EPAPER

BJP: కాషాయ కిరణం ప్రకాశించేనా?.. నల్లారి నెగ్గుకొచ్చేనా?

BJP: కాషాయ కిరణం ప్రకాశించేనా?.. నల్లారి నెగ్గుకొచ్చేనా?
Nallari-Kiran-Kumar-Reddy-BJP

BJP: కమలం గూటికి చేరిన కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై విమర్శల వర్షం మొదలైంది. మళ్లీ పొలిటికల్ గ్రౌండ్‌ లోకి దిగి సిక్సులు బాదాలని చూస్తున్న ఈ మాజీ క్రికెటర్‌.. అప్పుడే గూగ్లీలు, యార్కర్‌ లు ఎదుర్కోవాల్సి వస్తోంది.


నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీఎంగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈయన హయాంలోనే మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. జగన్ కటకటాలు లెక్కించినప్పుడు కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో తనదైన శైలిలో ప్రెస్ మీట్లు పెడుతూ వచ్చారు నల్లారి. బెర్లిన్ గోడ రాయికి సంబంధించిన ఓ ముక్కను ప్రదర్శించి రాష్ట్రం విడిపోయినా.. చివరకు మళ్లీ కలపాలనే డిమాండ్లు వస్తాయని చెప్పుకొచ్చారు.

అలాంటి కిరణ్‌ కుమార్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరారు. నల్లారిని బీజేపీలో ఎలా చేర్చుకుంటారంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆనాడు పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటుపై మోదీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని.. ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని పార్టీలో చేర్చుకొని ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని ప్రశ్నిస్తున్నారు.


కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేశారు. మంత్రి పదవి కూడా చేపట్టని కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీఎం చేసిందని గుర్తుచేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన కిర‌ణ్ కుమార్ రెడ్డి పార్టీ వ‌దిలి పారిపోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు రెండున్నర ఏళ్లలో నువ్వు..నీ తమ్ముడు ఎంత సంపాదించారో మాకు తెలియదా అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు వీహెచ్. ముఖ్య‌మంత్రిని చేసిన పార్టీకి వెన్నుపోటు పొడిచినవాడు.. బీజేపీకి వెన్నుపోటు పొడవడు అని గ్యారంటీ ఏముందని కూడా ప్రశ్నించారు.

కిరణ్ కుమార్ రెడ్డి పెద్దగా జనాకర్షణ ఉన్న నేత కాదనే ముద్ర ఉంది. జనంలో కూడా ఎక్కువగా కనిపించరు. అయితే తెరవెనుక వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరుంది. అయితే ఏపీలో బీజేపీకి పెద్దగా పట్టులేదు. అలాంటి చోట కిరణ్ ప్రభావం ఏమేరకు ఉంటుందనేది ఊహించడం కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే బీజేపీలో చేరారు. మరి కొత్తగా కిరణ్ ఎలాంటి చాణక్యం ప్రదర్శిస్తారనేది తేలాల్సి ఉంది.

కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఇమడగలరా అనే వాదనలు ఉన్నాయి. మాజీ సీఎంగా పనిచేసిన వ్యక్తి మరొకరి కింద పనిచేయగలరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పనిచేసినా ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. బయట నుంచి వచ్చిన వారికి కీలకమైన పదవులు ఇచ్చే అవకాశం కమలదళంలో తక్కువే. సమయానికి తగ్గట్టుగా పనితీరు ఆధారంగా పదవులు దక్కుతాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న అనుభవం, పరిచయాల దృష్ట్యా ఏదైనా రాష్ట్రానికి పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది.

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×