EPAPER

Nagari Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. నగరి ఓటర్లు ఎటువైపు..? రోజా హ్యాట్రిక్ కొట్టడం కష్టమేనా..?

Nagari Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. నగరి ఓటర్లు ఎటువైపు..? రోజా హ్యాట్రిక్ కొట్టడం కష్టమేనా..?
Nagari Assembly Constituency

Nagari Assembly Constituency : ఏపీ వ్యాప్తంగా అంతా ఆసక్తికరంగా చూసే సెగ్మెంట్ నగరి. ఈ నియోజకవర్గం తమిళనాడుకు దగ్గర్లో ఉంటుంది. టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా(RK Roja) ఈ సెగ్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నగరిలో కరియ మాణిక్యస్వామి దేవాలయం ఉంది. మహాభాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టం ఇక్కడ జరిగిందని శ్రీ మహా విష్ణువు ఇక్కడే గజరాజుని మొసలి బారి నుంచి రక్షించాడనీ చెబుతారు. చారిత్రకంగా, భౌగోళికంగా, రాజకీయంగా నగరికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇక్కడ పాలిటిక్స్ హాట్ హాట్ గానే ఉంటాయి. ఇప్పుడు నగరి మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమైంది. ఇక్కడ గతంలో కాంగ్రెస్, టీడీపీ హవా చాటాయి. గతంలో కాంగ్రెస్ నుంచి చెంగారెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే, టీడీపీ నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఏకంగా ఆరుసార్లు గెలిచారు. నమ్మితే నెత్తిన పెట్టుకునే జనం నగరిలో ఉన్నారు. ఇందుకు గత ఫలితాలే నిదర్శనం. వైసీపీ వేవ్ తో గత రెండు ఎన్నికల్లో రోజా గెలిచారు. ఇప్పుడు కూడా టీడీపీ, వైసీపీ మధ్యే ద్విముఖపోరుకు రంగం సిద్ధమైంది. మరి ఆ ఫలితాలు ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 ఎన్నికలు..
ఆర్కే రోజా (గెలుపు) VS గాలి భాను ప్రకాశ్
YCP 48%
TDP 46%
OTHERS 6%

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రోజా 48 శాతం ఓట్లు సాధించారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి 46 శాతం ఓట్లు వచ్చాయి. కేవలం 1.6 శాతం ఓట్లతోనే టీడీపీ ఇక్కడ ఓడిపోయింది. ఇక్కడ కీలకమైన మొదిలియార్ కమ్యూనిటీ వైసీపీకి అండగా నిలబడడంతో గెలుపు సాధ్యమైంది. టీడీపీ నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు కొడుకు గాలి భాను ప్రకాశ్ పోటీకి దిగినా విజయాన్ని అందుకోలేకపోయారు. మరి రాబోయే ఎన్నికల్లో నగరి సెగ్మెంట్ రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.


ఆర్కే రోజా ( YCP ) ప్లస్ పాయింట్స్

  • నగరి నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడం
  • జనంలో వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోవడం
  • సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడడం

ఆర్కే రోజా మైనస్ పాయింట్స్

  • ఏర్పాటు చేస్తానన్న టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటవకపోవడం
  • పవర్ లూమ్స్ కు సబ్సిడీ విద్యుత్ అందించకపోవడం
  • ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీళ్లు రాకపోవడం
  • మూవీ, టీవీ షోలతో ఎక్కువ ఎంగేజ్ అవడం

రెడ్డివారి చక్రపాణి రెడ్డి ( YCP ) ప్లస్ పాయింట్స్

  • రాజకీయ వారసత్వం
  • పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సపోర్ట్

గాలి భాను ప్రకాశ్ ( TDP ) ప్లస్ పాయింట్స్

  • గాలి ముద్దుకృష్ణమనాయుడి వారసత్వం
  • వరుసగా ఓడిపోయిన సానుభూతి
  • పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పార్టిసిపేషన్

గాలి భాను ప్రకాశ్ మైనస్ పాయింట్స్

  • నగరి టీడీపీలో టిక్కెట్ల కోసం పోటీ ఎక్కువుండడం

కులాల లెక్కలు..
మొదిలియార్స్ 15%
ఎస్సీ 27%
రెడ్డి 12%
కమ్మ 12%
బలిజ 10%

నగరి నియోజకవర్గంలో మొదిలియార్స్ వర్గం ప్రభావవంతంగా ఉంది. వారిలో 45 శాతం వైసీపీకి, 50 శాతం టీడీపీకి 5 శాతం ఇతరులకు మద్దతుగా ఉంటామని బిగ్ టీవీ సర్వేలో వెల్లడించారు. ఎస్సీల్లో 45 శాతం మంది వైసీపీకి, 50 శాతం మంది టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామని సర్వేలో తమ అభిప్రాయంగా వెల్లడించారు. రెడ్డి కమ్యూనిటీలో 65 శాతం మంది వైసీపీకి, 30 శాతం మంది టీడీపీకి, 5 శాతం మంది ఇతరులకు మద్దతుగా ఉంటామన్నారు. ఇక కమ్మ కమ్యూనిటీలో 30 శాతం మంది వైసీపీకి, 65 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. బలిజ వర్గానికి చెందిన వారిలో 60 శాతం మంది జగన్ పార్టీకి, 40 శాతం మంది టీడీపీకి మద్దతు ఇస్తామని సర్వేలో తమ అభిప్రాయంగా చెప్పారు.

ఇక వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

రోజా VS గాలి భాను ప్రకాశ్
YCP 41%
TDP 49%
OTHERS 10%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నగరిలో టీడీపీకే ఎడ్జ్ కనిపిస్తోంది. గాలి భాను ప్రకాశ్ కే మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉందని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో జనం అభిప్రాయంగా చెప్పారు. రోజాకు 41 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. అలాగే టీడీపీకి 49 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇతరులకు 10 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు తేలింది.

రెడ్డివారి చక్రపాణి రెడ్డి VS గాలి భాను ప్రకాశ్
YCP 39%
TDP 49%
OTHERS 12%

ఇప్పటికిప్పుడు నగరిలో ఎన్నికలు జరిగితే రోజాకు బదులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి రంగంలోకి దిగితే వైసీపీకి 39 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. టీడీపీకి 49 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇతరులకు 12 శాతం ఓట్లు వస్తాయన్న అంచనాలున్నాయి.

.

.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×