EPAPER

Pawan Kalyan: గబ్బర్ సింగ్ ఇంకా డ్యూటీ ఎక్కలేదా? పవన్ కళ్యాణ్ కి ఏమైంది?

Pawan Kalyan: గబ్బర్ సింగ్ ఇంకా డ్యూటీ ఎక్కలేదా? పవన్ కళ్యాణ్ కి ఏమైంది?

Pawan kalyan mark in AP politics(Political news in AP): ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఓ సంచలనం. పదేళ్లయినా రాజకీయాలలోకి వచ్చి ఏనాడూ పదవులు ఆశించక తాను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు వెళుతున్నారు. అయితే గత పదేళ్లుగా ప్రజల పక్షాన నిలిచి.. ప్రజా ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ మొన్నటి ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీని కలిసేలా చేయడంలో కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు తీసుకున్నారు. పవన్ అభిమానులు మాత్రం ఆయనకు హోం శాఖ ఇస్తే బాగుండేదని అనుకున్నారు. అయినా పవన్ కళ్యాణ్ కు దక్కిన శాఖలతో కూటమిలో ఆయనకున్న వెయిట్ ఏమిటో తెలిసి వచ్చింది.


తుఫాన్ ఎక్కడ?

పవన్ కళ్యాణ్ గత ఐదేళ్లుగా వైసీపీ నేతలపై తనదైన రీతిలో వారి విధానాలను ఎండగడుతూ వచ్చారు. అంతేకాదు ఆ పార్టీ నేతలను గూండాలతో పోలుస్తూ..తాము అధికారంలోకి రాగానే తోలు తీస్తాం అంటూ.. పాలన ప్రక్షాళనం అంటూ అనేక సందర్భాలలో చెబుతూ వచ్చారు. జనం కూడా పవర్ స్టార్ నుంచి పవన్ ఫుల్ పాలన ఆశిస్తూ వస్తున్నారు. చూస్తుండగానే నెలలు గడిచిపోతున్నాయి. ఇంతవరకూ పవన్ కళ్యాణ్ నుంచి ఆశించిన స్థాయిలో.. పవన్ చేపట్టిన శాఖలనుంచి ప్రక్షాళన లాంటి కార్యక్రమాలేమీ జరగడం లేదు. పైగా పవన్ పదవీ ప్రమాణ స్వీకారం సమయంలో సాక్షాత్తూ ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ ను తుఫానుతో పోల్చారు. చూస్తుండగానే పవన్ పదవీ ప్రమాణ స్వీకారం దాటి రెండు నెలలు దాటిపోతోంది. ఇంకెప్పుడు పవన్ తనదైన మార్క్ చూపుతారని అడుగుతున్నారంతా.


శాఖలపై సమీక్షలేవి?

చంద్రబాబు నాయుడు పవన్ కు ఇచ్చిన శాఖలు మామూలు శాఖలు కావు. వైసీపీ పాలనలో గ్రామీణ వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయింది. అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఇక సాంకేతికంగానూ ఏపీలో ఎటువంటి మార్పులు తీసుకొస్తారా అని పవన్ కు కేటాయించిన శాఖలను పవన్ ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటాడో అని అంతా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు నిజంగా ఇది పరీక్ష సమయమే. ఇప్పటిదాకా పవన్ ఒక లెక్క ఇకపై మరో లెక్క. పవన్ కళ్యాణ్ అనగానే సిన్సియారిటీ, అంకితభావం, క్రమశిక్షణ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే చాలా మంది ఆయనకు అభిమానులయ్యారు. సినిమారంగంలోనూ ఆయన ఎప్పుడూ రికార్డుల కోసం తహతహ లాడరు. తనతో సినిమా తీసిన నిర్మాత చల్లగా ఉండాలని భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్. పేరుకు జనసేన పార్టీ అంటూ పెట్టినా.. ఏనాడూ ఆర్భాటాల జోలికి వెళ్లలేదు. ప్రజలు తనని నేతగా గుర్తించినప్పుడే తనేమిటో నిరూపించుకోవాలని అనుకున్నారు పవన్ కళ్యాణ్.

పవన్ పై పెద్ద బాధ్యత

ఆయన సిన్సియారిటీ నచ్చే పవన్ కళ్యాణ్ కు కూటమితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గానే గుర్తించి ఓటేశారు. తన వాగ్ధాటితో నాటి వైఎస్ఆర్ సర్కార్ ను మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఇక పవన్ కళ్యాణ్ పై చేసేందుకు ఆరోపణలు లేక స్వయంగా నాటి ఏపీ సీఎం జగన్ పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసి బురద జల్లే ప్రయత్నం కూడా చేశారు. పవన్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి అంటూ పబ్లిక్ ముందు దోషిగా నిలబెట్టే యత్నం కూడా చేశారు. అయినా పవన్ వాటన్నింటికీ సమాధానం చెబుతూ వచ్చారు. జనం కూడా జగన్ మాటలు లైట్ గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఊహించిన మెజారిటీ కన్నా ఎక్కువగా జనసేనకు ఓట్లు పడ్డాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై చాలా పెద్ద బాధ్యత ఉంది. ఒక పక్క అధికార టీడీపీ ని సపోర్టు చేస్తూనే పాలనలో తనదైన మార్కు చూపిస్తేనే ఆయన రాజకీయ భవితకు ఇది ఒక పునాదిలా ఉపయోగపడుతుందని అంటున్నారంతా. ఇకపై పవన్ పాలనపై సరికొత్త ముద్ర వేయాలని .. తన శాఖల అధికారులను పరుగెత్తించాలని అంతా ఎదురుచూస్తున్నారు.

Related News

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

Big Stories

×