EPAPER

Madanapalle Files Burning Case: మదనపల్లె ఫైల్స్ కేసు.. అజ్ఞాతంలోకి పెద్దిరెడ్డి బ్యాచ్..?

Madanapalle Files Burning Case: మదనపల్లె ఫైల్స్ కేసు.. అజ్ఞాతంలోకి పెద్దిరెడ్డి బ్యాచ్..?

వెంకటరెడ్డి యాదవ్, బీరేంద్ర వర్మ, నాగభూషణం, ఎక్స్ టిటిడి బొర్డు మెంబర్ పోకల అశోక్ కూమార్ ,క్రిష్ణమూర్ది, రెడ్డెమ్మ, కౌన్సిలర్ అలి , బుల్లెట్ సురేష్, తుకారాం, శశికాంత్, రైస్ మిల్ మాదవ రెడ్డి, బండ్లపల్లి అక్కులప్ప, హర్ష వర్ధన్ రెడ్డి, కరీముల్లా, షమీమ్ అస్లామ్, కెజె కూమార్ , సెంథిల్ , విద్యాసాగర్, ఎంఅర్ సి రెడ్డి.. వీరంతా ఎవరనుకుంటున్నారా? మాజీ మంత్రి పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైన్యం.. జిల్లా వ్యాప్తంగా వీరంతా పెద్దిరెడ్డి వ్యవహారాలను చక్క బెడతారు. ఐదు సంవత్సరాలు పెద్ది రెడ్డి దందాల్లో కీలక పాత్ర పోషించారు. అటు భూముల వ్యవహారంతో పాటు ఇసుక , గ్రావెల్ దందాల్లో చక్రం తిప్పారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రతి సెగ్మెంట్లో పెద్దిరెడ్డి రిప్రజంటేటివ్ ఉండేవారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట వినకపోతే ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తారు. వారు చెప్పిందే అధికారులు వింటారు. స్థానిక ఎమ్మెల్యే కంటే వారే ఎక్కువ పెత్తనం చలాయించారు. ప్రస్తుతం వీరిలో మెజార్టీ సభ్యులు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అక్రమాలు బయటపడతాయనే భయంతో అల్లాడిపోతున్నారు. కొంతమంది పార్టీ మారడనానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.


మదనపల్లి సభ్ డివిజన్ పరిధిలో పుంగనూరుకు చెందిన వెంకటరెడ్డి యాదవ్ అనే నేత పెద్దిరెడ్డి దందాల్లో కీలకంగా వ్యవహరించారు.. అతని అధీనంలో రాగానపల్లి దగ్గర 982 ఎకరాల భూములు ఉన్నాయి. అయన గత పది సంవత్సరాలుగా అక్కడ నాగభూషణం మామిడితోటలు వేశాడు. పుంగనూరు నేత అతని ఆధ్వర్యంలో నియోజకవర్గంలో దాడులు ,కేసుల వ్యవహారం నడిపించారు. ఇదే సమయంలో వర్మ అనే మున్సిపల్ అధికారి వారికి సాయం చేసాడు. ఇక పెద్దిరెడ్డి పర్సనల్ కార్యదర్శిగా గత 30 సంవత్సరాల నుంచి తుకారాం కొనసాగారు. మొత్తం వ్యవహారాల్లో కీలక పాత్ర అతనిదే.

Also Read: టీ టీడీపీ అధ్యక్ష ఎన్నికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

శశికాంత్ మదనపల్లికి చెందిన వ్యక్తి.. గత ఐదు సంవత్సరాల క్రితం ఇతనిని మదనపల్లిలో స్థానికులు ఓగొడవ విషయంలో చితకబాదారు. దీంతో ఇతను పెద్దిరెడ్డి ప్యామీలి వద్దకు చేరుకున్నాడు. పెద్దిరెడ్డితో పాటు కూమారుడు మిథున్ రెడ్డికి నమ్మినబంటుగా మారాడు. అతనే మొత్తం పారెస్ట్ శాఖ వ్యవహారాలు చూసేవాడంట. ఇటీవల దాడుల్లో కీలక మైన నాలుగు బాక్సుల పైల్లు ఇతని వద్ద లభ్యమయ్యాయి.  అలాగే నగరికి చెందిన కెజె కూమార్ విజయవాడలో ఉంటూ వ్యవహారాలు నడిపాడు. ఇతను మైనింగ్ శాఖ లావాదేవీలు చూసాడంట. అతను తనకు వ్యతిరేకంగా పనిచేసాడని రోజా ఎన్నికల తర్వాత బహిరంగంగా అరోపించడం విశేషం.

బీరేంద్ర వర్మ నగరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో పెద్దిరెడ్డి ప్రతినిధి. ఇసుక, గ్రావెల్ దందాలు అతని చేతుల మీదుగా పెద్దఎత్తున నడిచాయి. పెద్దిరెడ్డితో విభేదించిన ఎమ్మెల్యే ఆదిమూలంతో అతను ఓ ఆటాడుకున్నాడు. హరీష్ రెడ్డి పీలేరు నియోజక వర్గంలో కీలక పాత్ర వహించాడు. 22ఎకరాల భూముల కబ్జా వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని ఆయన కేసు నమోదైంది. అతను మాజీ ఎమ్మెల్యే చింతల బావమరిది అయినప్పటికి పెద్ది రెడ్డి చెప్పినట్లు చేశేవాడంట.

మదనపల్లిలో రైస్ మిల్ మాధవరెడ్డిది కీలక పాత్ర. ఇతనే మొత్తం రెవెన్యూ దందాలు నిర్వహించాడు .. భూముల లిటిగేషన్లకు సంబంధించిన సమచారం అంతా ఆర్డీఓ మురళీ, సీనియర్ అసిస్టేంట్ తేజా అతనికి ఇచ్చేవారు. వాటి ఆధారంగా మొత్తం వ్యవహారం నడిపాడు. ఇక్కడ హార్షవర్ధన్ రెడ్డి, కరీముల్లా అనే కౌన్సిలర్, అక్కులప్ప అనే మాజీ జర్నలిస్టులు అతనికి సహకరించేవారు. అప్పట్లో పనిచేసిన డీఎస్పీలు రవిమనోహర్ చారి , కేశప్పలు వారికి పూర్తిగా సహాకరించారు.

చిత్తూరులో గతంలో పెద్దిరెడ్డి పీఆర్వో గా పనిచేసి ప్రస్తుతం చిత్తూరులో కౌన్సిలర్ గా ఉంటున్న హుసేన్ అలీషా మరియు పెద్దిరెడ్డిని గాడ్ ఫాదర్ గా కొలుస్తూ చిత్తూరు లో దొంగ సంతకాలతో కార్పొరేటర్లను ఏకగ్రీవం చేసి పెద్దిరెడ్డి మన్ననలు పొందిన బుల్లెట్ సురేష్ లకు మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో హస్తం ఉన్నట్లు పోలీసు వర్గాలు అంటున్నాయి. అంతే కాకుండా గతంలో హిజ్రాలతో చంద్రబాబు శవయాత్ర , మహిళ అని కూడా చూడకుండా మాజీ మేయర్ హేమలతపై పోలీసు జీపు ఎక్కించడం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానికి పెదిరెడ్డి ద్వారా సుమారు యాభై కోట్ల ఫైన్ విధింప చేయడం. ముఖ్యంగా కుప్పం మునిసిపల్ ఎన్నికలలో హల్చల్ చేయడంతో సాక్షాత్తు చంద్రబాబే ఎన్నికల అధికారులకు బుల్లెట్ సురేష్ పై ఫిర్యాదు చేయటం. ఇలా ఒక్కటేమిటి పెద్దిరెడ్డి అండదండలతో పేట్రేగి పోయిన సురేష్ ప్రస్తుతం వణికిపోతున్నాడట.

అందుకే బుల్లెట్ సురేష్ ఉన్న ఫలంగా పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నాడంట. కానీ టీడీపీలోని ఇతని బాధితులంతా ఏకమై హైకమాండ్ కు మొరపెట్టుకోవడంతో ఇతనిని టిడిపి గేట్ కూడా తాకనివ్వకూడదని హైకమాండ్ స్పష్టం చేసిందంట. ఇక చేసేది లేక జనసేన తీర్థం పుచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయగా అతన్ని పార్టీలో చేర్చుకుంటే పార్టీకి కష్టపడ్డ జనసేన క్యాడర్ ఇబ్బంది పడుతుందని జనసేన అధిష్ఠానం కూడా లైట్ తీసుకుందట. పైగా తమ కూటమి ధర్మాన్ని విస్మరించకూడదని టిడిపి క్యాడర్ ను రాచి రంపాన పెట్టిన బుల్లెట్ సురేష్ ను పార్టీలో తీసుకొంటే కూటమి నేతల మధ్య విభేదాలు వస్తాయని జనసేన అధినేత అంటున్నారంట. సిఐ లను దూషించిన కేసులోనో లేక, కార్పొరేటర్ల ఫోర్జరీ కేసులోనో కటకటాలు లెక్కించాల్సి వస్తుందన్న భయంతో బిక్కు బిక్కుమంటున్న బుల్లెట్ సురేష్ కు మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు నిద్రపట్టనీయడం లేదట.

Also Read: “దమ్ముంటే డీఎన్ఏ టెస్ట్ చేయించు”.. దువ్వాడ వాణికి మాధురి సవాల్

ఇక ఎస్‌పిడిసిఎల్ లో కాంట్రాక్టర్ అయిన మాజీ టీటీడీ బోర్డు మెంబర్ పోకల్ అశోక్ కూమార్ ది మరో రకమైన పెత్తనం.. ట్రాన్స్ కో పెద్ద ఎత్తున దందాలకు పాల్పడినట్లు ఇతనిపై అరోపణలు ఉన్నాయి. దీనిపైన విచారణ జరపాలని విద్యుత్ శాఖ మంత్రి అయిన గొట్టపాటి రవికి ఫిర్యాదు చేయడంతో.. విజిలెన్స్ విచారణ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. మరో వైపు తిరుపతిలో ఎస్ సి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు భూముల దందాల్లో కీలక పాత్ర పోషించాడంట. అదే విధంగా జనార్ధన్ రెడ్డి అనే మాజీ ఉద్యోగి కూడా పెద్దిరెడ్డికి బినామీగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది.

ఇక అనంతపురం జిల్లా లో కూడా పెద్దిరెడ్డి బినామీలు భయపడిపోతున్నారంట. మొత్తం మీద అటు బినామీలుగా ఉన్న వారితో పాటు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ పెత్తనం చేసిన నేతులంతా ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటో అని భయపడుతున్నారంట. సిఐడి విచారణలో వీరిపాత్ర ఖచ్చితంగా బయటపడే అవకాశ ముందని అంటున్నారు. ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా కాకుండా రాష్ట వ్యాప్తంగా పెద్దిరెడ్డి నడిపించిన దందాలపై విచారణ జరపాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తుండటంతో.. ఎప్పుడే ఉచ్చు బిగుసుకుంటుందో అని పెద్దిరెడ్డి టీం బిక్కుబిక్కు మంటూ గడుపుతుందంట.

Related News

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

Big Stories

×