EPAPER
Kirrak Couples Episode 1

Nara Bhuvaneshwari: ప్లీజ్ ఈ ఒక్క మాట వినండి.. ప్రజలను కోరిన సీఎం సతీమణి

Nara Bhuvaneshwari: ప్లీజ్ ఈ ఒక్క మాట వినండి.. ప్రజలను కోరిన సీఎం సతీమణి

Nara Bhuvaneshwari: ప్లీజ్ ఈ ఒక్క మాట వినండి.. ఆ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అసలే పండుగలు రానున్నాయి.. అందరూ తప్పనిసరిగా ఆ వస్త్రాలనే ధరిద్దాం. నా మాట వినండి.. మనతో పాటు వారు సైతం పండుగలు ఆనందంగా జరుపుకునేలా సహకరిద్దాం. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సామాజికపరమైన అంశాలపై నిత్యం ప్రజలను చైతన్య పరుస్తుంటారు. అందులో భాగంగా ఆమెకు చేనేత వస్త్రాలంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టానికి ప్రధాన కారణమే చేనేత రంగాన్ని ఆదుకోవాలన్న ఆమె లక్ష్యమే. అందుకే ఇటీవల జాతీయ చేనేత దినోత్సవం రోజు తనకు చేనేత చీరలు తీసుకురావాలని తన భర్త సీఎం చంద్రబాబును సైతం భువనేశ్వరి కోరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేనేత ఎగ్జిబిషన్లో స్వయంగా చేనేత చీరలను కొనుగోలు చేసి.. తన సతీమణికి చేనేత రంగంపై గల ఇష్టాన్ని వివరించారు. ఇలా చేనేత రంగాన్ని ఆదుకొనేందుకు భువనేశ్వరి పరోక్షంగా సహరిస్తున్నారని చెప్పవచ్చు.

చేనేత రంగం రానురాను ప్రజల ఆదరణ కోల్పోయి కుదేలవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎన్నో కుటుంబాలు చేనేత రంగాన్ని నమ్ముకొని నేటికీ.. కష్టాలు ఎదుర్కొంటున్నా అలాగే అదే రంగంలో రాణిస్తున్నాయి. ఆధునిక కాలంలో కావడంతో రెడీమేడ్ దుస్తులకే ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. అయినా ఇంకా అక్కడక్కడా చేనేత కార్మికులు సరైన ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో ఎన్నో కుటుంబాలు నేటికీ ఈ రంగాన్నే నమ్ముకొని ఉన్నాయి. ఈ స్థితిలో చేనేత రంగాన్ని ఆదుకోవాలంటే చేయాల్సిందల్లా.. చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ధరించడమే. అప్పుడే డిమాండ్ పెరిగి వారికి ఉపాధి లభిస్తుందన్నది ఒక చిన్న ఆశ. అయితే ప్రజలు తలచుకుంటే చాలు.. చేనేత రంగానికి పూర్వ వైభవం రానీయవచ్చన్నది పలువురి అభిప్రాయం. ఈ కోవకు చెందిన వారే ఏపీ సీఎం సతీమణి నారా భువనేశ్వరి.

Also Read: President Murmu: మహిళలపై ఉన్న మైండ్ సెట్ మారాలి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు

అక్టోబర్ దసరా, దీపావళి పండుగలు రానున్నాయి. అయితే ఈ పండుగల సమయంలో ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఇలా కొనుగోలు చేసే క్రమంలో చేనేత వస్త్రాలు కొందాం. పండగల్లో వాటిని ధరించుదాం. నూలుపోగుతో అద్భుతాలు సృష్టించే చేనేతలు కూడా.. మరింత ఆనందంగా పండుగ చేసుకొనేలా చేద్దాం అంటూ నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఇలా చేనేత రంగాన్ని ఆదుకొనేందుకు స్వయానా సీఎం సతీమణి ముందడుగు వేయగా, చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు శభాష్ మేడమ్.. మంచి ఆలోచన చేశారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతైనా విజన్ లీడర్ చంద్రబాబు సతీమణి కదా.. అందుకే ఇలా ప్రకటించారు అంటూ మరికొందరు స్పందిస్తూ సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. మరి మనమందరం చేనేత వస్త్రాలు కొనుగోలు చేద్దాం.. ధరిద్దాం.. ఆ కుటుంబాలకు అండగా నిలుద్దాం.

Related News

Perni Nani: మీ హాస్పిటల్ లో భజన చేసుకోండి.. ఒక్క హిందువుకైనా ఫ్రీగా వైద్యం అందించారా.. బీజేపీ మహిళా నేతకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్

Jagan Tirumala Tour : జగన్ తిరుమల టూర్ రద్దుకు కారణాలు ఇవేనా… కూటమికి ఛాన్స్ ఇచ్చినట్టేనా ?

Union Minister Comments On Tirumala Laddu: తిరుమల లడ్డు వివాదం.. బాంబ్ పేల్చిన కేంద్ర మంత్రి

BJP Vs YCP: బీజేపీతో తాడో పేడో.. జగన్ సాహసం చేస్తున్నారా?

YS Jagan: వైఎస్ జగన్‌‌కు కామ్రెడ్లే దిక్కవుతారా?

Home Minister Anitha : జగన్ ను ఆడేసుకున్న హోంమంత్రి అనిత… నాలాగా నువ్వు చెప్పగలవా ?

Big Stories

×