అయితే ప్రవీణ్‌ రెడ్డి వర్గం సహకరించినా.. లింగారెడ్డి వర్గం ఆయనకు సహకరించడం అనుమానమే. అయితే ఈ క్యాలుక్యులేషన్స్‌లో కూడా ఒక్క శాతం ఎక్కువ ఓట్ షేర్‌తో రాచమల్లు గెలిచే అవకాశముందని బిగ్ టీవీ సర్వే చెబుతోంది.

ఇక రాచమల్లు శిప్రసాద్‌ రెడ్డి, మల్లెల లింగారెడ్డి బరిలోకి దిగితే ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (YCP) vs మల్లెల లింగారెడ్డి (TDP)

YCP 49 %
TDP 42 %
OTHERS 9 %

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, లింగారెడ్డి బరిలోకి దిగితే వైసీపీకే గెలిచే అవకాశాలు ఉన్నాయని బిగ్ టీవీ సర్వే చెబుతోంది. రాచమల్లుకు 49 శాతం ఓట్లు.. లింగారెడ్డికి 42 శాతం ఓట్లు అవకాశం ఉంది. ఇక ఇతరులకు 9 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే లింగారెడ్డికి వరదరాజులు రెడ్డి వర్గం సహకరించకపోవడంతో ఆయన ఓట్‌ షేర్ తగ్గిపోయే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిన సపోర్ట్ చేస్తానని వరద రాజులు రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. కానీ అది అమలు జరిగే విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా ఏ సీనారియాలో చూసుకున్నా.. ఈ నియోజకవర్గంలో రాచమల్లుదే విక్టరీ అని చెబుతోంది బిగ్ టీవీ ఎలక్షన్‌ సర్వే.

.

.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×