EPAPER

Pawan Kalyan : యుద్ధానికి నేను సిద్ధం.. జనసైనికులారా సిద్ధమా..!: పవన్

Pawan Kalyan : యుద్ధానికి నేను సిద్ధం.. జనసైనికులారా సిద్ధమా..!: పవన్

Pawan Kalyan : జనసేన పార్టీ 10వ వసంతంలోకి అడుగుపెడుతోంది. మార్చి 14న మచిలీపట్నంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం వచ్చారు. అక్కడ నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు ట్విట్టర్ వేదికగా సందేశమిచ్చారు. ‘యుద్ధానికి నేను సిద్ధం.. జన సైనికులారా మీరు సిద్ధమా!’ అని పవన్‌ ట్వీట్‌ చేశారు.


మరోవైపు జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ శ్రేణులకు ఎలా దిశానిర్దేశం చేస్తారు? పొత్తులపై క్లారిటీ ఇస్తారా? ఎన్నికల అజెండా ప్రకటిస్తారా? వారాహి వాహనం ద్వారా చేపట్టే యాత్ర షెడ్యూల్ ను ప్రకటిస్తారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని జనసైనికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీ శ్రేణులు మచిలీపట్నం వచ్చేందుకు కదనోత్సవంతో ఉన్నాయి. ఇప్పటికే యుద్ధానికి సిద్ధమని ప్రకటించిన జనసేనాని పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమైనట్టేనా..?

బీసీలపై ఫోకస్..
ఇంకోవైపు బీసీల ఓట్లపై జనసేన దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో బీసీ సదస్సు నిర్వహించింది. జనసేన పార్టీ మొదటి నుంచి బీసీ వర్గాలకు సముచిత గౌరవం ఇస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తోందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. జాతీయస్థాయిలో బీసీ జనగణన జరగాలన్నారు. అప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలకు జనసేన పరిష్కారం చూపుతుందన్నారు. బీసీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేసేందుకే బీసీ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం 56 కుల సంఘాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా.. వాటి ద్వారా జరిగిన లాభం శూన్యమని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే బీసీలను వాడుకుంటున్నారని నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు.


FOR MORE UPDATES PLEASE FOLLOW : https://bigtvlive.com/andhra-pradesh

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×