EPAPER

Pawankalyan wave in Pithapuram: అంతర్గత సర్వే, పిఠాపురంలో పవన్‌కే మొగ్గు!

Pawankalyan wave in Pithapuram: అంతర్గత సర్వే, పిఠాపురంలో పవన్‌కే మొగ్గు!

Pawankalyan wave in Pithapuram: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ క్లైమాక్స్‌కు చేరింది. దాదాపు 55 రోజులపాటు నేతల మధ్య మాటలయుద్ధం సాగింది. ఇప్పుడు ప్రజల చూపు ఆ నియోజకవర్గంపై పడింది. అదే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం పిఠాపురం. కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.


ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఇప్పటివరకు ప్రచారాలతో నేతలు హోరెత్తించారు. జనసేన తరపున వ్యవహారాలన్నీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎన్ఎస్ వర్మ చక్కబెట్టారు. ప్రత్యర్థులపై ఏమాత్రం విమర్శలు చేయకుండా తెరవెనుక చక్కబెట్టారాయన. జనసేనానిని ఓడించేందుకు వైసీపీ అధినేత జగన్ కూడా తెరవెనుక పావులు కదిపారు. పేరుకే అభ్యర్థి వంగా గీత అయినా, వెనుక నుంచి చక్కబెట్టేదంతా ముద్రగడ పద్మనాభమే.

అంతర్గత సర్వే రిపోర్టుల ప్రకారం పిఠాపురం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురబోతున్నట్లు తెలుస్తోంది. జనసేనకు 55 శాతం, వైసీపీకి 40 శాతం, ఇతరులకు ఐదుశాతం వస్తుందన్న సర్వేల సారాంశం. పవన్ కల్యాణ్ గెలుపొందడానికి కారణాలు చాలానే ఉన్నాయన్నది అక్కడి ఓటర్ల మనోగతం. వ్యక్తిగత ఇమేజ్‌తోపాటు కాపు కుల సంఘం ఓటర్లు దాదాపు 80 శాతం పవన్‌కు మద్దతు ఇవ్వాలని ఈసారి నిర్ణయించాయి. దీనికితోడు వర్మ సపోర్టు కూడా కలిసి రానుంది.


పిఠాపురాన్ని అభివృద్ది చేస్తానని పవన్ చెప్పడంతో అన్నివర్గాల ప్రజల మద్దతు కూడగట్టారు. గడిచిన ఐదేళ్లగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యంగా పవన్ ఓడించడానికి అధికార పార్టీ చేసే ప్రయత్నాలు కూడా జనసేనానికి కలిసివస్తాయని చెబుతున్నారు అక్కడి ఓటర్లు. ముఖ్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో ఆయనకు మంచి సంబంధాలు కలిగి ఉండడం కూడా ప్లస్ పాయింట్.

వైసీపీ నుంచి వంగా గీత బరిలోకి దిగారు. గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచినప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నది ఆమెపై కాసింత నెగిటివ్ లేకపోలేదు. ఇదే పవన్‌కు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. అభివృద్ధి విషయంలో సొంత ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడకుండా మెతక వైఖరి అవలంభించడం మరో మైనస్. పార్టీ నుంచి మద్దతుతోపాటు పథకాల పొందిన కొన్నివర్గాల ప్రజల నుంచి మాత్రమే ఆమెకు  అనుకూలంగా కనిపిస్తోంది. ఓవరాల్‌గా చూస్తూ పవన్‌కల్యాణ్‌కు ఎడ్జ్ ఉందన్నది అంతర్గత రిపోర్టుల సారాంశం.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×