BigTV English

POSANI Comments: పవన్ పిచ్చోడు.. ముద్రగడ లెజెండ్.. పోసాని కలకలం..

POSANI Comments: పవన్ పిచ్చోడు.. ముద్రగడ లెజెండ్.. పోసాని కలకలం..
Posani press meet

Posani Krishna Murali Comments(AP politics): కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పోసాని కృష్ణమురళి. పవన్ వల్లే కాపుల్లో చిచ్చు మొదలైందని చెప్పారాయన. కాపులను తిడుతున్న పవన్ కల్యాణ్.. ఇక కాపు రిజర్వేషన్లు ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. నిద్రలో కూడా జగన్ నాశనాన్ని పవన్ కోరుతున్నారని.. వ్యక్తిగత ద్వేషం ఆయనకే నష్టమంటూ హితవు పలికారు పోసాని.


వైఎస్సార్‌ను ఓడించడానికి కాదు, తాను గెలవడానికి పార్టీ పెట్టానని చిరంజీవి ఆనాడు చెప్పారు. ఇప్పుడు పవన్ మాత్రం.. చంద్రబాబును సీఎంని చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోసాని విమర్శించారు. చంద్రబాబు స్కెచ్‌ ప్రకారం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని అన్నారు. ముద్రగడ గొప్పవారా? పవన్‌ను ప్రేమించే చంద్రబాబు గొప్పవారా? అని నిలదీశారు.

తాను పవన్‌ కల్యాణ్‌ గురించి చాలా ఊహించుకున్నానని.. జనసేనాని రాజకీయాలు చూశాక ఆయనపై గౌరవం పోయిందన్నారు. పవన్‌ ఒకప్పుడు చాలా మంచివాడు కానీ.. ఇప్పుడు పిచ్చివాడు ఎందుకయ్యాడో తెలియట్లేదన్నారు.


పవన్ పిచ్చోడు.. ముద్రగడ లెజెండ్ అన్నారు పోసాని. వైసీపీ నుంచి ముద్రగడ డబ్బులు తీసుకున్నారనే ఆరోపణను నిరూపించాలని సవాల్ చేశారు. 1981 నుంచి ముద్రగడ కాపుల కోసం పోరాడుతున్నారని.. ఆయన గొప్పతనం పవన్‌కు, చంద్రబాబుకు తెలియదన్నారు పోసాని.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×