EPAPER
Kirrak Couples Episode 1

MLA Jonnalagadda Padmavathi : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సీటు గల్లంతు..? సింగనమల సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..?

MLA Jonnalagadda Padmavathi : ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం వస్తుందన్న సెంటిమెంట్‌ను అందరూ నమ్ముతుంటారు. గత కొన్ని ఎన్నికల్లో అదే జరుగుతూ వస్తోంది. ప్రస్తుతమున్న జగన్ సర్కారు విషయంలో కూడా ఆ సెంటిమెంట్ నిజమైంది. అయితే ఈ సారి అక్కడ వైసీపీలో తీవ్ర గందరగోళం కనిపిస్తుండటంతో.. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందా ? అన్న చర్చ జరుగుతోంది. ఇంతకి ఆ సెంటిమెంట్ సెగ్మెంట్ ఏది?

MLA Jonnalagadda Padmavathi : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సీటు గల్లంతు..? సింగనమల సెంటిమెంట్  వర్కౌట్ అయ్యేనా..?

MLA Jonnalagadda Padmavathi : ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం వస్తుందన్న సెంటిమెంట్‌ను అందరూ నమ్ముతుంటారు. గత కొన్ని ఎన్నికల్లో అదే జరుగుతూ వస్తోంది. ప్రస్తుతమున్న జగన్ సర్కారు విషయంలో కూడా ఆ సెంటిమెంట్ నిజమైంది. అయితే ఈ సారి అక్కడ వైసీపీలో తీవ్ర గందరగోళం కనిపిస్తుండటంతో.. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందా ? అన్న చర్చ జరుగుతోంది. ఇంతకి ఆ సెంటిమెంట్ సెగ్మెంట్ ఏది?


ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట.. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆ ఆధిక్యత నిలుపుకోవడానికి ముందస్తుగా అప్రమత్తమైంది వైసీపీ అధిష్టానం. అందులో భాగంగా టికెట్ల మార్పులు చేర్పుల అంశం తెరమీదకు తీసుకొచ్చింది. ఇప్పటికే రెండు చోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతు చేసింది. మరో మూడు చోట్ల సిట్టింగుల నియోజకవర్గాలు మార్చేసింది. ఇంకా ఈ మార్పులు చేర్పుల జాబితాలో మరో నాలుగు ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ లిస్టులో ముందు వరుసలో కనిపిస్తోంది శింగనమల నియోజకవర్గం. ఇది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం.. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో వారిదే అధికారం అన్న సెంటిమెంట్.. గత 7 సార్లుగా నిజమవుతూ వస్తోంది. 2019లో ఇక్కడి నుంచి జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ తరఫున మంచి మెజార్టీతో ఎమ్మెల్యే గెలుపొందారు. ఆమె భర్త ఆలూరు సాంబశివరెడ్డి ఉన్నత విద్యాశాఖ సలహాదారులు గా కేబినెట్ ర్యాంక్ లో ఉన్నారు. అంత మెజార్టీ తొ గెలిచినా దానిని నిలబెట్టుకోవడం లో ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సాధారణ కార్యకర్తలని పట్టించుకోలేదన్న ఆరోపణల ఉన్నాయి.


ఇక ముఖ్యంగా శింగనమల నియోజకవర్గంలో రెండు మండలాల నాయకులతో ఎమ్మెల్యే, ఎమ్మెల్యే భర్తకు పూర్తిస్థాయిలో విబేధాలు ఉన్నాయంట.. ముఖ్యంగా ఈ రెండు మండలాలు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెడ్డరెడ్డికి పట్టున్న ప్రాంతాలు..అయితే ముందు నుంచి తాడిపత్రి ఎమ్మెల్యేకు, శింగనమల ఎమ్మెల్యేకు అసలు సరిపడేది కాదంటున్నారు.వారి వర్గపోరు చాలా సార్లు బహిర్గతమైంది. రెండు వర్గాలు కేసులు పెట్టుకొనే వరకు వెళ్ళాయి. దీనిపై తాడిపత్రి ఎమ్మెల్యే ఇంకోసారి తన కార్యకర్తల పై కేసులు పెడితే స్టేషన్ ముందు కూర్చొని ధర్నా చేస్తామని మీడియా ముందు ప్రకటించారు. అధిష్టానానికి వరుస ఫిర్యాదులు కూడా చేశారు.

అలా సొంత పార్టీలోనే ముసలం పుట్టడంతో పాటు.. ఐప్యాక్ చేసిన సర్వే లో ఎమ్మెల్యే పద్మావతిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టమైందంట. దాంతో వచ్చే ఎన్నికల్లో కేండెంట్‌ను మార్చడానికి ఫిక్స్ అయిన వైసీపీ అధిష్టానం. ఎవరైతే బాగుంటుంది అని సర్వే చేయించుకుంటే ఓ పోలీస్ అధికారి పేరు తెరపైకి వచ్చింది. ఆయనే శ్రీనివాసమూర్తి. ప్రస్తుతం చిత్తూరులో డీఎస్పీ గా పని చేస్తున్నారు. ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు పూర్తి ఇంటరెస్టింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.

అది తెలిసి ఎమ్మెల్యే పద్మావతి, ఆమె భర్త మరోసారి టికెట్ దక్కించుకోవడానికి చివరి ప్రయత్నాలు కూడా చేసుకున్నారంట. ఈ ఒక్క సారి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని ప్రాధేయపడినట్లు టాక్ నడుస్తోంది. లేదంటే తాము చెప్పిన వారికి టికెట్ ఇవ్వాలని అని వేడుకున్నారంట. అందులో మాజీ ఎమ్మెల్యే యామిని బాలకు టికెట్ ఇస్తే సహకరిస్తామంటున్న ఎమ్మెల్యే కపుల్.. ఆ పోలీస్ అధికారికి మాత్రం ఇవ్వొద్దు అని హై కమాండ్ ని కోరారంట. అయతే అధిష్టానం మాత్రం డీఎస్పీ వైపే పూర్తిగా మొగ్గు చూపుతోందంట. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తన జిల్లాకు చెందిన సదరు పోలీస్ అధికారికే మద్దతిస్తున్నారంట. దాంతో పద్మావతి దంపతులు తాడేపల్లి నుంచి నిరుత్సాహంగా వెనక్కి వచ్చేశారంటున్నారు. టికెట్ తమకు రాదని ముభావంగా ఉన్నట్లు నియోజకవర్గం లో ప్రచారం జరుగుతోంది. మూడో లిస్ట్ వచ్చే వరకు వారికి ఆ టెన్షన్ తప్పదంటున్నారు.

ఇక మూడో లిస్ట్‌లో తన పేరు ఉంటే.. డీఎస్పీ శ్రీనివాసమూర్తి జాబ్‌కు రిజైన్ చేసేందుకు రెడీ గా ఉన్నారంట. తన పేరు ఉందని తెలిస్తే శింగనమలకు షిఫ్ట్ అయిపోవడానికి అన్ని రెడీ చేసుకున్నారంట. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే వర్గీయులని కొత్త అభ్యర్ధి ఎంతవరకు కలుపుకుని పోగలరు అన్న దానిపై విజయం ఆధారపడి ఉందంటున్నారు విశ్లేషకులు.. ఏదేమైనా చూడాలి వచ్చే ఎన్నికల్లో శింగనమల సెంటిమెంట్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో.

Related News

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

YS Jagan: ఒంటరైన జగన్.. అన్ని డోర్లు క్లోజ్

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Pawan Kalyan Prayaschitta Deeksha: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్.. టీటీడీ బోర్డు ఏం చేసింది ?

Rangaraya Medical College Issue: రంగరాయ మెడికల్ కాలేజీ ఘటన.. దిగొచ్చిన ఎమ్మెల్యే.. డాక్టర్ కు క్షమాపణ

Kadambari Jethwani Case: జెత్వానీ కేసులో నెక్స్ట్ కటకటాల పాలయ్యేది ఎవరంటే?

Big Stories

×