EPAPER

Modi Speech in Prajagalam Meeting: ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలి: ప్రధాని మోదీ

Modi Speech in Prajagalam Meeting: ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలి: ప్రధాని మోదీ
PM Modi Speech In Prajagalam Meeting
PM Modi Speech In Prajagalam Meeting

PM Modi Speech in Prajagalam Meeting: ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రధాని మోదీ పిలుపినిచ్చారు. చిలుకలూరిపేట ప్రజాగళం సభలో పాల్గొన్న ప్రధాని నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.


శనివారం ఎన్నికల శంఖారావం మోగిందని.. ఆ తర్వాత తను పాల్గొంటున్న మొదటి సభ ఇదేనని మోదీ పేర్కొన్నారు. దేశంలో ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని.. ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలని తెలిపారు.

అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఎన్డీఏ గెలవాలని ప్రధాని మోదీ అన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి రెండూ అవసరమని.. ఈ రెండింటినీ ఎన్డీఏ సమన్వయం చేస్తుందనొ పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్‌ రాత్రింబవళ్లు పని చేస్తున్నారని మోదీ అన్నారు.


ఎన్డీఏ సర్కారు పేదల గురించి ఆలోచిస్తుందని, పేదల కోసం పని చేస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ఏపీకి 10 లక్షల ఇళ్లు ఇచ్చామని గుర్తుచేశారు. పల్నాడు జిల్లాలో 5 వేల ఇళ్లు ఇచ్చామని తెలిపారు. అటు జలజీవన్‌ మిషన్ కింద కోటి ఇళ్లకు నీరు ఇచ్చామని, ఆయుష్మాన్‌ భారత్‌తో ఏపీలో కోటీ 25 లక్షల మందికి లబ్ధి చేకూరిందని అన్నారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధితో పల్నాడు ప్రజలకు రూ. 700 కోట్లిచ్చామని తెలిపారు.

Also Read: Pawan Kalyan in Prajagalam Meeting: రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన జగన్‌ను తరిమేయాలి.. ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ పిలుపు

ఏపీని ఎడ్యూకేషన్ హబ్‌గా మార్చామని ప్రధాని మోదీ తెలిపారు. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ నిర్మించామన్నారు. విశాఖపట్నంలో ఐఐఎం, ఐఐపీఈ ఏర్పాటు చేశామని మోదీ పేర్కొన్నారు.

తెలుగు వారికి కాంగ్రెస్ పార్టీ అవమానం చేస్తేనే తెలుగుదేశం పార్టీ పుట్టిందని మోదీ అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రూ.100 వెండి నాణెం విడుదల చేశామని పేర్కొన్నారు. తెలుగువారి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు ఎన్డీఏ ప్రభుత్వం భారతరత్న ఇచ్చిందని అన్నారు. ఇక ఏపీలో వైసీపీకి చమరగీతం పాడాల్సిందేనని అన్నారు. ఏపీ మంత్రులు అక్రమాల్లో, అవినీతి చేయడంలో ఒకరినొకరు మించిపోతున్నారని అన్నారు. వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటేనని అందుకే ఎన్డీఏకి ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×