Prakasam District Crime: నేటి సమాజంలో జరిగే కొన్ని ఘటనలు చూస్తే, బంధాలు, బాంధవ్యాలకు విలువ ఉందా అనే సందేహం అనిపించక మానదు. పుట్టింటికి రా చెల్లి సినిమాలో చెల్లెలి బాధను.. ఒక తండ్రిలా అన్న భరించలేక బాధ పడే సీన్స్ మనకు కన్నీళ్లు తెప్పిస్తాయి. నిజజీవితంలో కూడా అలాంటి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటి చెప్పే వారు ఎందరో ఉన్నారు. కానీ ఈ ఘటన ఆ అనుబంధానికే మచ్చ తెచ్చే రీతిలో జరిగింది. చెల్లిని తల్లిలా భావించాల్సిన అన్న, తల్లిని చేశాడు. ఇంతటి దారుణాతి దారుణ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు గురించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల వయస్సు గల బాలిక, స్థానిక పాఠశాలలో పదో తరగతి విద్యను అభ్యసించేది. అయితే తన తరగతిలో గల ఓ బాలుడితో, సదరు బాలిక స్నేహపూర్వకంగా మెలిగేది. తెలిసీ తెలియని వయసులో ఆ బాలుడితోనే ప్రేమ వ్యవహారం నడిపింది బాలిక. ఈ విషయాన్ని గమనించిన బాలిక అన్న, తల్లిదండ్రులకు అసలు విషయం చెబుతానని బెదిరించాడు. అదే అదునుగా భావించి, చెల్లి అనే బంధానికి కూడా మచ్చ తెచ్చేలా దుర్భుద్దితో ఆలోచించాడు. ఆ ఆలోచనతో పదేపదే ఎవరూ లేని సమయంలో బాలికపై లైంగికదాడికి పాల్పడేవాడు.
దీనితో ఆ బాలిక గర్భం దాల్చిన పరిస్థితి. ఆలస్యంగా తల్లిదండ్రులు అసలు విషయాన్ని గమనించి, బాలికకు అబార్షన్ చేయించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం వికటించడంతో, నేరుగా సదరు బాలికను ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. కానీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తాళ్లూరు పోలీసులు గ్రామంలో విచారించారు. ఈ క్రమంలోనే ఒంగోలు జిజిహెచ్ పోలీసులకు సమాచారం అందించి, బాధిత బాలిక నుండి పోలీసులు వివరాలు సేకరించారు. అసలు విషయాన్ని తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురయ్యారు.
దీనితో ఎస్సై మల్లికార్జున రావు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ దారుణ ఘటనలో కొసమెరుపు ఏమిటంటే.. తమ కొడుకు అలాంటి వాడు కాదని తల్లిదండ్రులు వాదించడం విశేషం. కానీ భాదిత బాలిక మాత్రం అసలు విషయాన్ని తెలుపుతున్న వారు నమ్మని పరిస్థితి. దీనికి కారణం ఆ తల్లిదండ్రులకు అన్నాచెల్లెలి అనుబంధంపై ఉన్న నమ్మకమే అంటున్నారు స్థానికులు.
Also Read: Perni Nani on Vijayamma: స్థాయి మరచి విజయమ్మపై విమర్శలా? పేర్ని నాని గీత దాటారా?
ఇలాంటి ఘటనలతో నేటి సమాజం మాట దేవుడెరుగు, రానున్న తరాలలో బంధాలకు, అనుబంధాలకు విలువ ఇచ్చే రోజులు ఉంటాయా అంటూ ప్రశ్నిస్తున్నారు మేధావులు. ఇప్పటికైనా పిల్లలకు ప్రేమానురాగాలు పంచడమే కాక, వారికి సోదర భావానికి గల అర్థం, సమాజంలోని మంచి, చెడులపై అవగాహన, దేశ ఉన్నతికి ఎలా పాటుపడాలనే అంశాలు, అసలు కుటుంబం అంటే ఏమిటి, కుటుంబ గౌరవం ఏమిటనే విషయాలపై ప్రత్యేకంగా కథల ద్వారా వివరించే ప్రయత్నాలను తల్లిదండ్రులు సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదన వినిపిస్తోంది.