EPAPER

Andhra Pradesh: మున్సిపల్ కార్మికులతో చర్చలు మళ్లీ విఫలం.. సమ్మె యథాతదం..

Andhra Pradesh : మున్సిపల్‌ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలం అయ్యాయి.తమ ఉద్యోగాలను రెగ్యులర్‌ చేసి సమాన పనికి సమాన జీతం చెల్లించాలని కార్మికులు కోరారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిమాండ్ లు నేరవేర్చడం సాధ్యం కాదని మంత్రులు మున్సిపల్ సంఘాలతో తేల్చి చెప్పారు.

Andhra Pradesh:  మున్సిపల్ కార్మికులతో చర్చలు మళ్లీ  విఫలం.. సమ్మె యథాతదం..

Andhra Pradesh : మున్సిపల్‌ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలం అయ్యాయి. తమ ఉద్యోగాలను రెగ్యులర్‌ చేసి, సమాన పనికి సమాన జీతం చెల్లించాలని కార్మికులు కోరారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిమాండ్లు నేరవేర్చడం సాధ్యం కాదని మంత్రులు మున్సిపల్ సంఘాలతో తేల్చి చెప్పారు.


చర్చల అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. నాన్‌ పీహెచ్‌సీ కేటగిరీ ఉద్యోగులకు రూ.6వేల రూపాయలు ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌ ఇస్తామని వివరించాం . అయితే స్కిల్డ్‌, అన్‌ స్కిల్డ్‌ సిబ్బంది విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. రోస్టర్‌, పీఎఫ్‌ ఖాతాలు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను పరిష్కరిస్తామని చెప్పాం. ఇతర అంశాలపై మరొకసారి చర్చలు జరుపుతాం. అప్పటివరకు మున్సిపల్ కార్మికులతో సమ్మె విరమిస్తారని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రభావం కేవలం 50 మున్సిపాలిటీల్లో మాత్రమే ఉంది. ఇబ్బందులు ఉన్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని మంత్రి ప్రకటించారు.

ప్రభుత్వంతో జరిగిన చర్చలు పూర్తిగా విఫలం అయ్యాయి. కార్మకులకు బేసిక్‌ వేతనం ఇవ్వకపోతే సమ్మెపై పునరాలోచన లేదని కార్మిక సంఘాలు ప్రకటించాయి. కార్మికుల సమ్మె యథాతథంగా కొనసాగిస్తాం. చర్చలలో ముఖ్యమైన డిమాండ్‌పై ప్రభుత్వం చర్చించలేదు. సమాన పనికి సమాన వేతనం అని వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇదే అంశం మంత్రులకు వివరించాం అయినా పట్టించుకొలేదు.


ఉద్యమాన్ని అణచి వేయ్యాలనే ధోరణితో ప్రభుత్వం ఉంటే సహించమని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు, చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంచారు. కార్మికులకు మాత్రం జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవా? త్వరలో మున్సిపాలిటీల్లో నీరు, పారిశుద్ధ్య నిర్వహణ సేవలు నిలిపివేస్తాం.కార్మికులు నిరసన తెలియజేస్తుంటే అరెస్ట్ చెయ్యడం దారుణమన్నారు. 11 వ పీఆర్సీలో కనీస వేతనాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చెయ్యడం నిలిపివేసింది. పారిశుద్ధ్య పరిస్థితుల పట్ల స్వయంగా మేమే అందోళన చెందుతున్నాం అని మున్సిపల్‌ కార్మికుల సంఘం నేత ఉమామహేశ్వరావు ప్రకటించారు.

Tags

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×