EPAPER

Parthasarathy : పార్థ.. సారధ్యం ఎక్కడి నుంచి..?

Parthasarathy : పగవాడికి కూడా రాకూడదు ఇలాంటి కష్టాలు.. అని అనుకునేలా తయారైందంట మాజీ మంత్రి పార్థసారథి పరిస్థితి. ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో టీడీపీలోకి షిఫ్ట్ అవ్వడానికి రెడీ అయ్యారు ఈ పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే.. వై

Parthasarathy :  పార్థ.. సారధ్యం ఎక్కడి నుంచి..?

Parthasarathy : పగవాడికి కూడా రాకూడదు ఇలాంటి కష్టాలు.. అని అనుకునేలా తయారైందంట మాజీ మంత్రి పార్థసారథి పరిస్థితి. ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో టీడీపీలోకి షిఫ్ట్ అవ్వడానికి రెడీ అయ్యారు ఈ పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే.. వైసీపీ టికెట్ దక్కలేదని టీడీపీ వైపు చూస్తే.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆయనపై భగ్గుమంటున్నారు. పోనీ ఈ సారి నూజివీడు నుంచి పోటీ చేద్దామనుకుంటే.. అక్కడి టీడీపీ ఇన్‌చార్జ్ ముద్రబోయిన మండిపడుతున్నారంట. ఆ సహాయ నిరాకరణలతో ఏం చేయాలో అర్థం కాక.. తలపట్టుకోవాల్సి వస్తోందంట ఆయనకి.


కొలుసు పార్దసారధి.. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే.. వైసీపీలో పెనమలూరు నుంచి గెలుపొందిన ఆయన ఆ పార్టీ వాయిస్ గట్టిగానే వినిపిస్తూ వచ్చారు. అయితే ఈ సారి టికెట్ రిజెక్ట్ అయి వైసీపీలో వాయిస్ పెంచే పరిస్థితి లేకపోవడంతో.. జగన్‌కి గుడ్ బై చెప్పి బయటకి వచ్చేశారు. పార్థసారథి రెండో సారి ప్రాతినిధ్యం వహిస్తున్న పెనమలూరు సెగ్మెంట్ ఇన్‌చార్జ్‌గా మంత్రి జోగు రమేష్‌ను ప్రకటించింది వైసీపీ.. దాంతో ఓవర్‌నైట్ లోకేశ్‌కి టచ్‌లోకి వెళ్లిపోయారాయన. పార్థసారథికి పెనమలూరు టీడీపీ టికెట్‌పై హామీ కూడా లభించినట్లు ప్రచారం జరిగింది.

దాంతో పెనమలూరు టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే , ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జ్ బోడె ప్రసాద్ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. టీడీపీ నుండి సారథికి సీటు ఫైనల్ అయిందన్న వార్తలు రావడంతో బొడే ప్రసాద్ తన వర్గం నేతలు , అభిమానులతో సమావేశాలు పెట్టారు. పెనమలూరు వచ్చిన చంద్రబాబు సమక్షంలోనే పెనమలూరు సీటు బోడెకు ఇవ్వాలని క్యాడర్ గొడగగొడవ చేశారు.


ఇన్నాళ్లు పార్దసారధి తమపై కేసులు పెట్టించినా కూడా భరించామని.. ఇప్పుడు ఆయనకు సీటు ఇస్తామంటే ఎలా అంటూ బహిరంగ విమర్శలు మొదలుపెట్టారు. బోడె ప్రసాద్ పార్టీ ముఖ్యులతో మంతనాల తర్వాత.. పెనమలూరు టీడీపీ టికెట్ నాదే.. గెలుపు నాదే.. అన్న స్లోగన్ ఎత్తుకున్నారు.

ఆ క్రమంలో పార్థసారథి పెనమలూరుకి దూరమైనట్లే అని టీడీపీ క్యాడర్ భావిస్తోంది. అసలు పార్థసారథి ఇంకా పసుపు కండువా కప్పుకోలేదు. అలాంటిది ఇప్పుడే పెనమలూరులో అంత రచ్చ జరుగుతుంటే.. ఆయన పార్టీలోకి వచ్చి టికెట్ ఓకే అయితే.. పరిస్థితి ఎలా ఉంటుందో, పెనమలూరు తమ్ముళ్ళ రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో అని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. ఆ క్రమంలో పెనమలూరుకి బదులు నూజివీడు వెళ్లమని పార్టీ పెద్దలు పార్థసారథికి ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం మొదలైంది.

దాంతో పెనమలూరు సీన్ నూజివీడుకు మారింది. పార్థసారథికి నూజివీడు ఆఫర్ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో కాని.. ఆయన అప్పుడే అక్కడి టీడీపీ నేతలతో రెగ్యులర్ టచ్‌లోకి వెళ్లిపోయారంట. సీక్రెట్ మీటింగులు పెట్టుకుంటూ.. మద్దతు కూడ గట్టుకునే పనిలో పడ్డారంట. అయితే నూజివీడు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు గత రెండు ఎన్నికల్లో ఓడిపోయినా.. కేడర్‌ని కాపాడుకుంటూ.. పార్టీ బలోపేతానికి క‌ృషి చేస్తున్నారు.

పదేళ్ల నుంచి కష్టపడుతున్న తనకు కాకుండా ఎక్కడి నుండో వచ్చిన పార్థసారధికి సీటేంటని ముద్రబోయిన మండిపడుతున్నారు. పార్టీలో చేరకముందే నూజివీడు నేతలతో మంతనాలు సాగించడం ఏంటని ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు సీటు తనకే అని హామీ ఇచ్చారని.. అపోహలు నమ్మొదంటూ కార్యకర్తలకు దైర్యం చెప్పే పనిలో పడ్డారు. పెనమలూరులో బోడే ప్రసాద్ ఇచ్చినట్లు.. సీటు నాదే గెలుపు నాదే.. స్లోగన్‌ను ముద్రబోయిన కూడా మొదలుపెట్టేశారు.

అలా ముద్రబోయిన కూడా అడ్డం తిరగడంతో.. పోటీ చేసే విషయంలో ప్రశాంతత లేకుండా పోతోందని తెగ ఇదై పోతున్నారంట పార్దసారధి. పసుపు జెండా మెడలో పడకుండానే నియోజకవర్గాలలో నాయకులు వైల్డ్‌గా రియాక్టవ్వడం చూస్తూ.. ఎక్కడ నుంచి పోటీ చేయాలో?.. పోటీ చేస్తే గెలవడానికి ఎన్ని తిప్పలు పడాలో? అని తలపట్టుకోవాల్సి వస్తోదంట. అసలే ఆయనకి టీడీపీ కొత్త.. పైగా ఇప్పుడు కొత్త సెగ్మెంట్‌కి మారాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×