EPAPER

Pawan Kalyan: పవన్ చూపు ఎటు?.. పోటీ చేయబోయే సెగ్మెంట్‌పై అందరిలో ఆసక్తి..

Pawan Kalyan: పవన్ చూపు ఎటు?.. పోటీ చేయబోయే సెగ్మెంట్‌పై అందరిలో ఆసక్తి..

Pawan kalyan Focus On Chiranjeevi Sentiment: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడినుండి పోటీ చేయబోతున్నారు? గతంలో లాగా రెండు చోట్ల పోటీ చేస్తారా? లేదా ఓకే నియోజకవర్గం నుండి బరిలో నిలబడతారా? పవన్ పోటీ అక్కడ ఇక్కడ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? పవన్ పోటీ చేయాలనుకుంటున్న ఆ నియోజకవర్గాలు ఏంటి? సామాజిక సమీకరణాల కోణంలోనే పవన్ కళ్యాణ్ పోటీ ఉండబోతుందా? అసెంబ్లీలో అడుగుపెట్టడానికి జనసేనాని ఏ సెగ్మెంట్ సెలక్ట్ చేసుకుంటారు? అసలు తాజాగా ఆయన ఎటు చూస్తున్నారు?


ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. అటు అధికార పార్టీ వరుసగా అభ్యర్థులు ప్రకటించుకుంటూ దూకుడు ప్రదర్శిస్తుంది. మరోవైపు పొత్తులో ఉన్న టీడీపీ, జనసేనలు కూడా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కసిగా ఉన్న ఆ కూటమి గెలుపు గుర్రాల సెలక్షన్‌కు ఎక్సర్‌సైజ్ చేస్తున్నాయి. అయితే 175 నియోజకవర్గాల్లో పోటీ ఎలా ఉన్నా.. ఈ సారి రాజకీయ వర్గాల్లో పవన్‌కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

పవన్ ఎక్కడనుంచి పోటీ చేయబోతున్నారు ? ఏ నియోజకవర్గ అయితే ఆయనకి కి సెట్ అవుతుంది? ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చంతా దాని గురించే.. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని, అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే తాను పోటీ చేయబోయే సెగ్మెంట్ గురించి సైలెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు.


గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. అనూహ్యంగా రెండు చోట్లా ఓడిపోయారు. పార్టీ అధ్యక్షుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో దాని ఎఫెక్ట్ పార్టీ కేడర్ మీద కూడా కనిపించింది. అయితే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ .. హడావిడిగా జరిగిందని, నియోజకవర్గం ఎంపిక చేసుకునే సమయం కూడా లేకపోవడం పవన్ ఓటమికి కారణాలని.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే ఈసారి అలాంటి తప్పులు చేయకుండా కచ్చితంగా గెలిచే నియోజకవర్గంపై పవన్ ఫోకస్ పెట్టారట.

గత ఆరు నెలలుగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల మీద పెద్ద చర్చ జరుగుతుంది. భీమవరం, పిఠాపురం, కాకినాడ టౌన్, గాజువాక, విజయవాడ తూర్పు, తిరుపతి నియోజకవర్గాల నుండి పవన్ పోటీ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో.. పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గాలను ఫైనల్ చేయాలనుకుంటున్నారట. జనసేన శ్రేణుల ఇంటర్నల్ సోర్స్ ప్రకారం.. పవన్ కళ్యాణ్ భీమవరం, తిరుపతిల నుంచి పోటీలో ఉండాలని భావించారంట.. భీమవరం వారాహి యాత్ర సందర్భంగా.. తిరిగి తాను అక్కడ పోటీ చేయబోతున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు జనసేనాని.

ఇక తిరుపతి నియోజకవర్గం సెంటిమెంట్ నియోజకవర్గంగా భావించి.. పవన్ పోటీ చేయాలనుకుంటున్నారట.. 2009 ఎన్నికల్లో పాలకొల్లు, తిరుపతి నుండి పోటీ చేసిన సీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి.. పాలకొల్లు ఓటర్లు ఆదరించనప్పటికీ.. తిరుపతి ప్రజలు అక్కున చేర్చుకున్నారు. తిరుపతిలో బలిజ సామాజికవర్గం గణనీయంగా ఉండటం మెగాస్టార్‌కి కలిసివచ్చింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తూ పవన్ తిరుపతి నుండి కూడా బరిలో ఉంటారని టాక్ వినిపించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ని జనసైనికులు చేశారంటున్నారు.

అయితే పవన్ తన మైండ్ సెట్ మార్చుకున్నారన్న ప్రచారం కూడా స్టార్ట్ అయింది. మొదటి నుంచి ప్రచారం జరిగిన నియోజకవర్గాల నుంచి కాకుండా.. ఇప్పుడు విజయవాడ తూర్పు, పెనమలూరుల వైపు చూస్తున్నారంటున్నారు. బలం ఉన్నచోట కంటే లేనిచోట పోటీ చేసి గెలవాలన్నది ఆయన ఆలోచనగా చెప్తున్నారు. చంద్రబాబుతో తాజా భేటీలో జనసేనాని ఆ విషయం చెప్పారని.. చంద్రబాబు కూడా సరే అన్నట్లు సమాచారం.

ఇదే విషయం చంద్రబాబు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దెరామ్మెహన్‌కి చెప్పారంటున్నారు. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేయడానికి గద్దె సరే అన్నారని తెలుస్తోంది. ఇక పెనమలూరు విషయానికి వస్తే పవన్ అక్కడ నుంచి పోటీ చేస్తానంటే.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కూడా అభ్యంతరం పెట్టే పరిస్థితి లేదంటున్నారు. ఈ ప్రచారం స్టార్ట్ అవ్వడంతో క‌ృష్ణా జిల్లా జనసేన నేతల్లో గుబులు రేగుతోందంట.. తమ అధినేత జిల్లాలో రెండు స్థానాల నుంచి పోటీ చేస్తే.. ఇక తమకు పోటీ చేసే అవకాశం దక్కదని.. అప్పుడు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారట.

వివిధ జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్‌ని తమ దగ్గర పోటీ చేయాలని కోరుతున్నారు. అక్కడి టీడీపీ అభ్యర్ధులు కూడా పవన్ వస్తే తమ సీట్లు త్యాగం చేస్తామంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి.. వారంలో క్లారిటీ వస్తుంటున్నారు జనసైనికులు.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×