EPAPER

Narsipatnam Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. నర్సీపట్నం నాయకుడతనేనా..?

Narsipatnam Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. నర్సీపట్నం నాయకుడతనేనా..?
AP News live

Narsipatnam Assembly Constituency(AP news live):

నర్సీపట్నం.. ఆంగ్లేయులను ఎదురొడ్డి పోరాడి, వీరమరణం పొందిన అల్లూరి ఉద్యమానికి ఊపిరులూదిన ప్రాంతం. భౌగోళికంగా మారుమూలగా ఉన్నా రాష్ట్ర, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందింది. ఏజెన్సీ ముఖద్వారం. ఇక్కడ గెలిచిన నేతలు.. కీలక పదవులను అలంకరించారు. సూర్యనారాయణరాజు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. అయ్యన్న దూకుడుకు గత ఎన్నికల్లో చెక్ పెట్టింది వైసీపీ. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఉమాశంకర గణేశ్‌కు నర్సీపట్నంలో మంచిపేరుంది. ఈ సారి కూడా పోటీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర గణేశ్‌కు, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి మధ్యే జరగనుంది.. మరి ఈసారి గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది? దీనిపైనే బిగ్‌టీవీ ఎన్నికల సర్వే నిర్వహించింది. ఆ రిపోర్ట్ చూసేముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం.


2019 RESULTS

YCP 54%
TDP 40%
OTHERS 6%


2019 ఎన్నికల్లో నర్సీపట్నంలో వైసీపీ వేవ్ కనిపించింది. సీనియర్ నేత అయిన అయ్యన్నపాత్రుడిపై ఏకంగా 13.41 శాతం ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్‌. ఆయన గ్రాండ్ విక్టరీకి ఉమాశంకర్ క్లీన్‌ ఇమేజ్‌తో పాటు.. గత ఎన్నికల్లో కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో ఓడారన్న సింపతి బాగా వర్కౌట్ అయ్యింది. ఇక టీడీపీ నుంచి బరిలోకి దిగిన అయ్యన్నపాత్రుడికి 40 శాతం ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న కొప్పుల వెలమ సామాజిక వర్గానికే రెండు పార్టీలు టికెట్ కేటాయించాయి. అయితే ఈ సారి కూడా మళ్లీ వీరిద్దరే తలపడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో నర్సీపట్నం రాజకీయంలో పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. వీరి గెలుపోటములకు సంబంధించి బిగ్‌ టీవీ నిర్వహించిన సర్వే రిపోర్ట్‌ను చూద్దాం.

ఉమాశంకర గణేష్‌ (YCP)

ఉమాశంకర గణేష్‌ ప్లస్ పాయింట్స్‌

  • నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు
  • నర్సీపట్నం టౌన్‌ను అభివృద్ధి చేయడం
  • క్యాడర్‌తో ఉన్న సత్సంబంధాలు
  • రోడ్లను అభివృద్ధి చేయడం

ఇవి ఎమ్మెల్యేపై పాజిటివ్ ఇమేజ్‌ను జనంలో క్రియేట్ చేశాయి.

ఉమాశంకర గణేష్‌ మైనస్ పాయింట్స్

  • చింతకాయల సన్యాస పాత్రుడు కూడా టికెట్ ఆశించడం
  • నర్సీపట్నం టౌన్‌ తప్ప ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడం
  • నియోజకవర్గాన్ని వెంటాడుతున్న నిరుద్యోగ సమస్య
  • ఇంకా అనేక పనులు నిర్మాణ దశలోనే ఉండటం

ఇలాంటి అంశాలు ఎమ్మెల్యే గ్రాఫ్‌ను కాస్త తగ్గిస్తున్నాయి.

అయ్యన్నపాత్రుడు (TDP)

అయ్యన్నపాత్రుడు ప్లస్ పాయింట్స్

  • నియోజకవర్గానికి అత్యంత సుపరిచిత నేతగా పేరు
  • ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం
  • కేబినెట్ మంత్రిగా పనిచేసిన అనుభవం
  • ప్రజలు, క్యాడర్‌తో నిత్యం టచ్‌లో ఉండటం
  • ప్రభుత్వంపై నిత్యం పోరాడుతుండడం
  • మరింత కలిసి రానున్న జనసేనతో ఉన్న పొత్తు

ఇక వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం బరిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

ఉమాశంకర గణేష్‌ vs అయ్యన్నపాత్రుడు

YCP 45 %
TDP 49 %
OTHERS 6 %

ఇప్పటికిప్పుడు నర్సీపట్నంలో ఎన్నికలు జరిగితే టీడీపీకి 49 శాతం ఓట్లు పడే అవకాశం ఉన్నట్టు బిగ్‌ టీవీ ఎలక్షన్ సర్వే చెబుతోంది. దీనికి ప్రధాన కారణం అభ్యర్థిగా బరిలోకి దిగే అయ్యన్నపాత్రుడికి ఉన్న పాజిటివ్‌ ఇమేజ్ అయితే.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మరో కారణం. అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌ ఈ మధ్య నియోజకవర్గంలో నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు టీడీపీకి ఫేవర్‌గా మారుతున్నాయి. దీనికి తోడు జనసేనతో ఉన్న పొత్తు కూడా టీడీపీకి కలిసి రానుంది. ఈ నియోజకవర్గంలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం అయ్యన్నపాత్రుడికి మరింత కలిసివచ్చే అంశం.

ఇక వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్‌ 45 శాతం ఓట్లు పడే అవకాశముందని బిగ్ టీవీ సర్వే చెబుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఆయనకు ఉన్న పాజిటివ్ ఇమేజ్.. ఇటీవల పంచిన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు.. ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఇతరులు గెలిచేందుకు కేవలం 6 శాతం మాత్రమే అవకాశం ఉందని సర్వే రిపోర్ట్ చెబుతోంది. మొత్తంగా చూస్తే నర్సీపట్నంలో మరోసారి టీడీపీ గెలిచేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ చెబుతున్న సారాంశం.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×