EPAPER

Duvvada Srinivas : రచ్చకెక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం.. అర్థరాత్రి హైడ్రామా.. అసలేం జరిగింది ?

Duvvada Srinivas : రచ్చకెక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం.. అర్థరాత్రి హైడ్రామా.. అసలేం జరిగింది ?

Duvvada Srinivas Family Issue: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కుటుంబ గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. టెక్కలిలోని దువ్వాడ నివాసం దగ్గర అర్థరాత్రి హైడ్రామా నడిచింది. దువ్వాడ ఇంటి ముందు ఆయన కుమార్తెలు నిరసన చేపట్టారు. ఫోన్ చేసినా.. తమ తండ్రి స్పందించడం లేదని వాపోయారు.


తమ తండ్రి వేరే మహిళతో ఉంటూ తమను పట్టించుకోవటం లేదనేది ఆయన కుమార్తెలు హైందవి, నవీన ల ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి కారులో వచ్చారు. వారు తలుపులు తీయకపోవడంతో ఇంటి బయటే కారులో నిరీక్షించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ.. 5 గంటలసేపు పడిగాపులు పడినా స్పందన లేదు. ఎంత సేపటికీ దువ్వాడ శ్రీనివాస్ తలుపులు తీయకపోవడంతో అర్థరాత్రి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పెద్దకుమార్తె హైందవి మాట్లాడుతూ.. తన భర్త తండ్రి చనిపోయినా.. కనీసం పరామర్శించేందుకు కూడా రాలేదని వాపోయింది. తామెన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్ లు పంపినా వేటికీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గేటు తీసి లోపలికి వెళ్తామన్న భయంతో .. లోపలివైపు తాళాలు వేసేసుకున్నారని వాపోయిందామె.


దువ్వాడ కుటుంబంలో చాన్నాళ్ల నుంచి వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా.. అవి ఇప్పుడు బయట పడ్డాయి. శ్రీనివాస్ కు తమ తల్లితో చట్టపరంగా విడాకులు కాలేదని ఆయన కుమార్తెలు చెబుతున్నారు. కాగా.. మరో మహిళతో ఎలా ఉంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తమ తండ్రి కలిసి ఉంటున్న మహిళకు గతంలోనే పెళ్లై పిల్లలుకూడా ఉన్నారని, తమ తండ్రిని ట్రాప్ చేసి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.

ఆయనతో కలిసి ఉండాలని లేదు..

దువ్వాడ శ్రీనివాస్ మరో స్త్రీ తో కలిసి ఉండటంపై భార్య వాణి స్పందించారు. తామిద్దరిదీ ప్రేమ వివాహమని చెప్పారామె. తన తల్లిదండ్రులు ఒక పాప పుట్టాక కూడా పై చదువులు చదువుకోమని చెప్పినా.. తనకు బంధాలు, విలువలు అడ్డొచ్చాయన్నారు. ఆయనలో కోపం చూశానని, తనను హెరాస్ చేసేవాడని చెప్పుకొచ్చారు. ఆయన రాజకీయాలతో తామెంతో నష్టపోయామని, ఎన్నో కుటుంబాలు అన్యాయమైపోయారని వాపోయారు. దువ్వాడ శ్రీనివాస్ గడప గడపకు వైసీపీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆమెను చూసిన వారంతా తనకు చెప్పారని, వారంతా అసహ్యించుకునే విధంగా నడుచుకున్నారని తన దృష్టికిి వచ్చిందన్నారు.

ఏదేమైనా దువ్వాడ శ్రీనివాస్ వల్ల తమ కుటుంబం పరువుపోతోందన్నారు. ఆయన నుంచి తమకెలాంటి ఆస్తులు రాలేదని, ఆయన టెక్కలి వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఆయన నుంచి తనకొక్క రూపాయి కూడా అక్కర్లేదని, పిల్లల బాధ్యత మాత్రం ఆయనే చూసుకోవాలన్నారు.

 

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×