EPAPER

Lokesh: ఎన్టీఆర్‌కు లోకేశ్ వెల్‌కమ్.. వ్యూహమా? రాజకీయమా?

Lokesh: ఎన్టీఆర్‌కు లోకేశ్ వెల్‌కమ్.. వ్యూహమా? రాజకీయమా?

Lokesh: జూనియర్ ఎన్టీఆర్. టీడీపీలో మోస్ట్ డిమాండెడ్ నేమ్. జూనియర్‌ను రారమ్మని పిలుస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. రాను రాను నేను రాను.. అంటున్నారు ఎన్టీఆర్. ఆయన రానంటున్నా.. టీడీపీ కేడర్ మాత్రం రావాల్సిందేనంటూ ఫ్లెక్సీలు, నినాదాలతో పట్టుబడుతున్నారు. చంద్రబాబు సభల్లోనూ ఎన్టీఆర్ స్లోగన్స్ హోరెత్తుతున్నాయి. లోకేశ్ ర్యాలీల్లోనూ జూనియర్ ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇలా టీడీపీని బాగా డిస్టర్బ్ చేస్తున్న ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఆయన వస్తానంటే నేనొద్దంటానా అన్నట్టు.. జూనియర్ రాజకీయ ప్రవేశాన్ని తాను నూటికి నూరు శాతం ఆహ్వానిస్తానని చెప్పారు. ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని తపిస్తున్నారో.. వారంతా రాజకీయాల్లోకి రావాలని పిలుపిచ్చారు. ఎన్టీఆర్‌ను ఆహ్వానిస్తానంటూ జూనియర్ గురించి ఒకేఒక మాట మాట్లాడిన లోకేశ్.. పవన్ కల్యాణ్‌ను మాత్రం ఆకాశానికి ఎత్తేశారు. పవన్‌ను ఒకేఒకసారి కలిశానని.. ఆయన మంచి మనసు తనకు అప్పుడే అర్థమైందంటూ తెగ పొగిడేశారు. ఇలా లోకేశ్ చేసిన లేటెస్ట్ కామెంట్స్‌పై ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం టీడీపీలో ఎందుకు యాక్టివ్‌గా లేరు? అంటే ఇందుకు రెండు కారణాలు వినిపిస్తాయి. మొదటిది ఆయన సినిమాల్లో ఫుల్ బిజీగా ఉండటం వల్ల. ఇంకోటి లోకేశ్‌కు పోటీగా రాకుండా జూనియర్‌ను సైడ్ చేశారనే మాట. ఈ రెండూ వాస్తవానికి దగ్గరగా ఉన్న వాదనలే.


2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున విస్త‌ృతంగా ప్రచారం చేశారు ఎన్టీఆర్. చైతన్యరథం ఎక్కి.. తాతలా ఖాకీ డ్రెస్ వేసుకొని.. ఊరూరా తిరిగారు. అద్భుతమైన ప్రసంగాలతో ప్రజలను ఉర్రూతలు ఊగించారు. ఆ సమయంలో కారు యాక్సిడెంట్ జరిగి గాయపడినా.. బెడ్ మీద నుంచే ఎన్నికల ప్రసంగం ఇచ్చి తన కమిట్‌మెంట్ చాటుకున్నారు. బుడ్డోడి దూకుడు చూసి.. టీడీపీ ఆశాకిరణం ఎన్టీఆరే అని అంతా ఫిక్స్ అయ్యారు.

కట్ చేస్తే, 2009 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఎన్టీఆర్ అంతగా ప్రచారం చేసినా పెద్దగా ఓట్లు పడలేదు. అప్పుడు గానీ జూనియర్‌కి రాజకీయ తత్వం బోధపడలేదు. తన పొలిటికల్ ఎంట్రీకి సరైన సమయం రాలేదని అర్థమైంది. మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. ఈలోగా లోకేశ్ రాజకీయ అరంగేట్రం చేశారు. చంద్రబాబు తర్వాత లోకేశే పార్టీలో సుప్రీంగా మారాలంటే.. ఎన్టీఆర్ ఆయనకు అడ్డులేకుండా ఉండాలి. అందుకే, జూనియర్‌ని పార్టీ పెద్దలే సైడ్ చేశాయనే టాక్ కూడా ఉంది. కొడాలి నాని, వల్లభనేని వంశీలు పదే పదే ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబును, లోకేశ్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈమధ్య నందమూరి ప్రస్తావన కావాలనే మళ్లీ మళ్లీ తీసుకొస్తున్నారు. అటు వైసీపీ యమ దూకుడుగా ఉండటంతో.. ఎన్టీఆర్ అయితేనే పార్టీకి కరెక్ట్ పర్సన్ అంటూ తెలుగు తమ్ముళ్లలో చర్చ జరుగుతోంది. కొంతకాలంగా టీడీపీ ర్యాలీల్లో తారక్ పేరు, ఫ్లెక్సీలు తరుచూ వినిపిస్తున్నాయి.. కనిపిస్తున్నాయి.

అందుకే, ఎన్టీఆర్‌కు టీడీపీనే ద్రోహం చేస్తోందనే ప్రచారం పార్టీకి మంచిది కాదని లోకేశ్ భావించినట్టున్నారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశాన్ని తాను వందకు వంద శాతం ఆహ్వానిస్తానని ప్రకటించారు. జూనియర్‌ ఎంట్రీని తమ్ముళ్లు బలంగా కోరుకుంటున్నారు. ఈ విషయం లోకేశ్‌కు బాగా తెలుసు. ఇప్పటికిప్పుడే తారక్ రాజకీయాల్లోకి రాలేరనే విషయమూ తెలుసు. పాన్ ఇండియా హీరోగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు ఎన్టీఆర్. ఇంకో 10-20 ఏళ్ల వరకూ తారక్‌కు ఇండస్ట్రీలో ఢోకా లేదు. ఆ తర్వాత కావాలంటే అప్పటి పరిస్థితులను బట్టి రాజకీయాల్లోకి వస్తే రావొచ్చు. ఇప్పుడు తారక్ ఎంట్రీని ఆహ్వానించినంత మాత్రాన.. లోకేశ్‌కు వచ్చే నష్టమూ, కష్టమూ ఏమీ లేదు. ఆయన రారనే ధీమాతోనే లోకేశ్ హండ్రెడ్ పర్సెంట్ వెల్‌కమ్ చెప్పారని అంటున్నారు. ఈ స్టేట్‌మెంట్‌తోనైనా ఎన్టీఆర్ విషయంలో తనపై ఉన్న విమర్శలకు చెక్ పెట్టొచ్చనేది లోకేశ్ భావనగా తెలుస్తోంది. నాని, వంశీలకూ కౌంటర్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇలా ఎన్టీఆర్, పవన్‌ల ప్రస్తావనతో లోకేశ్ పొలిటికల్ మైండ్‌గేమ్ ఆడారని అంటున్నారు.

Related News

YCP vs Janasena: జనసేనలోకి చేరికలు.. కూటమిలో లుకలుకలు

ysrcp petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, కాకపోతే కోర్టు..

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Big Stories

×