EPAPER

Nara Lokesh: జగన్ అహంకారం .. ప్రజల ఆత్మగౌరవం మధ్య యుద్దం ..

Nara Lokesh: జగన్ అహంకారం .. ప్రజల ఆత్మగౌరవం మధ్య యుద్దం ..
Nara Lokesh speech

Nara Lokesh speech(Andhra Pradesh today news):

ఇది నవశకం యుద్ధం మొదలైంది.. తాడేపల్లి తలుపులు బద్దలుకొట్టే వరకు ఈ యుద్ధం ఆగదని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. యువగళం-నవశకం సభలో ఆయన మాట్లాడారు. ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుంది. రాక్షస పాలనలో పోరాటం చేస్తే అది ఒక విప్లవం అవుతుంది. ఈ సభ విప్లవానికి నాంది అని అన్నారు . ఇక అవినీతి పాలనపై యుద్దం మొదలయ్యింది. “యువగళం.. మనగళం.. ప్రజాగళం. జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు.. లోకేశ్‌ది అంబేడ్కర్‌ రాజ్యాంగం పౌరుషం. అంబేద్కర్ రాజ్యాంగానికి ..రాజారెడ్డి పొగరుకు ..యుద్దం జరగబోతుంది” యుద్దానికి అందరం సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.


ఇది యువగళం ముగింపు సభ కాదు.. ఆరంభం మాత్రమేనని అసలు ఆట ముందుందని నారా లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌ను చూస్తే జగన్‌ భయపడతారన్నారన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. విజనరీ అంటే చంద్రబాబు.. ప్రిజనరీ అంటే జగన్‌. జగన్‌ అరెస్టు అయితే రోజుకో స్కాము బయటపడేదని లోకేశ్ ఆరోపించారు.

ప్రజాస్వామ్యాన్ని జగన్‌ దెబ్బతీశారు. రూ.లక్ష కోట్లు దోచేసిన వ్యక్తి పేదవాడు అవుతారా..? అని లోకేశ్ ప్రశ్నించారు. జగన్‌ అహంకారం.. ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోంది. మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఏంటో జగన్ కి రుచి చూపాలని సభలో లోకేశ్ పిలుపునిచ్చారు . యువగళం పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. అడుగడుగునా జగన్‌ విధ్వంసం కనిపించింది. రాజధానిని చంపి జగన్‌ రాక్షసానందం పొందారని మండిపడ్డారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన గాడిలో పెడదాం మనం అందరం యుద్దానికి సిద్దం అవ్వాలని నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×