EPAPER
Kirrak Couples Episode 1

Bro Movie Controversy: రాంబాబు Vs శ్యాంబాబు.. బ్రో మూవీపై పొలిటికల్ రచ్చ..

Bro Movie Controversy: రాంబాబు Vs శ్యాంబాబు.. బ్రో మూవీపై పొలిటికల్ రచ్చ..
Bro Movie controversy

Bro Movie controversy(AP political news) : మంత్రి అంబటి రాంబాబు ఎవరో నాకు తెలీదు అంటున్నారు బ్రో సినిమాలో శ్యాంబాబు కేరక్టర్ చేసిన పృథ్వీ. సంక్రాంతి సంబరాల్లో రాంబాబును ఇమిటేట్ చేశారంటూ వస్తున్న ప్రశ్నలపై ఆయన స్పందించారు. ఆయనేమైనా ఆస్కార్ స్థాయి నటుడా అంటూ సెటైర్లు వేశారు పృథ్వీ.


ఇలా ఏపీ పాలిటిక్స్‌లో కొత్త రచ్చకు తెరలేపింది బ్రో మూవీ. థియేటర్‌లో పవన్‌ పేల్చిన పంచ్‌లు ఇప్పుడు పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ సారి ఆయన అంబటిని టార్గెట్‌ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

పవన్ కల్యాణ్‌ నటించిన బ్రో సినిమా థియేటర్స్‌లో సందడి చేస్తూనే.. మరోసారి ఏపీ పాలిటిక్స్‌లో రచ్చ చేస్తోంది. సంక్రాంతి సంబరాల్లో అంబటి రాంబాబు వేసిన డాన్స్‌ను ఉద్దేశించినట్టు కనిపిస్తున్న ఒక సీన్.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గతంలో భోగి పండుగ సందర్భంగా సత్తెనపల్లిలో మహిళలతో కలిసి అంబటి రాంబాబు రోడ్డుపై డాన్స్ చేశారు. ఆ డాన్స్‌ను ఎగతాళి చేస్తూ బ్రో సినిమాలో ఒక పాటలో చిన్న సీన్ పెట్టారు. రాంబాబు పాత్రను పోలి ఉన్న శ్యాంబాబు పాత్రను కమెడియన్ పృథ్వీ పోషించారు.


మంత్రి అంబటి రాంబాబు ఈ అంశంపై నేరుగా రియాక్టయ్యారు. పవన్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టి దూషించారని విన్నానని.. కానీ చూడలేదన్నారు. పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితికి దిగజారిపోయారని విమర్శించారు. గెలిచినోడి డ్యాన్స్ సంక్రాంతి… ఓడినోడి డ్యాన్స్ కాళరాత్రి అంటూ ట్వీట్ చేసి పవన్‌‌ను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పవన్ కల్యాణ్‌ రాజకీయంగా తనను ఎదుర్కోలేక.. సినిమాల్లో తనను పోలిన పాత్రను పెట్టించారని అంబటి ఆరోపణ. తాను డ్యాన్స్‌లో సింక్ అవుతానో లేదో ప్రజలు చూస్తారని.. కానీ పవన్ రాజకీయాల్లో సింక్ అవుతారో లేదో చూసుకోవాలంటూ సెటైర్లు వేశారాయన. వచ్చే సంక్రాంతికి కూడా డాన్స్ చేస్తానని, కావాలంటే పవన్ కూడా వచ్చి చూడొచ్చని కౌంటర్ ఎటాక్ చేశారు.

బ్రో మూవీ వివాదంపై దర్శకుడు సముద్రఖని కూడా స్పందించారు. బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్‌ను ఎవర్నో ఉద్దేశించి పెట్టలేదన్నారు. స్క్రిప్ట్ ప్రకారమే ఆ క్యారెక్టర్ డాన్స్ ఉంది తప్ప మరో ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ఆ క్యారెక్టర్‌కు సంబంధించి అన్నీ నాన్‌-సింక్ అని చెప్పారు సముద్రఖని. ఇప్పుడు నటుడు పృథ్వీ స్పందించారు. డైరెక్టర్ చెప్పినట్టు చేశాను తప్ప.. అంబటి ఎవరో తెలీదన్నారు.

Related News

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Big Stories

×