EPAPER

Nara Lokesh Red Book Issue: మళ్లీ తెరపైకి లోకేష్ రెడ్ బుక్.. వెలసిన ఫ్లెక్సీలు..!

Nara Lokesh Red Book Issue: మళ్లీ తెరపైకి లోకేష్ రెడ్ బుక్.. వెలసిన ఫ్లెక్సీలు..!

Nara Lokesh Red Book Flexis Goes Viral After AP Election Result 2024: రెడ్ బుక్.. అంటే ఓ ఎర్రటి పుస్తకం.. I’m Just Kidding. ఏపీ పాలిటిక్స్‌ ఫాలో అయ్యే వారికి చాలా సుపరిచితం ఈ బుక్.. నారా లోకేష్‌ పుణ్యమా అని ఈ బుక్ పేరు ఇప్పుడు నేషనల్ వైడ్ వినిపిస్తుంది. ఇంతకీ ఎన్నికల్లో గెలిచారు కదా.. ఇప్పుడు ఈ బుక్‌ను లోకేష్‌ తెరవబోతున్నారా..? అది రెడ్ డైరీ స్టోరీ.. ప్రతిపక్షంలో ఉన్నామని వేధించిన పోలీసులు.. అక్రమ కేసులు పెట్టిన పోలీసులు.. టీడీపీ నేతలను హింసిస్తున్న నేతలు, వారి అనుచరులు.. ఇలా ప్రతి ఒక్కరి పేరును రెడ్ బుక్‌లో ఎంటర్ చేశానన్నారు నారా లోకేష్‌.. అధికారంలోకి రాగానే ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారు. పుంగనూరు ఘటనలో అయితే చిత్తూరు ఎస్పీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు లోకేష్‌.. రెడ్ బుక్ లో మొదటి పేరు చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డిదే అంటూ వార్నింగ్ ఇచ్చారు.


ఇప్పుడు టైమ్ మారింది.. ఎన్నికలు ముగిశాయి.. ఎన్నికల్లో టీడీపీ బంపర్ మెజార్టీతో గెలిచింది. మరి వాట్ నెక్ట్స్‌.. రెడ్ బుక్‌ ఓపెన్ అవుతుందా..? లోకేష్‌ అందులో ఉన్న ఒక్కొక్కరి పేరుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అందులో ఉన్న నేతలు, పోలీస్ అధికారుల పేర్లపై ఎలాంటి యాక్షన్ ఉంటుంది? ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న క్వశ్చన్స్ ఇవి.

విశాఖలో ఓ ఫ్లెక్సీ వెలిసింది. నగరం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై.. రెడ్‌బుక్ పేరుతో నారా లోకేష్‌, ఎన్టీఆర్, చంద్రబాబు, పవన్‌ ఫోటోలతో ఓ ఫ్లెక్సీ వెలిసింది. అందులో సిద్ధం అంటూ లోకేష్‌ ప్రశ్నిస్తున్నట్టు ఉంది.. ఫ్లెక్సీ మొత్తం రెడ్‌ కలర్‌లోనే ఉంది. సో ఇన్‌డైరెక్ట్‌గా ఇది ఇంతకాలం చెలరేగిపోయిన వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది. నాట్‌ ఓన్లీ విశాఖ మంగళగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడీ ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. సో రెడ్‌బుక్ ఇష్యూ మరోసారి హెడ్‌లైన్స్‌కు ఎక్కింది.


Also Read: ‘చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది.. ఇకమీదట అలా ఉండబోదు’

నిజానికి ఎన్నికల ముందు ఈ రెడ్‌ బుక్‌ ఇష్యూ చాలా హైలేట్ అయ్యింది. కొందరు పోలీస్‌ అధికారులు లోకేష్‌ తమను బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఆయనకు నోటీసులు కూడా పంపారు.. ఈ కేసు ఇప్పటికి కూడా విచారణలోనే ఉంది. నిజానికి అప్పట్లో వైసీపీ కూడా బ్లూ బుక్‌ అంటూ ఒకటి తయారు చేస్తున్నామని ప్రకటించింది. అధికారం తమ పార్టీ చేతుల్లో ఉన్నా కూడా.. కొందరు అధికారులు తమకు అస్సలు సహకరించడం లేదని వారి పేర్లను నోట్ చేసుకున్నామని మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఏమైంది.. వైసీపీ చాలా దారుణంగా ఓడింది.. బ్లూ బుక్.. చెత్త బుట్టకు చేరింది.. రెడ్ బుక్ హైలేట్ అయ్యింది. ఇప్పుడు నెక్ట్స్ ఏం జరుగుతుంది..? లోకేష్‌ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు..? ఇదే ప్రశ్న లోకేష్‌ని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా..?

ఎక్కడా కూడా ఆయన రెడ్‌ బుక్‌ ప్రస్తావన తీసుకురాలేదు. తాము కక్ష సాధింపు రాజకీయాలు చేయమని. అవినీతి, అక్రమాలు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటామన్నారు. అయితే లోకేష్ మాటలు టీడీపీ నేతల చర్యలు మాత్రం కంప్లీట్ రివర్స్‌లో ఉన్నాయి.

Tags

Related News

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

Kalasha Naidu: ‘బిగ్ బాస్’ నూతన్ నాయుడు కూతురికి ప్రతిష్టాత్మక అవార్డు, 11 ఏళ్లకే సమాజ సేవ.. సెల్యూట్ కలశా!

AP Ministers: నూతన విచారణ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. హోం మంత్రి వంగలపూడి అనిత

CM Chandrababu: తన రికార్డ్ తనే తిరగరాసిన సీఎం చంద్రబాబు.. 10 సార్లు పైగానే శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

Ys Jagan: బాబుకు భయం లేదు.. భక్తి లేదు.. అన్నీ అబద్దాలే.. సుప్రీం ఆదేశాలపై జగన్ స్పందన

Big Stories

×