Nellore Mp :
⦿ బొకే ఇవ్వలేదని అలిగిన నెల్లూరు ఎంపీ
⦿ వేమిరెడ్డి వెంటే వెళ్లిపోయిన ప్రశాంతి రెడ్డి
⦿ అధికారి తప్పిదం, జడ్పీ మీటింగ్‌లో ఘటన
⦿ అధికారుల తీరును తప్పుబట్టిన మంత్రి ఆనం
నెల్లూరు, స్వేచ్ఛ: బొకే ఇవ్వలేదని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలకబూనారు. నెల్లూరు నగరంలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో ఈ ఘటన జరిగింది. రివ్యూ మీటింగ్‌లో మంత్రులతో పాటు వచ్చిన ఎంపీకి అధికారులు కనీస గౌరవం ఇవ్వకుండా, అవమానించారని.. స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా తనకు బొకే ఇవ్వలేదని వేమిరెడ్డి అలిగి సభ నుంచి వెళ్లిపోయారు.
ఆయన వెంటే సతీమణి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా వెళ్లిపోయారు. ఎంపీని సముదాయించేందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై ఆనం స్పందిస్తూ స్టేజీపై ఉన్న ఎంపీని అధికారులు గౌరవించకపోవడం బాధాకరమన్నారు.
ఎంపీ విషయంలో అధికారుల పనితీరును మంత్రి తప్పుబట్టారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని కలెక్టర్, అధికారులను ఆనం ఆదేశించారు. ఎంపీ కారు దగ్గరికి వెళ్లి సదరు అధికారి క్షమాపణ చెప్పినా అసహనంగానే ఆయన వెళ్లిపోయారు.