EPAPER

Pawan kalyan met: ఫలించిన పవన్ దౌత్యం.. మెత్తబడిన నేతలు

Pawan kalyan met: ఫలించిన పవన్ దౌత్యం.. మెత్తబడిన నేతలు

Pawan kalyan met: తిరుపతి జనసేనలో నెలకొన్న సంక్షోభం సద్దుమణిగిందా? లోకల్ నేతలను వదిలి బయట నుంచి వచ్చినవారికి టికెట్ ఇవ్వడంపై టీడీపీతోపాటు జనసేన నేతలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అంతేకాదు పలుమార్లు కార్యకర్తలతో కూడా సమావేశాలు నిర్వహించారు. జరుగుతున్న పరిణామాలను గమనించిన పవన్‌కల్యాణ్ నేరుగా రంగంలోకి దిగేశారు.


మంగళగిరి నుంచి శుక్రవారం సాయంత్రం తిరుపతికి చేరుకున్న పవన్‌కల్యాణ్.. ముందుగా పార్టీ నేతలతో భేటీ అయ్యారు. వారి నుంచి ఇన్‌పుట్స్ తీసుకున్నారు. ఆ తర్వాత కిరణ్ రాయల్, టీడీపీ నేత సుగుణమ్మ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పొత్తుకు దారి తీసిన పరిస్థితులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కూటమి నేతలతంతా అరణి శ్రీనివాసులును గెలిపించాలని నేతలను కోరారు.

ఈసారి ఎన్నికల్లో భూమన గెలిస్తే తిరుపతిలో ఎవరూ ఉండలేని పరిస్థితి వస్తుందన్నారు పవన్ కల్యాణ్. తిరుపతిలో జరుగుతున్న అక్రమాలు ప్రతీ ఒక్కరికీ తెలుసని, చివరకు తిరుమల కొండకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ముఖ్యంగా టీడీపీ-జనసేన మధ్య ఓట్ల బదలాయింపు శాతం పెరుగుతోందన్నారు. చంద్రబాబు తో కలిసి హాజరవుతున్న సభలకు జనం నుంచి మాంచి రెస్పాన్స్ వస్తోందని గుర్తు చేశారు. ఈ సమయంలో నేతలు కాస్త ఆలోచించాలన్నారు.


గడిచిన ఐదేళ్లుగా ఎన్నిబాధలు పడ్డారో తనకు తెలుసన్నారు పవన్. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పడంతో నేతలు కాస్త మెత్తబడి నట్టు కనిపించింది. అటు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డితోపాటు జనసేన నేత వినుతను సైతం పవన్ కలిసి మాట్లాడారు. మొత్తానికి కొద్దిరోజులుగా నెలకొన్న అంతర్గత పరిస్థితులకు పవన్ ఫుల్ స్టాప్ పెట్టినట్టే కనిపిస్తోంది.

 

Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×