EPAPER

Pawan Kalyan: ‘మా అన్నయ్య అజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదు’.. సజ్జలకు పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్

Pawan Kalyan: ‘మా అన్నయ్య అజాత శత్రువు.. ఆయన జోలికొస్తే సహించేది లేదు’.. సజ్జలకు పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్

Pawan Kalyan about Chiranjeevi(AP news today telugu): తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి జోలికి రావొద్దంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన అన్నయ్య అజాత శత్రువు అని.. ఆయన జోలికి వస్తే సహించేది లేదన్నారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉంటారో, వేరే పార్టీలో ఉంటారో అది తన ఇష్టం అని సజ్జలకు అవసరం లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి, రాష్ట్ర ప్రజల జోలికి రావొద్దంటూ సజ్జలను పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.


ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు కీలక హామీలు ఇచ్చారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు రూ.4వేల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లపాటుగా ఎన్నో కష్టాలను జనసేన ఎరుద్కొని నిలబడిందని వెల్లడించారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన వారిహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ సంచలన హామీలు ఇచ్చారు. రాష్ట్రంలోని 50 ఏళ్లు దాటిన ప్రతి బీసీకి రూ.4 వేల పెన్షన్ అందిస్తామన్నారు. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా సరే వారందరికీ ఏటా రూ.15 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు.


ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని, అలాగే రైతులకు ఏడాదికి రూ.20వేల సాయం కూడా చేస్తామన్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. అయితే ఇవన్నీ టీడీపీ-జనసేన గతంలో వెల్లడించిన ఉమ్మడి హామీలే.. వాటిని మరోసారి పవన్ కళ్యాణ్ ప్రజలకు వెల్లడించారు.

పదేళ్ల పాటు ఎన్నో కష్టాల మధ్య జనసేన పార్టీ పెరిగిందని పవన్ కళ్యాణ్ ప్రజలకు తెలియజేశారు. తాను మొగల్తూరులోని చిన్న ఫ్యామిలీ నుంచి పైకి వచ్చానని.. చిన్న, చిన్న పట్టణాల్లో పెరిగానన్నారు. ప్రతి మనిషి పడే కష్టం తనకు తెలుసు అని అన్నారు.

Also Read: ఏటా జ్యాబ్ క్యాలెండర్ అన్నారే.. ఏదీ ఎక్కడా కనబడదే..?: వైఎస్ షర్మిల

సీఎం జగన్ పై మాదిరిగా తనపై 32 కేసులు లేవని ఎద్దేవా చేశారు. జనసేన-టీడీపీలు రాష్ట్ర అభివృద్ధి కోసమే.. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని మరోసారి తెలిపారు. నరసాపురంతో తనకు ప్రత్యేక అనుభందం ఉందని చెప్పుకొచ్చారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నరసాపురంలోనే చదువుకున్నారని గుర్తు చేశారు.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×