EPAPER

Pawan Kalyan on Ministry Post: నాకొద్దు ఆ పదవులు.. పవన్ నిర్ణయంతో షాక్ లో జనసేన..!

Pawan Kalyan on Ministry Post: నాకొద్దు ఆ పదవులు.. పవన్ నిర్ణయంతో షాక్ లో జనసేన..!

రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణ కోసం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్‌ సమీపంలోని దాదాపు పన్నెండు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. సీబీఎన్ నాలుగో సారి సీఎం పగ్గాలు చేపటనున్న చారిత్రకఘట్టానికి యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకార ముహూర్తం  నిర్ణయించారు

ప్రధాని మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరుకానుండటంతో ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు. ఈ వేడుకకు వైసీపీ ప్రభుత్వ భాధితులకు కూడా ఆహ్వానాలు వెళ్లడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 104 బాధిత కుటుంబాలను ఆహ్వానింది. వారి కోసం ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు కొందరు ముఖ్య నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోడీ ప్రమాణస్వీకారం తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబు క్యాబినెట్ కూర్పుపై సమీక్షిస్తున్నారు.


Also Read: ఈసారి రాజు గారు వంతు.. జగన్‌తోపాటు కొందరు అధికారులు..

క్యాబినెట్‌లో జనసేన అధినేత పవన్‌కు ఇచ్చే పదవిపైనా.. యావత్‌ రాష్ట్రం ఉత్కంఠగా చూస్తోంది. కూటమిలో కీలకంగా పనిచేసిన జనసేనకు అన్యాయం జరగకుండా ఉండేలా చంద్రబాబు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్‌తో పాటు బీజేపీ నేతలతోనూ చంద్రబాబు చర్చించారు. పవన్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి పదవి ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. జనసేనకు 3, 4 మంత్రి పదవులు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణలకు కేబినెట్ బెర్త్‌లు ఖాయమైనట్లే.

8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీ నుంచి ఇద్దరికి కేబినెట్‌లో చోటు దక్కనుంది. బీజేపీ కోటాలో ఒక ఓసీ, ఒక బీసీకి కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం కనిపిస్తుంది. కమ్మ సామాజికవర్గం నుంచి రేసులో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి,అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ రేసులో కనిపిస్తున్నారు. అయితే, సుజనా చౌదరి, సత్యకుమార్, ఆదినారాయణరెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Also Read: Chandrababu Naidu: దటీజ్ చంద్రబాబు నాయుడు.. ఎనీ డౌట్స్?

ఉమ్మడి జిల్లాలు, కులాల వారీగా చంద్రబాబు కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నారు. మిత్రపక్షాలకు కేటాయించే మంత్రిపదవులకు సంబంధించి కూడా క్యాస్ట్ ఈక్వేషన్లు బేలన్స్ చేయడానికి ఎక్సర్‌సైజ్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తుతున్నాయి. ఈ సారి టీడీపీ సీనియర్లతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా కేబినెట్ కూర్పు ఉండబోతుందంట.

అదలా ఉంటే పవన్‌కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎం పదవిపై జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే జనసేనాని కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. భారీ చిత్రాలు ఓజీ, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్‌లు ఏడాదిలోగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారంట పవర్ స్టార్.. వాటి తర్వాత పాలిటిక్స్‌కి ఫూల్ టైం కేటాయించగలనని అప్పటి వరకు కేబినెట్‌కు దూరంగా ఉండటమే బెటర్ అన్న అలోచనలో ఉన్నట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. మరి అది ఎంత వరకు నిజమో కాని.. ఉపముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం కోసం జనసైనికులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×