EPAPER

Pawan Kalyan : ఏపీలో మార్పు ఖాయం.. జగన్ ను ఇంటికి పంపిస్తాం..

Pawan Kalyan : ఏపీలో మార్పు ఖాయం.. జగన్ ను ఇంటికి పంపిస్తాం..
Pawan Kalyan speech latest

Pawan Kalyan speech latest(Andhra pradesh political news today):

నారా లోకేశ్ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జగన్‌ మాదిరిగా బుగ్గలు నిమిరే పాదయాత్ర చేయలేదన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టడం బాధకలిగించిందన్నారు. ఆ సమయంలో ఏదో ఆశించి మద్దతు ఇవ్వలేదన్నారు. వారి కుటుంబ బాధను అర్థం చేసుకున్నానని తెలిపారు. కక్ష పూరితంగా చంద్రబాబును జైల్లో పెట్టారని విమర్శించారు.


2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేనాని స్పష్టంచేశారు. ఏపీలో మార్పు తీసుకొస్తామని తేల్చిచెప్పారు. జగన్‌ను ఇంటికి పంపిస్తామన్నారు. ఇప్పటికే జగన్ 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చారని తెలిపారు. మరో 80 మందిని మార్చే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. కానీ మార్చాల్సింది సీఎం నేనని స్పష్టంచేశారు. జగన్ ది కక్ష సాధింపు తత్వమన్నారు. విమర్శలు చేస్తే దాడులు చేయించారని ఆరోపించారు.

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఇతర పార్టీల నేతల ఇళ్లలోని ఆడవాళ్లను ఏ నాయకుడు తిట్టంచలేదన్నారు పవన్. కానీ ఆడవాళ్లను తిట్టే విష సంస్కృతిని జగన్ తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇంట్లో ఉన్న తల్లికి, చెల్లికే విలువఇవ్వని వ్యక్తి.. మిగతా ఆడవాళ్లను ఎలా గౌరవిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక మంది మహిళలు అదృశ్యమయ్యారని తెలిపారు.


వారాహి యాత్రలో తనను ఇబ్బంది పెట్టారని పవన్ కల్యాణ్ విమర్శించారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే ఎవరూ ఆంధ్రప్రదేశ్ లో ఉండలేరన్నారు. యువత భవిష్యతను దృష్టిపెట్టుకుని వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని గతంలో చెప్పానన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని బీజేపీ జాతీయ నాయకులకు వివరించానని తెలిపారు. సినిమా టిక్కెట్ల విషయంలో ఇబ్బందిపెట్టారని.. అన్ని అంశాలను అమిత్ షాకు చెప్పానన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×