EPAPER

Pawan Kalyan Elected JLP leader: జేఎల్పీ నేతగా పవన్.. కేబినెట్‌లో వాళ్లకే ఛాన్స్..?

Pawan Kalyan Elected JLP leader: జేఎల్పీ నేతగా పవన్.. కేబినెట్‌లో వాళ్లకే ఛాన్స్..?

Pawan Kalyan Elected as JLP Leader: ఎట్టకేలకు జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కల్యాణ్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశానికి 21 మంది జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పవన్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. దాన్ని మిగతా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.


ఇదిలావుండగా చంద్రబాబు కేబినెట్‌లో జనసేన, బీజేపీ నుంచి ఎవరెవరు మంత్రులుగా ఉండబోతున్నార నే దానిపై చర్చ జరుగుతోంది. ఈ విషయమై ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు- పవన్‌కల్యాణ్ మధ్య సమావేశం జరిగింది. ఐదు కేబినెట్ బెర్తులు కావాలని పవన్ కోరినట్టు, అందుకు బాబు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.

ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూసి కూడా ఈ విధంగా అడగడం కరెక్టు కాదని బాబు అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి తమ పార్టీ నుంచి చాలామంది సీనియర్లు రేసులో ఉన్నారని తనపై చాలా ఒత్తిడి ఉన్నట్లు వివరించారట. మూడు లేదా నాలుగు అయితే చూద్దామని బాబు అన్నట్లు టీడీపీ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.


Also Read: నాకొద్దు ఆ పదవులు.. పవన్ నిర్ణయంతో షాక్ లో జనసేన

పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతోపాటు మూడు కేబినెట్ బెర్తులు ఇవ్వాలని భావిస్తున్నట్లు అందులోని సారాంశం. తెనాలి నుంచి నాదెండ్ల, అనకాపల్లి నుంచి కొణతాల, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పేరు దాదాపు ఖారరైనట్లు తెలుస్తోంది. మండలి బుద్ద ప్రసాద్‌కు కేబినెట్‌లో చోటు లేకుంటే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడానికి దాదాపు ఓకే అయినట్టు అంతర్గత సమాచారం.

బీజేపీ నుంచి ఇద్దర్ని మంత్రులుగా తీసుకోనున్నారట. సుజనాచౌదరి కాగా, మరొకరు సత్యకుమార్. కామినేని పేరు పరిశీలనలో ఉందన్నది బీజేపీ వర్గాల మాట. పార్టీ సమావేశంలో నేతల నిర్ణయం మేరకు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయేమో చూడాలి.

Tags

Related News

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

×