EPAPER

Pawan: దావోస్‌ ఎందుకు? నూడుల్స్‌ సెంటర్‌, చాయ్‌ పాయింట్లు ఉండగా.. జగన్ కు పవన్ పంచ్ లు

Pawan: దావోస్‌ ఎందుకు? నూడుల్స్‌ సెంటర్‌, చాయ్‌ పాయింట్లు ఉండగా.. జగన్ కు పవన్ పంచ్ లు

Pawan: చెప్పుతో కొడతానంటూ బహిరంగ వేదికపై చెప్పు చూపించడమే కాదు.. జనసేనాని విమర్శలు చెప్పుతో కొట్టినట్టే ఉంటాయి. హాట్ హాట్ కామెంట్లు చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. సెటైర్లు, పంచ్ లు సైతం పటాసుల్లా పేలుతాయి. లేటెస్ట్ గా ట్విట్టర్ లో జగన్ ను, వైసీపీని ఓ రేంజ్ లో వేసుకున్నారు పవన్ కల్యాణ్. ఇంతకీ ఆయన ఏమన్నారంటే…


“భూమి నుంచి ఇసుక వరకు.. మద్యం నుంచి గనుల వరకు.. అడవుల నుంచి కొండల వరకు.. కాగితం నుంచి ఎర్రచందనం వరకు.. ఏపీ నుంచి వచ్చే ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. నిజంగా ఇదో గొప్ప కళాఖండం.!”

“అరకులో బాక్సైట్‌ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి.. కామ్రేడ్‌ చారు మజుందార్‌, కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి, కామ్రేడ్‌ పుచ్చపల్లి సుందరయ్య వంటి ‘క్లాస్‌ వార్‌’ గురించి మాట్లాడుతున్నారు. ఇదో విచిత్రం!”.


“ఆంధ్రప్రదేశ్‌లో వర్గాలకు తావు లేదు, ప్రజలంతా వైసీపీ రాజ్యానికి బానిసలుగా అయిపోయారు. వారి జీవితాలు, గౌరవం, శ్రమ కొన్ని డబ్బులకు అమ్ముడుపోయాయి. ఏపీలో మిడిల్‌ క్లాస్‌పై అత్యంత నిర్లక్ష్యం. వారిని టాక్స్‌ పేయింగ్‌ మూగ సేవకులుగా వైసీపీ పరిగణిస్తోంది”.

“వైసీపీ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం తీసుకురాగలిగినప్పుడు.. దావోస్‌ ఎవరికి కావాలి? మన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఇప్పటికే నూడుల్స్‌ సెంటర్‌, చాయ్‌ పాయింట్లను ప్రారంభించారు. ఇప్పుడు ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం మాత్రమే వేచి ఉన్నారు. ఇదో చిత్రమైన పరిణామం”

ఇలా వరుస ట్వీట్లతో, వ్యంగాస్త్రాలతో ట్విట్టర్ ను హోరెత్తించారు జనసేనాని.

Related News

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Minister Kandula Durgesh: రాష్ట్రంలో స్టూడియోలు నిర్మించండి.. నిర్మాతలకు మంత్రి మరోసారి ఆహ్వానం

Big Stories

×