EPAPER

Operation Cambodia Success: విశాఖకు చేరుకున్న కంబోడియా బాధితులు.. అసలు ఏం జరిగిందంటే.?

Operation Cambodia Success: విశాఖకు చేరుకున్న కంబోడియా బాధితులు.. అసలు ఏం జరిగిందంటే.?

Operation Cambodia Success, Victims Reached Vishakhapatnam: ఆపరేషన్ కంబోడియా విజయవంతమయ్యింది. దీంతో కంబోడియాలో చిక్కుకున్న ఏపీలోని విశాఖ బాధితులకు విముక్తి లభించింది. అయితే, వీరు ఏపీ నుంచి వెళ్లి కంబోడియాలో సైబ్ మోసానికి గురయ్యారు. ఈ మోసానికి సంబంధించి విశాఖకు చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి సీపీ రవిశంకర్ అయ్యనార్ కు ఫిర్యాదు చేయడంతో డొంక కదలింది. దీంతో, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుగా నమోదు చేసిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.


ఈ విషయంపై భారత ఎంబసీ అధికారులు.. ఆపరేషన్ కంబోడియాను చేపట్టారు. 420 మంది వరకు భారతీయులు సైబర్ నేరాల బారిన పడ్డారని వారు గుర్తించారు. బాధితులు ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. అందులో 360 మందిని కంబోడియా పోలీసుల చెర నుంచి సురక్షితంగా కాపాడారు. ఈ క్రమంలో వారు కంబోడియా నుంచి సురక్షితంగా భారత్ కు చేరుకున్నారు. తాజాగా శుక్రవారం విశాఖకు చెందిన 60 మంది బాధితులు ఎయిర్ ఇండియా విమానంలో స్వరాష్ట్రానికి చేరుకున్నారు. వీరికి విశాఖ ఎయిర్ పోర్టులో సీపీ రవిశంకర్ అయ్యనార్ స్వాగతం పలికారు.

అయితే, కంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయని, ఆ ఉద్యోగం చేస్తే మంచి వేతనం ఇస్తామంటూ గాజువాకకు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ప్రకటనలిచ్చాడు. ఆ ప్రకటనలను చూసిన రాష్ట్రానికి చెందిన 150 మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు అప్లై చేశారు. అందుకు వారు ఒక్కొక్కరు రూ. లక్షన్నర వరకు చెల్లించారు.


Also Read: నాని దాడి కేసు, ఆ రోజు ఏం జరిగిందంటే, వెనుక నుంచి

అయితే, వారిని బ్యాంకాక్, సింగపూర్ మీదుగా కంబోడియాకు తరలించారు. వారందరినీ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఓ గ్యాంగ్ చైనా ముఠాకు అమ్ముకున్నారు. రూ. 2,500 నుంచి రూ. 4 వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలు వారిని కొనుగోలు చేశాయి. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకున్న విశాఖకు చెందిన బొత్స శంకర్ విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా హ్యూమన్ ట్రాఫికింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖ సీపీ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేసి ఆ కేసును విచారిస్తున్నారు.

Tags

Related News

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

×