EPAPER

Mumbai actress reveals: ఏపీ.. ముంబై నటి ఇష్యూ, మూడు రోజులు గెస్ట్ హౌస్‌లో.. ఆపై చిత్రహింసలు!

Mumbai actress reveals: ఏపీ.. ముంబై నటి ఇష్యూ, మూడు రోజులు గెస్ట్ హౌస్‌లో.. ఆపై చిత్రహింసలు!

Mumbai actress reveals: ఏపీలో వైసీపీ నేతల కొంప కొల్లేరు అయినట్టే కనిపిస్తోంది. ముంబై నటి వ్యవహారం ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసినట్టు కనిపిస్తోంది. ఏపీలో హాట్‌ హాట్‌గా నడుస్తున్న వ్యవహారంపై తెరపైకి వచ్చింది ఆ నటి. పూసగుచ్చి మరీ కీలక విషయాలు వెల్లడించింది. ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ కీలక పెద్దలు ఉన్నారన్నది ఆమె మాట. అంతేకాదు కంటతడి పెట్టి పోలీసు అధికారులు ఏం చేశారన్న దానిపై క్లియర్‌గా వివరించింది. దీంతో తీగలాగితే వైసీపీ నేతల డొంక కదులుతోంది.


మొన్న శాంతి.. నిన్న వాణి.. నేడు ముంబై నటి.. ఇదీ గత వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు. ఇప్పుడు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ముంబై నటి వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. రెండు మూడురోజులుగా దీనిపై ఏపీ అంతటా చర్చ మొదలైంది. ఈ క్రమంలో నేరుగా టీవీ డిబేట్‌లో దర్శనమిచ్చింది ఆ నటి. వైసీపీ పాలనలో ఏం జరిగిందో అంతా పూసగుచ్చి మరీ వివరించింది. టీవీ డిబేట్‌లో కంటతడి పెడుతూ తనకు న్యాయం చేయాలని కోరింది.

గుజరాత్‌కు చెందిన కాదంబరీ జత్వానీ.. నటిగానే కాకుండా మోడల్ కో-ఆర్డినేటర్‌గా పని చేసింది. వైద్య విద్య అభ్యసించిన ఆమె, ఇష్టంతో గ్లామర్ ఇండస్ట్రీ వైపు వచ్చింది. తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసుర్ కాగా, తల్లి ప్రభుత్వ ఉద్యోగి. ఉన్నతమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆ నటి.. పదేళ్ల కిందట టాలీవుడ్‌లో పని చేసింది. కొద్దిరోజులపాటు అతడితో మాట్లాడడం మానేశానని అప్పటి నుంచి తనను వేధించడం మొదలుపెట్టారని తెలిపింది. అతడి న్యూడ్ సెల్పీలు పంపించి తనను వేధించేవాడని, అసభ్యకర సందేశాలతో తనను హింసించేవాడని మనసులోని మాట బయటపెట్టింది.


ఆ సమయంలో కృష్ణాజిల్లాకు చెందిన మాజీ జెడ్పీటీసీ ఛైర్మన్ కొడుకుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై గతరాత్రి తెలుగులోని ఓ ఛానల్‌ డిబేట్ జరిగింది. ఏపీ పోలీసులు తనను ముంబై నుంచి కృష్ణాజిల్లాకు తీసుకురావడంలో అక్కడ కేసు క్లోజ్ చేశారని ఆందోళన వ్యక్తం చేసింది.

ALSO READ: బాలీవుడ్ నటి వ్యవహారం.. ఆ పెద్దాయన చుట్టూ ఉచ్చు, రేపో మాపో..

వైసీపీ నేత తన జోలికి రాకుండా ఉండేందుకు తనను, తన కుటుంబ సభ్యులను ముంబై నుంచి కృష్ణాజిల్లాకు తీసుకొచ్చి మూడు రోజులు ఓ గెస్ట్ హౌస్‌లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది. తనకు ప్రాణహాని ఉందని, పోలీసుల రక్షణ కావాలంటూ కంటతడి పెట్టింది.

ఈ వ్యవహారంపై అప్పటి ప్రభుత్వానికి సంబంధించి పెద్ద తలకాయులు ఉన్నారని పేర్కొంది. మా ఫ్యామిలీకి చెందిన 10 ఫోన్లు తీసుకెళ్లారని, అందులో చాలా సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికీ వాటిని ఇవ్వలేదని, చివరకు తమ బ్యాంక్ అకౌంట్లను సైతం బ్లాక్ చేయించారని తెలిపింది. చివరకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కన్నీరుమున్నీరైంది.

తన విషయంలో అప్పటి పాలకులు సక్సెస్ అయ్యారని, నా ఫ్యామిలీ, నేను రిస్కులో పడ్డామని వెల్లడించింది ఆ నటి. మా ఫ్యామిలీపై దేశవ్యాప్తంగా కేసులు సిద్ధమయ్యారని, అధికారంతో నా కెరీర్‌ను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో జోక్యం చేసుకున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ కేసు మళ్లీ రీఓపెన్ చేయాలని కోరింది. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడ్డానని, అప్పటి విషయాలు తలచుకుంటే ఇప్పటికే నిద్ర రావడం లేదని తెలిపింది. నటి కుటుంబ సభ్యులతో ఏపీ అధికారులు మాట్లాడినట్టు సమాచారం.

మరోవైపు ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. కామా పార్టీగా మారిందని, ఇలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సిరావడం తనకే సిగ్గు వేస్తోందన్నారు. చివరకు ఆ పార్టీ అధ్యక్షుడు సైతం నోరు ఎత్తలేదన్నారు.

 

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×