EPAPER

Pawan Kalyan latest news: నేనే సీఎం.. పొత్తులు పెండింగ్.. క్లారిటీతో కూడిన కన్ఫ్యూజన్!?

Pawan Kalyan latest news: నేనే సీఎం.. పొత్తులు పెండింగ్.. క్లారిటీతో కూడిన కన్ఫ్యూజన్!?
Pawan kalyan news today

Pawan kalyan news today(Latest political news in Andhra Pradesh):

ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. సమయం లేదు మిత్రమా అంటూ జనసేనాని వారిహిపై విజయయాత్ర చేస్తున్నారు. సీఎం జగన్ పాలనను ప్రజల్లో ఎండగడుతున్నారు. పవన్ దూకుడు మామూలుగా లేదు. ఇంతవరకు ఓకే కానీ.. మరి, పొత్తులు? ఈ పాయింట్ దగ్గరే కన్ఫ్యూజన్.


ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పక్కాగా చెబుతున్నారు పవన్. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నారు. టీడీపీతో దోస్తీ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. షా, నడ్డాలతో చంద్రబాబును కలిపించారు కూడా. అయినా, ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పొత్తులపై ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు.

ఇదే సమయంలో ఎక్కడికక్కడ, ఎవరికి వారే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు పవన్, చంద్రబాబులు. అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారంటే..? మరి, పొత్తు కుదిరితే ఎట్టా? ఆశావహులు హర్ట్ అవరూ? అందుకే, పొత్తుల వ్యవహారం ఎంత ఆలస్యం అయితే.. ఆయా పార్టీలకు అంత ఇబ్బంది తప్పకపోవచ్చు. మరి, ఉన్నపళంగా ఇప్పటికిప్పుడు పొత్తులు ప్రకటించే పరిస్థితి కూడా లేదు.


పవన్ తన బలం పెరిగిందంటున్నారు. జనసేనకు ఇన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. తానే సీఎంగా ఉంటానని అంటున్నారు. ఇదే విషయం ఆయన ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. మరి, పవన్ అడిగినన్ని సీట్లు చంద్రబాబు ఇస్తారా? జనసేనానిని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారా? మధ్యలో బీజేపీ వర్షన్ ఏంటి? ట్రయాంగిల్ లవ్ కుదురుతుందా? కుదిరితే ఇంకెప్పుడు? ఇలా అనేక ప్రశ్నలు.

లేటెస్ట్‌గా మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కల్యాణ్. ముఖ్యమంత్రి పదవిని తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. వైసీపీని ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకుండా అడ్డుకుని తీరుతానని అన్నారు. అయితే, పొత్తు జనసేన-బీజేపీతోనా.. లేదంటే టీడీపీ-జనసేన-బీజేపీతోనా.. అనేది తేలాల్సి ఉందని తెలిపారు.

అంటే.. పొత్తుల విషయం చర్చల దశలోనే ఉందని.. ఇంకా ఫైనల్ కాలేదనేది పవన్ భావన. 6 నెలల క్రితం ఇదే డైలాగ్ చెప్పారు.. ఇప్పుడూ అదే అంటున్నారు. పొత్తులపై ఎంత త్వరగా తేలిస్తే.. అంత మంచిదని తెలిసినా.. తేల్చలేకపోతున్నారని పవన్ మాటలను బట్టి తెలుస్తోంది.

సీఎం పదవి తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నా.. ప్రజల మద్దతు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని పవన్ కల్యాణ్ అంటున్నారు. జనసేన నాయకత్వాన్ని తాను బలోపేతం చేస్తానని, మొత్తం ప్రక్రియలో ఓటు చీలకూడదనేదే తన ఉద్దేశమన్నారు జనసేనాని.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×