EPAPER

PM Modi, Amit Shah Call to AP Voters: ఏపీ ఓటర్లకు మోదీ, అమిత్ షా పిలుపు.. ఆసక్తికర ట్వీట్స్

PM Modi, Amit Shah Call to AP Voters: ఏపీ ఓటర్లకు మోదీ, అమిత్ షా పిలుపు.. ఆసక్తికర ట్వీట్స్

PM Modi and Amit Shah Call to AP Voters: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటర్లకు పిలుపునిచ్చారు.


ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగులో పాల్గొవాలని పిలుపునిచ్చారు. మొదటిసారి ఓటు వేసేవారు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నట్లు తన ట్వీట్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరోవైపు కేంద్రమంత్రి అమిత్ షా  కూడా తనదైన శైలిలో ట్వీట్ చేశారు. తెలుగు భాష, సంస్కృతి, గౌరవాన్ని రక్షించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. రాష్ట్రాన్ని మతమార్పిడి, అవినీతి, దుష్పరిపాలన నుండి విముక్తి చేయాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు అమిత్ షా.


Also Read: ఓటు వేసిన సీఎం జగన్, చంద్రబాబు, లోకేష్ ఫ్యామిలీలు, విజయంపై ధీమా

అటు తెలంగాణపై మరో ట్వీట్ చేశారు అమిత్ షా. రాష్ట్ర సంస్కృతిని, గౌరవాన్ని పెంపొందించాలన్నారు. సుపరిపాలనను కొనసాగించి, వ్యవసాయ రంగంలో ఆర్థిక బలాన్ని నింపాలని కోరారు. ముఖ్యంగా రైతుల సమస్యలపై శ్రద్ధ వహించి, బుజ్జగింపులు, అవినీతిని అంతం చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. అభివృద్ధి, సమాన అవకాశాలను అందించడం ద్వారా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు అధిక లాభం చేకూరుతుందని  పేర్కొన్నారు.

Also Read: PM Modi nomination: వారణాసిలో మోదీ నామినేషన్, మెజార్టీపైనే ఫోకస్

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×