EPAPER

Nara Chandra Babu Naidu : ఏపీ పాలిటిక్స్‌లో యాగాలపై చర్చ.. జగన్‌ను చంద్రబాబు ఫాలో అవుతున్నారా..?

Nara Chandra Babu Naidu : ఏపీ పాలిటిక్స్‌లో యాగాలపై చర్చ.. జగన్‌ను చంద్రబాబు ఫాలో అవుతున్నారా..?

Nara Chandra Babu Naidu : ఎన్నికల సమయం దగ్గరపడుతోంది… పార్టీలు, నేతల్లో గెలుపు గుబులు అలుముకుంది. నవ్యాంధ్రలో తొలి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు అనూహ్యరీతిలో రెండోసారి ఘోరమైన ఓటమిని చవిచూశారు. ఇప్పుడు రాబోయే ఎన్నికలు అత్యంత కీలకమైనవి. జైలు గోడలు దాటి ఎట్టకేలకు ప్రజల్లోకి వచ్చిన 73 ఏళ్ల మాజీ సీఎం చంద్రబాబుకు, అంతకుమించి తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. అందుకే, గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అంతేనా… అన్నింటితో పాటు అదృష్టం కూడా కలిసిరావాలి… దానికి దైవ అనుగ్రహం కావాలి… ఇప్పుడు చంద్రబాబు ఇంట్లో జరగబోతున్న ప్రత్యేక హోమాలు అందుకోసమేనా…? గెలుపు కోసం సీబీఎన్ పూజలు.. హోమాలు చేయిస్తున్నారా..?


రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో పొత్తు సూపర్ సక్సెస్ అనే సంకేతాలను పార్టీ శ్రేణులకు పంపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కలిసి రాకపోయినా కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలు ఎదుర్కోడానికి చంద్రబాబు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. తన అరెస్టు తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు కలిసి వస్తాయని చంద్రబాబు ధీమాగా ఉన్నారు.

త్వరలో అమరావతిలో భారీ సభ పెట్టి టిడిపి, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. తన 4 శతాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారిగా జైలుకు వెళ్లి వచ్చిన చంద్రబాబు బెయిల్ బయటకు వచ్చాక వరుసగా దైవదర్శనాలతో బిజీగా గడిపిన విషయం అందరూ చూశారు. ఇందులో భాగంగా… తిరుమల శ్రీవారిని, బెజవాడ దుర్గమ్మను, సింహాచల అప్పన్నను, గుణదల మేరీమాత ఆలయాలను ఇప్పటికే దర్శించుకున్నారు చంద్రబాబు. అలాగే తమిళనాడులోని దేవాలయాలకూ వెళ్లొచ్చారు. ఇప్పుడు ఇదే క్రమంలో తన ఇంట్లోనే ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అయితే, ఈ ప్రత్యేక హోమాలు అచ్చంగా గెలుపు కోసమేనా…? అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలయ్యింది.


గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంలో డిసెంబర్ 22 నుంచి మూడు రోజుల పాటు యాగాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక యాగాలు, హోమాలు, పూజలు నిర్వహిస్తారని సమాచారం. ఇందులో శతచండీ, పారాయణ, మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమాలు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ ప్రత్యేక హోమాల్లో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ పాల్గొంటున్నారు. దీని కోసం భారీ ఏర్పాట్లు చేశారు. యాగాలు, పూజల నేపథ్యంలో చంద్రబాబు ఈ మూడు రోజుల పాటు తన అపాయింట్ మెంట్లు అన్నింటినీ రద్దు చేసుకున్నారని తెలుస్తుంది. ఈ మూడు రోజులు పార్టీ కార్యక్రమాలను పార్టీలో కీలక నేతలకు అప్పగించారు.

ప్రస్తుతం, ఆయా నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపు ప్రధాన సమస్యగా ఉన్న తరుణంలో పార్టీ ప్రధాన నేతలంతా వాటిపైన పనిచేస్తారని తెలుస్తుంది. అలాగే, పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాల్సిన సీట్ల వ్యవహారం కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. అలాగే, ప్రచార వ్యూహాల పైనా ఇప్పటికే కార్యవర్గం పనిచేస్తోంది. అయితే, ఎన్నికలకు మరో వందరోజులే ఉండటంతో ఈ ప్రత్యేక హోమాల తర్వాత ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకొవచ్చని తెలుస్తుంది.

టీడీపీ, జనసేన నేతలు కలిసి పనిచేసి జగన్‌ను ఇంటికి సాగనంపడానికి అవసరమైన అన్నిదారులనూ ప్రతిపక్షం వెదుకుతోంది. దీని కోసం, టీడీపీ, జనసేన కార్యకర్తలు గ్రామస్థాయిలో కలిసి పోరాడాలని ఇద్దరు అధినేతలూ ఇప్పటికే సూచించారు. చంద్రబాబుతో మాట్లాడిన టీడీపీ నేతలు గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు కొట్టుకుపోయిన అంశాన్ని కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కీలక పాయింట్‌గా మార్చాలని అనుకుంటున్నారు.

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే ఇక్కడ కూడా ఈ ఆరోపణ పనిచేస్తుందని వ్యూహాలు అల్లుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయిందని చంద్రబాబు ఇప్పటికే ఆరోపించారు. ఇక, స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత ఆయన మొదటి దైవ దర్శనం చేసుకొని, ఆనక రాజకీయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇదే క్రమంలో ఇప్పుడు ప్రత్యేక హోమాల తర్వాత అసలు రాజకీయాలని మొదలుపెడతారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

కాగా, గత ఎన్నికల్లో కేసీఆర్, జగన్ పూజల వలనే అధికారంలో వచ్చారనే ప్రచారం జరుగుతోంది.. ఇప్పుడు చంద్రబాబు కూడా రాజకీయంగా అనుకూల పరిస్థితుల కోసమే యాగాలు, హోమాలు చేస్తున్నారన్న ప్రచారం ఓ వైపు ఊపందుకుంది. మరోవైపు చంద్రబాబు జైలు నుంచి విడుదలవ్వాలంటూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి మొక్కుల చెల్లింపుల్లో భాగంగానే ఈ హోమాలు చేస్తున్నాంరటూ చర్చ సాగుతోంది.

2014లో దిగ్విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీ, 2019లో భారీ ఓటమిని చవిచూసింది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం నవశకం ముగింపు సభ తెలుగు తమ్ముళ్లకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఇక, జనసేన తోడుతో 2024 ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. గెలుపు కోసం ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు మాత్రమే సీట్లు కేటాయించాలని నిర్ణయించింది.

మరోవైపు, పార్టీ కోసం కష్టపడిన నేతలకు కచ్చితంగా గుర్తింపు ఉంటుందని హామీ ఇస్తుంది. 2024 ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుందామని అధికార పార్టీకి సవాళ్లు విసురుతోంది. ఇక, అంతర్గత సర్వేల్లో నాయకుల పనితీరు బాగాలేకపోతే పక్కన పెడతామని పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. అభ్యర్థుల కోసం పార్టీ ప్రయోజనాలు పణంగా పెట్టలేమని చంద్రబాబు తేల్చిచెప్పినట్లు సమాచారం. రాష్ట్ర ప్రజలకు టీడీపీ అవసరం ఎంతో ఉందని చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు చెబుతున్నారు.

సర్వేలకు అనుగుణంగా టికెట్లు కేటాయిస్తామని ఇప్పటికే పార్టీలో నేతలందరికీ ముందస్తు సూచనలు చేశారు. ఇక, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తుంది. అలాగే, ఓట్ల అవకతవకలను పార్టీ ఇన్‌ఛార్జ్‌లు బాధ్యతగా తీసుకోవాలని అందరికీ ఆదేశాలు జారీ చేశారు. అని విషయాలు అధిష్టానం చూసుకుంటుందనే అలసత్వం చేయవద్దని నేతలను చంద్రబాబు కోరారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మార్పు కోసం తహతహలాడుతున్నారని చంద్రబాబు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ఈ క్రమంలో ఆయన కీలక ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు దగ్గరకు రావడంతో ప్రభుత్వ వైఫల్యాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, వాటిపై పోరాడేందుకు… అదే సమయంలో వివిధ అంశాలపై టీడీపీ వైఖరిని ప్రజలకు వివరించేందుకు.. వ్యూహ రచన చేయాలని పార్టీ ముఖ్య నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అత్యంత కీలకమైన 18 అంశాల్ని ఎంపిక చేసి వాటి పర్యవేక్షణ బాధ్యతను సీనియర్‌ నేతలకు అప్పగించినట్లు తెలుస్తుంది.

వచ్చే ఎన్నికల్లో అంశాలవారీగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఇప్పటికే ప్రకటించిన మినీ మేనిఫెస్టోని మరింత ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆలోచించాలని… ఈ మూడు రోజుల తర్వాత డెవలప్‌మెంట్స్‌ని పరిశీలిస్తానని చెప్పినట్లు తెలుస్తుంది. ఇక, ఈ మూడు రోజుల నిర్వహిస్తున్న ప్రత్యేక హోమాలు చంద్రబాబు రాజకీయ జీవితానికి, తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి తప్పనిసరిగా సహాయం చేస్తాయని పార్టీ శ్రేణులు నమ్మకంగా ఉన్నాయి.

.

.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×