EPAPER

Police Commemoration Day: ఆడ బిడ్డల రక్షణ, జీరో క్రైమ్ మా టార్గెట్, పోలీసు అమరవీరులకు సీఎం చంద్రబాబు నివాళి

Police Commemoration Day: ఆడ బిడ్డల రక్షణ, జీరో క్రైమ్ మా టార్గెట్, పోలీసు అమరవీరులకు సీఎం చంద్రబాబు నివాళి

Police Commemoration Day: ఆడ పిల్లల అత్యాచారాలపై నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామ న్నారు సీఎం చంద్రబాబు. ఆడ బిడ్డల రక్షణే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అంతేకాదు జీవో క్రైమ్ నమోదు కావాలని సూచన చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.


రాష్ట్రంలో ఇకపై జీరో క్రైమ్ టార్గెట్‌గా అడుగులు వేయాలన్నారు సీఎం. రానున్న రోజుల్లో కానిస్టేబుల్ నియామకాలను చేపడతామని వెల్లడించారు. రాజకీయ నాయకుల ముగుసులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు.

శాంతి భద్రతలను కాపాడడంలో ఏ మాత్రం రాజీ లేదంటూనే ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించామన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో నేరాల తీరు మారుతోందన్న సీఎం, నేరస్తుల కంటే పోలీసుల వద్ద ఆధునిక టెక్నాలజీ ఉంటేనే వారిని కంట్రోల్ చేయగలమని చెప్పకనే చెప్పారు.


విభజన తర్వాత పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. వాహనాలు, సాంకేతిక టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. డ్రగ్స్, ఎర్ర చందనం మాఫియాకు అడ్డుకట్ట వేస్తామన్నారు.

ALSO READ: ఏపీకి పొంచి వున్న ముప్పు, బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే ఛాన్స్

పనిలో పనిగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సర్వే రాళ్ల కోసం 700 కోట్ల రూపాయలు వృధా చేశారని దుయ్యబట్టారు. దీనివల్ల సీసీటీవీ కెమెరాలకు నిధులు కేటాయించలేకపోయామన్నారు. ఇంటి కంచె కోసం కోట్లాది రూపాయలు తగలబెట్టారన్నారు. పోలీసులకు సరెండర్ సెలవులు కూడా ఇవ్వలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేశామని వివరించారు.

విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణాలను త్యాగం చేశారని, ప్రజల హృదయాల్లో వారంతా నిలిచిపోయారన్నారు. రాష్ట్ర ప్రగతిలో పోలీసులకు కీలక పాత్ర అని, మిగతా శాఖల కంటే ఇది ఎంతో కీలకమైనదిగా చెప్పుకొచ్చారు. ప్రజల ప్రాణాలు కాపాడడంలో రాత్రింబవళ్లు పని చేస్తున్నారన్నారు. ఈ విషయంలో వారిని అభినందిస్తున్నానని తెలిపారు.

విజయవాడలో పోలీసు అమరుల దినంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై కూర్చునేందుకు కుర్చీని ప్రత్యేకంగా అలంకరించారు అధికారులు. తాను కూర్చునే కుర్చీకి అదనపు హంగులు అవసరం లేదని, అందరితో సమానంగా ఉండాలన్నారు. కుర్చీపై ప్రత్యేకంగా వేసిన క్లాత్‌ను తొలగించారాయన.

 

Related News

Sri Reddy On YCP: నన్ను దూరం పెట్టారు.. జగన్‌పై శ్రీరెడ్డి రుసరుస

Cyclone Dana :ఏపీకి పొంచి వున్న ముప్పు, బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారే ఛాన్స్

Jagan vs Sharmila: జగన్ రాయబారం సక్సెస్! చెల్లికి సగ భాగం ఇచ్చేందుకు ఓకేనా?

Minister Nara lokesh: నారా లోకేష్‌కు పెరిగిన బాధ్యతలు.. పార్టీతోపాటు, ప్రభుత్వ వ్యవహారాల్లో..

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్‌ అవార్డు? త్వరలోనే కీలక ప్రకటన!

Krishna District: తీవ్ర విషాదం.. ఇద్దరు విద్యార్థులకు కారణమైన సెల్ఫీ సరదా!

Big Stories

×