EPAPER
Kirrak Couples Episode 1

Ysrcp : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ వివాదం.. ఆ ఇద్దరు నేతలను టార్గెట్ చేశారా?

Ysrcp : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ వివాదం.. ఆ ఇద్దరు నేతలను టార్గెట్ చేశారా?

Ysrcp : 2019 ఎన్నికల్లో ఆ జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ జిల్లా ఆ పార్టీకి కంచుకోటగా ఉంది. 2014 ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలు వైసీపీకే దక్కాయి. ఆ పార్టీ అంతబలంగా ఉన్న సింహపురి జిల్లాలో ఇప్పుడు వైసీపీ కుమ్ములాటలు మొదలయ్యాయి.


నెల్లూరు రూరల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పదే పదే పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తాజాగా తన ఫోన్ ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో తనకు తీరని అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఇదే సమయంలో వైసీపీ అధిష్టానం యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డిని నియమించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఇక శ్రీధర్ పార్టీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది.

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కొంతకాలంగా పార్టీని ధిక్కరించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆనం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తి అభిప్రాయాలు పట్టించుకోకుండా రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయించడం సరికాదన్నారు. తనకు ఉన్న సెక్యూరిటీని తగ్గించారని మండిపడ్డారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని ఆనం మాట్లాడటం హాట్ టాఫిక్ మారింది.


ఇప్పటికే ఆనం రాంనారాయణరెడ్డిపై వైసీపీ అధిష్టానం యాక్షన్ మొదలుపెట్టింది. ఆయనను కొన్నిరోజుల క్రితం వెంకటగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ బాధ్యతలను నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగించింది. అయినా సరే పార్టీ మారతానని ఆనం ప్రకటించలేదు.

ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి స్ఫందించారు. అసలు వాళ్ల ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరమేంటి ? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరెవరు టీడీపీతో టచ్ లో ఉన్నారని సీఎం జగన్ వద్ద సమాచారం ఉందని వెల్లడించారు. అంటే పార్టీ మారేందుకు ముందే సిద్ధమై ఇలా వ్యూహాత్మకం ఆనం, కోటంరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారా? వారిద్ధరూ టీడీపీతో టచ్ లో ఉన్నారా? అందుకే నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవుల నుంచి తప్పించారా? ..చూడాలి ఆనం, కోటంరెడ్డి ఎటు వైపు అడుగులు వేయబోతున్నారో..?

Related News

BjP vs DMK: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్.. భగ్గుమన్న దగ్గుబాటి పురంధేశ్వరి

Tirumala Laddu: లడ్డూ వివాదంతో శ్రీవారి ప్రతిష్ట మసకబారిందా? భక్తుల మనస్సులో లక్ష ప్రశ్నలు

Investments In AP: ఇంటర్నేషనల్ కంపెనీ ఏపీకి రాక.. వైజాగ్ లో లుల్లు మాల్.. యువతకు ఉపాధి మెండు

AP Politics: ముప్పేట దాడి.. వైయస్ జగన్ తట్టుకొనేనా.. వైసీపీకి గడ్డు కాలమేనా..

Pawan Kalyan : దేవాలయాలకు అసలైన అర్థం ఇదే.. ఇస్రో మాజీ చీఫ్ వీడియోపై పవన్ ట్వీట్

Tirumala Laddu: టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్

Naga Babu : పెద్దల సభకు మెగా బ్రదర్ నాగబాబు ? అదే జరిగితే చిరు తర్వాత నాగబాబే !

Big Stories

×