EPAPER

West Godavari: పిల్లల భవిష్యత్తు కోసం సౌదీ వెళ్లి.. తిరిగి వస్తూ అనాధలా చనిపోయింది.

West Godavari: పిల్లల భవిష్యత్తు కోసం సౌదీ వెళ్లి.. తిరిగి వస్తూ అనాధలా చనిపోయింది.

పశ్చిమగోదావరి జిల్లా మంచిలి గ్రామానికి చెందిన సత్యపద్మ ఏడాది క్రితం కువైట్ కు ఉద్యోగం కోసం వెళ్లింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితులను అధిగమించి.. ఇద్దరు మగపిల్లలను బాగా చదివించి ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని ఆమె తపన. అందుకే దేశంకాని దేశానికి తరలివెళ్లింది. అప్పటికే ఆమెకు గుండెలో చిల్లుపడి అనారోగ్యంతో బాధపడుతోంది. ఆరోగ్యం సహకరించకపోయినా బిడ్డల కోసం ఇబ్బంది పడుతూనే కువైట్ వెళ్లింది. అక్కడికి వెళ్లాక మాయదారి రోగం ఆమెను మరింతగా వెంటాడింది. గుండె సహకరించకపోయినా మందులు మింగుతూనే.. కువైట్ షేక్ ఇంట్లో పని చేసింది. అయితే జబ్బుతో ఉన్న ఆవిడ మా ఇంట్లో పనిమనిషిగా వద్దని ఆమెను ఉద్యోగం నుంచి కువైట్ షేక్‌లు తీసేశారు.

ఏం చేయాలో పాలుపోని స్థితిలో తాను ఇండియాకు తిరిగెళ్లిపోతానని.. తనను కువైట్ తెచ్చిన కన్సల్టెన్సీని ఆశ్రయించింది. ఏడాదిగా తన బిడ్డలను చూసుకోలేదని.. దయచేసి తొందరగా ఇండియాకు పంపించాలని వేడుకుంది. అయితే కన్సల్టెన్సీ వాళ్లు అందుకు ఒప్పుకోలేదు. రెండు లక్షల పదివేలు కడితేనే ఇండియాకు పంపిస్తామంటూ రెండు నెలల పాటు ఆమెను అక్కడే ఉంచేశారు. ఓ వైపు గుండెజబ్బు ఇంకోవైపు పిల్లలను చూడాలన్న తపనతో నరకం చూసింది సత్యపద్మ. కనీసం వేసుకోవాడానికి మందులు కూడా లేక ఆరోగ్యం మరింత క్షీణించింది. చివరికి ఆమె భర్త ఇంటిని తాకట్టుపెట్టి రెండు లక్షల పదివేల రూపాయలను కన్సల్టెన్సీకి చెల్లించి.. తర్వాత ఆమెకు టికెట్ బుక్ చేసి చేశాడు.


ఇన్ని ఇబ్బందుల తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ దిగి తణుకు ఆర్టీసీ బస్సు ఎక్కిందామె. తన ఇద్దరు మగబిడ్డలను ఎప్పుడెప్పుడు చూస్తానా.. అనే సంతోషంలో ఇన్నాళ్లు పడిన బాధ అంతా మర్చిపోయింది. మరి కొన్ని గంటల్లోనే భర్త పిల్లలను చూస్తానని ఆనందపడింది. కానీ.. ఆర్టీసీలో విజయవాడ వెళ్లాక మార్గమధ్యంలోనే బస్సు సీట్లనే ఆమె గుండె ఆగిపోయింది. కన్న బిడ్డలిద్దర్నీ కళ్లారా చూసుకోకుండానే కన్నుమూసింది సత్యపద్మ.

Also Read: కడప ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లో ఆరుగురు మృతి

తల్లి కువైట్ నుంచి వస్తుందని తమకు ఎన్నెన్నో బహుమతులు తెస్తుందని ఆ ఇద్దరు బిడ్డలు ఇంటి బయటే అమ్మ కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మరాగానే తమని గుండెలకు హత్తుకుంటుందని ఎత్తుకుంటుందని ఆ పిల్లలిద్దరూ ఆశపడ్డారు. కానీ నవ్వుతూ ఇంట్లో అడుగుపెట్టాల్సిన అమ్మ.. శవంగా ఇంటికి వచ్చింది..అమ్మ ఇక లేదని తెలిసి గుండెలలిసేలా ఏడుస్తున్నారు ఆ చిన్నారులు ఇంతటి బాధలోనూ.. గుండె జబ్బు వెంటాడుతున్నప్పటికీ తమ పిల్లలకు కువైట్ నుంచి బోలెడన్ని గిఫ్టులు కొంది సత్యపద్మ.. ఇంటికెళ్లగానే మాకేం తెచ్చావ్ అమ్మా..అని పిల్లలు అంటే సంతోషంగా బ్యాగ్ తెరిచి వాటిని పిల్లలకు ఇవ్వాలనుకుంది.సెంటు బాటిల్లు. ట్యాబ్ లు, వాచ్ లు, చాక్లెట్లు,బూట్లు, బట్టలు ఇలా చాలానే కొన్నది.ఆ తల్లి..ఆవిడ కొన్న వస్తువులు పిల్లలకు చేరాయి గానీ.. ఆమె మాత్రం ప్రాణాలతో ఇంటికి చేరలేకపోయింది.

సత్యపద్మ..మరణం వార్త తెలుసుకుని ఊళ్లో ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు..ఆరోగ్యం సహకరించకపోయినా వేరే దేశం వెళ్లిందని బాధపడుతున్నారు..ఆరోగ్యం బాగాలేదని చెబుతున్నా సరే..కన్సల్టెన్సీవాళ్లు దుర్మార్గంగా వ్యవహరించి మందులు కూడా ఇవ్వకుండా రెండేళ్లపాటు వేధించారని ఆరోపిస్తున్నారు..భర్త అప్పులు చేసి ఇల్లు తాకట్టుపెట్టి డబ్బులు పంపేదాక సత్యపద్మను పంపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సత్యపద్మ చనిపోయిందని తెలుసుకున్న కన్సల్టెన్సీ సిబ్బంది ముసలి కన్నీరు కారుస్తున్నారు.. ఫోన్ లైన్లో కన్సల్టెన్సీ మేనేజర్ తో స్థానికులు మాట్లాడారు.. విచిత్రమేమంటే కువైట్ లో ఉన్న ఆ కన్సల్టెన్సీలో పని చేసే మహిళ కూడా తెలుగు వారే అయినా సరే కనీస జాలి చూపించలేదు..ఫోన్ లో ఆవిడ ఏమంటుందో వినండి. కుటుంబాన్ని చేరుకొవడానికి పద్మ దేశాలను, నరకాన్ని దాటుకొచ్చింది. కానీ మృతువును మాత్రం దాటుకు రాలేకపోయింది. ప్రేమగా పిల్లలను పలకరించాల్సిన పద్మ.. మృతదేహం రూపంలో ఇంటికి వచ్చింది. సత్యపద్మ మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు బంధువులు. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలు తల్లిలేని అనాధలయ్యారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×