EPAPER
Kirrak Couples Episode 1

MLA Malladi Vishnu : వైసీపీలో మల్లాది విష్ణు టికెట్ గల్లంతు.. సొంత గూటికి వెళ్లనున్నారా..?

MLA Malladi Vishnu : విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రాజకీయ ప్రయాణం ఎటు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది .. నిన్న మొన్నటివరకు వైసీపీలోనే తిరిగి టికెట్ దక్కుతుందన్న నమ్మకంతో ఉన్న మల్లాది విష్ణుకి షాక్ ఇచ్చారు జగన్.. మార్పులు చేర్పుల కసరత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లిని సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు .. దాంతో మల్లాది విష్ణు అలకపాన్పు ఎక్కారు .. జగన్ ఎంతమందిని రాయబారానికి పంపించి ..బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందంట.. ఆ క్రమంలో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు అనుచరులు అంటున్నారు.

MLA Malladi Vishnu :  వైసీపీలో మల్లాది విష్ణు టికెట్ గల్లంతు.. సొంత గూటికి వెళ్లనున్నారా..?

MLA Malladi Vishnu : విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రాజకీయ ప్రయాణం ఎటు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. నిన్న మొన్నటివరకు వైసీపీలోనే తిరిగి టికెట్ దక్కుతుందన్న నమ్మకంతో ఉన్న మల్లాది విష్ణుకి షాక్ ఇచ్చారు జగన్.. మార్పులు చేర్పుల కసరత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లిని సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు.. దాంతో మల్లాది విష్ణు అలకపాన్పు ఎక్కారు. జగన్ ఎంతమందిని రాయబారానికి పంపించి ..బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందంట.. ఆ క్రమంలో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు అనుచరులు అంటున్నారు.


వై నాట్ 175 .. అంటున్న వైసీపీ అధినేత జగన్.. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి అభ్యర్ధుల మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది.. పనితీరు బాలేదు.. అవినీతి ఆరోపణలు.. నియోజకవర్గంలో ప్రజావ్యతిరేకత పెరిగిపోయిందంటూ.. సిట్టింగు ఎమ్మెల్యేలను, ఇన్‌చార్జ్‌లను మార్చేస్తున్నారు ముఖ్యమంత్రి.. అలా ఇప్పటికే రెండు దశల్లో 35 అసెంబ్లీ సీట్లో మార్పులు చేర్పులు చేశారు. రెండో దశలో మార్పులు చేసే సమయంలో పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ని సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల్లోనే సెంట్రల్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. కార్యకర్తలను సముదాయించి పార్టీ అధిష్టానంతో మాట్లాడదామని విష్ణు కార్యకర్తలను వెనక్కి పంపించేశారు.. అయితే అధిష్టానం నిర్ణయం మార్చుకోకపోవడంతో మల్లాది విష్ణు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారంటున్నారు.

సెకంట్ లిస్ట్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు వైసీపీ అధిష్టానం పంపించిన రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ వంటి నేతలు మల్లాది విష్ణుని బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం ఆగ్రహం వీడటం లేదంట .. తనకు తప్పనిసరిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని ఖరాఖండిగా తేల్చి చెపుతున్నారంట .. వైసీపీ అధిష్టానం మాత్రం ఈసారి సీటు ఇవ్వలేమని.. ఫ్యూచర్‌లో తగిన న్యాయం చేస్తామని, పార్టీ తప్పకుండా ఆయన సేవలను గుర్తిస్తుందని చెపుతోందంట.. దాంతో మల్లాది విష్ణు తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీని వీడి వేరే పార్టీలో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యారంట.


మల్లాది విష్ణు ముందు ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే టీడీపీకి బెజవాడ సెంట్రల్‌లో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వంటి బలమైన అభ్యర్ధి ఉండటం.. ఆయన రాజకీయంగా ప్రధాన ప్రత్యర్ధి కావడంతో విష్ణు అటు వైపు చూసే ప్రసక్తే లేదు.. అలాగే టీడీపీకి మిత్రపక్షం కావడంతో జనసేన తలుపులు కూడా తెరుచుకోవంటున్నారు. బీజేపీలో చేరినా పెద్ద ప్రయోజనం ఉండదని ఆయన తన సొంతగూడు.. కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుచరవర్గం అంటోంది.

ఏపీలో అచేతనంగా మారిన కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవల దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు షర్మిల జాయిన్ అవ్వడంతో .. ఆ పార్టీలో కొంత కదలిక కనిపిస్తోంది. షర్మిల ఎఫెక్ట్‌తో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటికే కాంగ్రెస్‌కు జై కొట్టేశారు.. జగన్‌పై విమర్శలు చేసిన ఆర్కే.. తన పయనం షర్మిల వెంటేనని స్పష్టం చేశారు.. అలాగే ఇంకొందరు ముఖ్యనేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. దాంతో మల్లాది విష్ణు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉందన్న టాక్ నడుస్తోంది.

తాజాగా సీఎం జగన్ సమక్షంలో జరిగిన సమావేశం నుంచి సైతం మల్లాది విష్ణు అసహనం వ్యక్తం చేస్తూ బయటకు వచ్చేయడంతో .. ఇక ఆయన వైసీపీలో ఇమడలేరన్న స్పష్టత వచ్చేసింది .. ఆ క్రమంలో విష్ణు అతి త్వరలోనే పార్టీ మారే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు ఆయన వర్గీయులు .. మరి మల్లాది విష్ణు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని… విజయవాడ సెంట్రల్ నుంచి తిరిగి పోటీ చేస్తారో? లేదో చూడాలి.

Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×