EPAPER

Pawan Kalyan: జగన్ నొక్కని బటన్‌లు ఇవే.. పెద్ద లిస్టే చదివిన పవన్.. ఆసక్తిగా విన్న జనం..

Pawan Kalyan: జగన్ నొక్కని బటన్‌లు ఇవే.. పెద్ద లిస్టే చదివిన పవన్.. ఆసక్తిగా విన్న జనం..
pawan kalyan speech

Pawan kalyan meeting today live(Breaking news in Andhra Pradesh): వారాహి విజయ యాత్రలో జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి పూనకంతో ఊగిపోయారు. మాటిమాటికి బటన్ నొక్కి డబ్బులు ఇస్తానని చెప్పుకుంటున్న సీఎం జగన్.. ఇంతవరకూ ఆయన నొక్కని బటన్‌లు చాలానే ఉన్నాయంటు.. పెద్ద లిస్టే చదివి వినిపించారు పవన్. అది చూస్తే.. వామ్మో.. పెండింగ్‌లో ఉన్న బటన్‌లు ఇన్నా అనిపిస్తాయి. జనసేనాని ఆ లిస్ట్ చదువుతున్నంత సేపు.. వారాహి సభలో కిక్కిరిసిన ప్రజానీకం చాలా ఆసక్తిగా విన్నారు. పవన్ మాట్లాడుతుంటే.. సీఎం.. సీఎం.. అంటూ ఊగిపోయే ఫ్యాన్స్.. ఆ లిస్ట్ చదువుతుంటే పిన్ డ్రాప్ సైలెంట్.


పవన్ చెప్పిన.. జగన్ నొక్కని బటన్‌లు ఇవే:
–పూర్తికాని పోలవరం.. నువ్ నొక్కని బటన్
–రాని ఉద్యోగ నోటిఫికేషన్స్.. నువ్ నొక్కని బటన్
–నష్టపోయిన రైతులకు అందని పంటనష్ట పరిహారం.. నువ్ నొక్కని బటన్
–ఇళ్లు కోల్పోయి జీవనోపాధిలేని మత్స్యకారుల దీనస్థితి.. నువ్ నొక్కని బటన్
–మద్దతుధర రాని కొబ్బరి సాగు.. నువ్ నొక్కని బటన్
–ఉపాధి లేక వలసలు పోతున్న బతుకులు.. నువ్ నొక్కని బటన్
–పూర్తికాని బ్రిడ్జిలు.. నువ్ నొక్కని బటన్
–దగ్థమవుతున్న దేవాలయాలు, అంతర్వేది రథాలు.. నువ్ నొక్కని బటన్
–దళితులను చంపి, హంతకులు ధైర్యంగా బయటతిరుగుతున్నారే అది.. నువ్ నొక్కని బటన్
–ఆక్వా రైతుకు రూపాయిన్నరకు యూనిట్ కరెంట్ ఇవ్వలేకపోయావే అది.. నువ్ నొక్కని బటన్
–నర్సాపురం వరకు రాని కోనసీమ రైలు.. నువ్ నొక్కని బటన్
–అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్.. నువ్ నొక్కని బటన్
–మూతపడిన 8వేల బడులు.. నువ్ నొక్కని బటన్
–కొత్త కాలువలు కాదు, ఉన్న కాలువల పూడిక తీయకపోవడం.. నువ్ నొక్కని బటన్
–ఆరోగ్యశ్రీ అందకపోయి కోల్పోయిన ప్రాణాలు.. నువ్ నొక్కని బటన్
–తాగునీరు దొరకని గ్రామాలు.. నువ్ నొక్కని బటన్
–స్వయంఉపాధి రాకపోవడం.. నువ్ నొక్కని బటన్
–కాన్పు కోసం డోలీలో వెళుతూ మునిగిపోయిన గిరిజన మహిళ.. ఆ గిరిజన మహిళ చావు.. నువ్ నొక్కని బటన్
–ఆగిన అంబేద్కర్ విదేశీ విద్య సాయం.. నువ్ నొక్కని బటన్
–అప్పుల ఆంధ్రప్రదేశ్.. నువ్ నొక్కని బటన్
–నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించనిది.. నువ్ నొక్కని బటన్
–ఆడపిల్లలకు మాన, ప్రాణ సంరక్షణ లేనిది.. నువ్ నొక్కని బటన్

ఇక, అధికారంలోకి వస్తే జనసేన ఏం చేస్తుందో కూడా చెప్పారు పవన్ కల్యాణ్. నియోజకవర్గానికి 50 మంది యువతకు 10 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్లు, లాయర్ల భద్రతకు, ఆడబిడ్డల రక్షణకు కఠిన చట్టాలు తీసుకొస్తామన్నారు. అన్నిరోగాలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా.. మెరుగైన ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తామని చెప్పారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×